E-Paper
Advertisement

నోయిస్ విజన్ 3 పై భారీ ఆఫర్.. రూ. 2,599కే లగ్జరీ అమోలెడ్ స్మార్ట్‌వాచ్!

నోయిస్ విజన్ 3 పై భారీ ఆఫర్.. రూ. 2,599కే లగ్జరీ అమోలెడ్ స్మార్ట్‌వాచ్!
Advertisement

Noise Vision 3: బడ్జెట్ ధరలో లగ్జరీ స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే వారికి పండగే. నోయిస్ కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ ప్రీమియం మోడల్ ‘నోయిస్ విజన్ 3’ (Noise Vision 3) పై క్రేజీ డిస్కౌంట్ నడుస్తోంది. ఇన్నాళ్లూ రూ.3,500 పైనే ఉన్న ఈ అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్, ప్రస్తుతం కేవలం రూ.2,599 కే లభిస్తోంది. అల్ట్రా-థిన్ బెజెల్స్, మెటాలిక్ బాడీ, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లతో ఈ వాచ్ ప్రస్తుతం డిస్కవరీలో ట్రెండ్ అవుతోంది.

స్మార్ట్‌వాచ్ మార్కెట్లో కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ముఖ్యంగా రూ.2,500 బడ్జెట్‌లో చాలా కంపెనీలు నార్మల్ ఎల్‌సీడీ డిస్‌ప్లేలతో సర్దుకుపోతుంటాయి. కానీ.. ఇండియాస్ నంబర్ వన్ వేరబుల్ బ్రాండ్ ‘నోయిస్'(Noise) మాత్రం తన ప్రీమియం మోడల్ అయిన ‘Noise Vision 3’ ధరను ఏకంగారూ.2,599 కి తగ్గించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ప్రైస్ రేంజ్‌లో ప్రీమియం యాపిల్ వాచ్ లాంటి డిజైన్ , అమోలెడ్ స్క్రీన్ లభించడం నిజంగా జాక్‌పాట్ ఆఫర్.

ఫీచర్ల పూర్తి వివరాలు:

Advertisement

అమోలెడ్ డిస్‌ప్లే:
ఈ వాచ్ చేతికి పెట్టుకుంటే వచ్చే లుక్కే వేరు. ఇందులో పెద్దదైన 1.96 ఇంచుల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఇచ్చారు. దీని బెజెల్స్ చాలా సన్నగా ఉండటం వల్ల స్క్రీన్ చాలా రిచ్‌గా,లగ్జరీగా కనిపిస్తుంది. పైగా ఇందులో ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ ఉండటం వల్ల ప్రతిసారీ బటన్ నొక్కే పని లేకుండా టైమ్ చూసుకోవచ్చు. ఎండలో సైతం స్క్రీన్ చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది.

ప్రీమియం మెటాలిక్ బాడీ:
రూ.2,599 ధరలోనే ఈ వాచ్‌కు హై-క్వాలిటీ మెటాలిక్ ఫినిషింగ్ బాడీ ఇచ్చారు. దీని వల్ల వాచ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండటమే కాకుండా ఈజీగా స్క్రాచెస్ పడవు. వాచ్ సైడ్‌లో ఉన్న ఫంక్షనల్ క్రౌన్ బటన్ ద్వారా మెనూలను చాలా స్మూత్‌గా స్క్రోల్ చేయవచ్చు. ఇది సిలికాన్, క్లాసీ మెటల్ మేష్ స్ట్రాప్ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisement

లాగ్-ఫ్రీ బ్లూటూత్ కాలింగ్:
ఈ వాచ్‌లో అడ్వాన్స్‌డ్ సింగిల్-చిప్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. దీని వల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ అస్సలు కట్ అవ్వదు, ఫోన్ కనెక్టివిటీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇన్-బిల్ట్ మైక్ , స్పీకర్స్ లౌడ్‌గా ఉండటం వల్ల బైక్ పై వెళ్తున్నప్పుడు లేదా క్రౌడెడ్ ఏరియాలో ఉన్నప్పుడు కూడా సులభంగా మాట్లాడవచ్చు. మీ ఫేవరెట్ కాంటాక్ట్స్‌ను వాచ్‌లోనే సేవ్ చేసుకోవచ్చు.

24/7 హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ట్రాకింగ్:
తక్కువ ధరే కదా అని హెల్త్ ఫీచర్స్ తక్కువ లేవు. నోయిస్ హెల్త్ సూట్ ద్వారా..

హార్ట్ రేట్ & SpO2 మానిటర్: గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ఖచ్చితంగా కొలుస్తుంది.

స్లీప్ & స్ట్రెస్ ట్రాకింగ్: మీ నిద్ర నాణ్యతను రికార్డ్ చేస్తుంది. ఒత్తిడి పెరిగితే అలర్ట్ చేస్తుంది.

100+ స్పోర్ట్స్ మోడ్స్: మీరు రన్నింగ్ చేసినా.. జిమ్‌కి వెళ్లినా మీ క్యాలరీల బర్న్ డేటాను ఇది సేవ్ చేస్తుంది.

Also Read: మెజాన్ ప్రైమ్ డే సేల్.. దెబ్బకు పడిపోయిన శాంసంగ్ ఎస్25 అల్ట్రా ధర

బ్యాటరీ అండ్ వాటర్ రెసిస్టెన్స్:
ఈ స్మార్ట్‌వాచ్ నార్మల్ యూసేజ్‌లో ఏకంగా 7 రోజుల లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది (కాలింగ్ ఫీచర్ వాడితే 2 రోజుల వరకు వస్తుంది). అలాగే దీనికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది. కాబట్టి వర్షంలో తడిసినా లేదా వర్కౌట్ చేసేటప్పుడు చెమట పట్టినా వాచ్ పాడవుతుందనే టెన్షన్ అక్కర్లేదు.

ధర వివరాలు:
నోయిస్ విజన్ 3 ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్స్ , నోయిస్ అఫీషియల్ వెబ్‌సైట్లో కేవలం రూ. 2,599 ప్రత్యేక ఆఫర్ ధరకే అందుబాటులో ఉంది. కొన్ని బ్యాంక్ కార్డ్‌లపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.రూ. 2,500 బడ్జెట్‌లో ప్రీమియం లుక్, బిగ్ అమోలెడ్ స్క్రీన్ , కాలింగ్ ఫీచర్ కావాలనుకునే.. వారికి ప్రస్తుత మార్కెట్లో దీనికంటే బెస్ట్ ఆప్షన్ లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×