E-Paper
Advertisement

అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్‌లు.. వీటి కంటే బెస్ట్ ఉండవేమో !

అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్‌లు.. వీటి కంటే బెస్ట్ ఉండవేమో !
Advertisement

NoiseFit Force 2 vs beatXP Terra: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్ కేవలం సమయం చూసుకోవడానికే కాదు, అదొక పర్సనల్ అసిస్టెంట్‌గా మారిపోయింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం NoiseFit Force 2, beatXP Terra మార్కెట్లో గట్టి పోటీనిస్తున్నాయి. ఈ రెండూ సర్కిల్ (వృత్తాకార) డయల్‌తో క్లాసీ లుక్‌ను అందిస్తాయి. అయితే.. వీటిలో మీ అవసరాలకు తగ్గట్టుగా ఏది సరైనదో తెలుసుకోవడం ముఖ్యం. డిస్‌ప్లే క్వాలిటీ నుంచి బ్యాటరీ లైఫ్ వరకు వీటి మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

NoiseFit Force 2 vs beatXP Terra-పూర్తి వివరాలు:

Advertisement

డిజైన్ , డిస్‌ప్లే :
ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు కూడా రౌండ్ డయల్ డిజైన్‌తో వస్తాయి. నాయిస్ ఫిట్ ఫోర్స్ 2 జింక్ అలాయ్ , పాలీకార్బోనేట్ మెటీరియల్‌తో దృఢంగా ఉంటుంది.

NoiseFit Force 2: ఇందులో 1.39 ఇంచుల కలర్ IPS డిస్‌ప్లే ఉంది. ఇది 550 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

Advertisement

beatXP Terra: ఇందులో కూడా 1.39 ఇంచుల కలర్ HD డిస్‌ప్లే ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది Always On Display (AOD) ఫీచర్‌తో పాటు 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీని వల్ల వాచ్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది.

కనెక్టివిటీ, కాలింగ్:
ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లలో బ్లూటూత్ కాలింగ్ అనేది తప్పనిసరి ఫీచర్.

ఈ రెండు వాచ్‌లలోనూ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంది. ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ , స్పీకర్ ద్వారా నేరుగా వాచ్ నుంచే మాట్లాడవచ్చు.

నాయిస్ వాచ్‌లో ప్రత్యేకంగా జీపీఎస్ ఆప్షన్ ఉండటం ట్రాకింగ్ చేసే వారికి కలిసి వచ్చే అంశం.

హెల్త్ , ఫిట్‌నెస్ ఫీచర్లు :
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారి కోసం ఈ రెండింటిలోనూ దాదాపు ఒకే రకమైన సెన్సార్లు ఉన్నాయి.

Heart Rate & SpO2: రెండు వాచ్‌లలో హార్ట్ బీట్ , రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను కొలిచే సెన్సార్లు ఉన్నాయి.

Sleep & Step Tracking: నిద్ర నాణ్యతను, రోజూ నడిచే అడుగులను ఇవి కచ్చితంగా లెక్కిస్తాయి.

Special Features: నాయిస్ వాచ్‌లో మహిళల కోసం ‘మెన్స్ట్రువల్ ట్రాకింగ్’ ఫీచర్ ఉంది. అయితే.. ఈ రెండింటిలోనూ బీపీ మానిటర్ అవకాశం లేదు.

బ్యాటరీ:
బ్యాటరీ విషయానికి వస్తే నాయిస్ కొంచెం ముందు వరుసలో ఉంది.

NoiseFit Force 2: ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే.. 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.

beatXP Terra: ఇది 5 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

IP67 రేటింగ్: ఈ రెండు వాచ్‌లు కూడా IP67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ కలిగి ఉన్నాయి. అంటే చెమట, చిన్నపాటి వర్షం తగిలినా ఏమీ కాదు.

వారంటీ :
వారంటీ: నాయిస్ 1 సంవత్సరం వారంటీ ఇస్తుండగా.. beatXP ఏకంగా 2 సంవత్సరాల మాన్యుఫ్యాక్చరర్ వారంటీని ఇస్తోంది. ఇది కస్టమర్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

స్పోర్ట్స్ మోడ్స్: నాయిస్‌లో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇది క్రీడాకారులకు బాగా ఉపయోగపడుతుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×