E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్లకే చెమటలు పట్టిస్తున్న.. నోకియా కొత్త కీప్యాడ్ ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

స్మార్ట్‌ఫోన్లకే చెమటలు పట్టిస్తున్న.. నోకియా కొత్త కీప్యాడ్ ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Nokia AI Keypad Phones: సాధారణంగా కీప్యాడ్ ఫోన్ అనగానే కేవలం కాల్స్, మెసేజ్‌లకే మాత్రమే పనికి వస్తుందని అందరూ భావిస్తుంటారు. నోకియా బ్రాండ్ ఓనర్ హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) ఈ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), 4G కనెక్టివిటీతో పనిచేసే నాలుగు సరికొత్త క్లాసిక్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవి కీప్యాడ్ ఫోన్ల అస్థిత్వాన్ని కోల్పోకుండానే స్మార్ట్‌ఫోన్ స్థాయి ఫీచర్లను అందిస్తున్నాయి.

నోకియా 235 4జీ రెండో ఎడిషన్

ఈ సిరీస్‌లో విడుదలైన నాలుగు మోడళ్లలో ‘నోకియా 235 4G సెకండ్ ఎడిషన్’ అత్యంత కీలకమైన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. 2.8 అంగుళాల స్క్రీన్‌తో వచ్చే ఈ ఫోన్‌లో వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు వీలుగా 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో పాటు ఒక వీజీఏ (VGA) ఫ్రంట్ కెమెరాను కూడా అమర్చారు. కీప్యాడ్ ఫోన్లలో వీడియో కాలింగ్ సదుపాయం రావడం ఇదే తొలిసారని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

క్లిక్ చేయగానే ఏఐ ప్రత్యక్షం

Advertisement

నోకియా లేటెస్ట్ క్లాసిక్ ఫోన్లలో ప్రత్యేకంగా ఏఐ బటన్ ను తీసుకొచ్చారు. దీని ద్వారా వినియోగదారులు నేరుగా జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. స్పానిష్, కాటలాన్ వంటి పలు భాషల్లో ఇది పనిచేస్తుంది. ఈ ఏఐ సహాయంతో వాతావరణ సమాచారం, క్రీడా వార్తలు, క్విక్ సెర్చ్ వంటివి ఈజీగా చేయెుచ్చు. అలాగే ఇందులోని ‘ఎక్స్‌ప్రెస్ చాట్’ (Xpress Chat) యాప్ ద్వారా సాంప్రదాయ SMSలతో పనిలేకుండా ఇన్‌స్టంట్ చాటింగ్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. క్లౌడ్ ఫోన్ సర్వీస్ వల్ల డేటా అంతా క్లౌడ్‌లోనే స్టోర్ అవుతుంది కాబట్టి ఫోన్ మెమరీ నిండిపోతుందనే భయం ఉండదు.

నోకియా 200, 210, 215 4G మోడళ్లు

నోకియా 235తో పాటు 200 4G, 210 4G, 215 4G అనే మరో మూడు మోడళ్లను కూడా హెచ్ఎండీ లాంచ్ చేసింది. డిజైన్, స్క్రీన్ రిజల్యూషన్, కెమెరా పరంగా వీటి మధ్య చిన్నపాటి తేడాలు ఉన్నప్పటికీ ఏఐ ఫీచర్లు, 4G కనెక్టివిటీని అన్నింటిలోనూ కామన్ గా అందించారు. వీటిలో బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో పాటు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మెమరీని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.

12 రోజుల బ్యాటరీ లైఫ్

Advertisement

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యూజర్లు మెుబైల్ ను ఫుల్ గా ఛార్జ్ చేసినప్పటికీ 24 గంటలపాటు బ్యాటరీ లైఫ్ ఉండట్లేదని బాధపడుతున్నారు. అలాంటిది.. ఈ సరికొత్త నోకియా ఫోన్లు ఏకంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తున్నాయి. ప్రయాణాలు చేసే వారికి, బ్యాకప్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

Also Read: విశాఖ స్పెషల్.. వాల్తేరు, గాజువాక, అసీల్‌మెట్ట ప్రాంతాలకు.. ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

మరి ధరల సంగతేంటి?

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిన నోకియా కీప్యాడ్ ఫోన్లు.. త్వరలోనే భారత్ లోనూ ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే.. నోకియా ప్రీమియం ఫోన్ (235 4G సెకండ్ ఎడిషన్) ధర దాదాపుగా రూ.3,999 వరకూ ఉండొచ్చని అంచనా. అలాగే నోకియా 215 4G మోడల్ రూ.2,999-3,500.. నోకియా 200, 210 మోడళ్లు రూ.1.499-1,999 మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: బట్టలు త్వరగా ఆరి పోవాలా? ఈ ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్ పై ఓ లుక్కేయండి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×