E-Paper
Advertisement

Nosh AI Cooking Robot: ఏఐ కుకింగ్ రోబోట్.. ఒక్క బటన్ నొక్కితే చాలు.. క్షణాల్లో వంట రెడీ!

Nosh AI Cooking Robot: ఏఐ కుకింగ్ రోబోట్.. ఒక్క బటన్ నొక్కితే చాలు.. క్షణాల్లో వంట రెడీ!
Advertisement

Nosh AI Cooking Robot: దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో అందరి దృష్టి స్మార్ట్ కుకింగ్ పరికరాలపై పడింది. అత్యాధునిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ కుక్కర్ కోసం ప్రజలు అన్వేషిస్తున్నారు. అటువంటి వారికి బెస్ట్ ఛాయిస్ గా Nosh AI Cooking Robot స్మార్ట్ కుకింగ్ పరికరం నిలుస్తోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘యుఫోటిక్ ల్యాబ్స్’ (Euphotic Labs) రూపొందించిన ఈ ఏఐ కుకింగ్ రోబోట్.. మనిషి ప్రమేయం లేకుండానే చక్కగా వంటలు వండేస్తుంది. దీనిలోని ప్రధాన ఫీచర్లు, లాభాలు, ధర వివరాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

500+ వంటకాల లైబ్రరీ

ఈ స్మార్ట్ కుకింగ్ రోబోట్‌లో సుమారు 500కు పైగా వంటకాలు (Recipes) ముందుగానే ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. పప్పు, సాంబార్, పులావ్ నుండి పాస్తా, చికెన్ కర్రీ వరకు వివిధ రకాల వంటకాలను ఇది ఎంతో తేలిగ్గా చేయగలదు.

AI విజన్ టెక్నాలజీ

Advertisement

ఈ రోబోటిక్ కుక్కర్.. కెమెరా, సెన్సర్లతో అందుబాటులో వచ్చింది. ఇవి వంట ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. ఉదాహరణకు ఉల్లిపాయలు ఎర్రగా వేగాయా లేదా కూరలో నూనె పైకి తేలిందా వంటి విషయాలను AI ద్వారా గుర్తించి తర్వాతి స్టెప్ ప్రారంభిస్తుంది.

ఆటోమేటిక్ స్ట్రిరింగ్ & డిస్పెన్సింగ్

సాధారణంగా వంట చేసేటప్పుడు అడుగు అంటకుండా గరిటెతో తిప్పడం తప్పనిసరి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మనిషి ఉండాల్సిందే. కానీ ఈ రోబోటిక్ స్మార్ట్ కుక్కర్ లో దానంతట అదే గరిటెతో ఆహారాన్ని తిప్పేసుకుంటుంది. అలాగే అవసరమైన మోతాదులో ఉప్పు, కారం, మసాలాలు, నూనె, నీటిని ఇది స్వయంగా వేసుకుంటుంది. ఇందుకోసం ప్రత్యేకమైన స్పైస్ ట్రేలు, వాటర్, ఆయిల్ కంటైనర్లు దీనిలో ఉంటాయి.

యాప్ కంట్రోల్

Advertisement

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా వంటను ఎక్కడి నుండైనా ప్రారంభించవచ్చు లేదా షెడ్యూల్ చేయవచ్చు. యాప్ ద్వారా వంట పురోగతిని (Progress) లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా చూడవచ్చు.

కాంటాక్ట్‌లెస్ కుకింగ్

ఈ రోబోటిక్ స్మార్ట్ కుక్కర్.. మనిషి అవసరం లేకుండానే వంటను చకా చకా చేసేస్తుంది. మీరు చేయాల్సిందల్లా కేవలం తరిగిన కూరగాయలను నిర్ణీత ట్రేలలో ఉంచడమే. మిగిలిన ప్రక్రియ అంతా రోబోట్ చూసుకుంటుంది.

Also Read: Thomson Streaming Box: గూగుల్ టీవీ స్ట్రీమర్‌కు పోటీగా.. థామ్సన్ 4K బాక్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

కొనడం వల్ల లాభాలు

ఆఫీసు పనులతో బిజీగా ఉండే వారికి లేదా వంట చేయడం రాని వారికి ఇది ఒక గొప్ప వరం. పైగా వంట గదిలో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం దీని వల్ల ఉండదు. హోటల్ ఫుడ్ లేదా ఇన్స్టంట్ ప్యాకెట్ల మీద ఆధారపడకుండా ఇంట్లోనే తాజాగా వండుకొని ఆహారాన్ని తినేందుకు ఇది వీలు కల్పిస్తుంది. దీనిని వినియోగించడం వల్ల మసాలాలు లేదా ఉప్పు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉండదు. ఒకే వంటకాన్ని ప్రతిసారీ ఒకే రుచితో (Consistency) ఈ ఏఐ కుకింగ్ రోబోట్ తయారు చేస్తుంది.

ధర ఎంతంటే?

అమెజాన్ లో Nosh AI Cooking Robot రూ.74,999కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.99,999 కాగా 25 శాతం రాయితీతో అమెజాన్ దీనిని అందిస్తోంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ తదితర రాయితీలు సైతం అమెజాన్ లో లభిస్తున్నాయి.

Also Read: North Korea: కూతురితో కలిసి.. యుద్ద ట్యాంక్‌పై షికారు.. కిమ్ మామ స్టైలే వేరు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×