E-Paper
Advertisement

అమ్మాయిల కోసమే స్పెషల్ వాచ్! నెక్స్ట్ లెవెల్ లుక్‌తో.. Noise Diva 2 లాంచ్!

అమ్మాయిల కోసమే స్పెషల్ వాచ్! నెక్స్ట్ లెవెల్ లుక్‌తో.. Noise Diva 2 లాంచ్!
Advertisement

Noise Diva 2 fashion smart watch: ఈ రోజుల్లో.. స్మార్ట్‌ వాచ్ అనేది కేవలం టైమ్ చూసే గ్యాడ్జెట్ మాత్రమే కాదు.. అదొక స్టైల్ స్టేట్‌మెంట్! ముఖ్యంగా అమ్మాయిల చేతికి నప్పేలా, ట్రెండీ అవుట్‌ఫిట్స్‌పైకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే స్మార్ట్‌ వాచ్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తూ ప్రముఖ బ్రాండ్ నాయిస్ నుంచి Noise Diva 2 Fashion Smart Watch మార్కెట్లోకి వచ్చేసింది. మెటాలిక్ ఫినిషింగ్, అల్ట్రా-ప్రీమియం డిజైన్, బోలెడన్ని ఉమెన్ హెల్త్ ఫీచర్లతో.. వస్తున్న ఈ లేటెస్ట్ లేడీస్ స్మార్ట్‌వాచ్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

స్టైల్ అండ్ ఫిట్‌నెస్ పీక్స్:

సాధారణంగా మార్కెట్లో దొరికే చాలా స్మార్ట్‌వాచ్‌లు అబ్బాయిల చేతులకు తగ్గట్టుగా పెద్దగా, రఫ్‌గా ఉంటాయి. కానీ Noise Diva 2 అలా కాదు. ఇది ప్యూర్ గా ఉమెన్ ఫ్యాషన్ , వారి లైఫ్‌స్టైల్‌ను మైండ్‌లో పెట్టుకుని డిజైన్ చేసిన అద్భుతమైన వాచ్.

Advertisement

అల్ట్రా-ప్రీమియం, స్లీక్ డిజైన్ :
ఈ వాచ్ చూడటానికి ఒక నార్మల్ స్మార్ట్‌వాచ్ లా కాకుండా.. ఒక లగ్జరీ రిస్ట్ వాచ్ లా ఉంటుంది. ఇందులో .. రౌండ్ డయల్‌తో పాటు అదిరిపోయే.. అమోల్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. దీని ‘ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే’ ఫీచర్ వాచ్ లుక్‌ను మరింత పెంచుతుంది. మెటాలిక్ బాడీ, ప్రీమియం లెదర్ మెష్ స్ట్రాప్స్ ఆప్షన్లతో రావడం వల్ల ఇది శారీస్, వెస్ట్రన్ వేర్, లేదా ఆఫీస్ ఫార్మల్స్.. ఇలా దేనిమీదకైనా ఇట్టే సెట్ అయిపోతుంది. పైగా వందలాది క్లాసీ క్లౌడ్ వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి.

బ్లూటూత్ కాలింగ్:
షాపింగ్ చేస్తున్నప్పుడో లేదా జర్నీలో ఉన్నప్పుడో హ్యాండ్‌బ్యాగ్ లోంచి ఫోన్ బయటకు తీయడం అమ్మాయిలకు పెద్ద టాస్క్. కానీ ఈ వాచ్‌లో ఉన్న అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ వల్ల మీరు డైరెక్ట్‌గా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ మైక్, స్పీకర్ చాలా క్లియర్‌గా పనిచేస్తాయి.

Advertisement

ఉమెన్ స్పెషల్ హెల్త్ ట్రాకింగ్ :
ఈ వాచ్ అమ్మాయిలకు ఒక పర్ఫెక్ట్ హెల్త్ పార్ట్నర్ లా హెల్ప్ చేస్తుంది. ఇందులో..

ఫీమేల్ మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్: పీరియడ్స్ డేట్స్‌ను ట్రాక్ చేయడానికి, అలర్ట్స్ ఇవ్వడానికి ఇది చాలా యూస్ అవుతుంది.

హార్ట్ రేట్ & SpO2 మానిటర్: 24/7 మీ గుండె వేగాన్ని, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని చెక్ చేస్తుంది.

స్లీప్ ట్రాకింగ్: మీరు రాత్రి పూట ఎంత సేపు ప్రశాంతంగా నిద్రపోయారో పర్ఫెక్ట్ డేటాను ఇస్తుంది.

స్ట్రెస్ మానిటర్: మీ బాడీ స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి రిలాక్స్ అవ్వమని సూచిస్తుంది.

బ్యాటరీ లైఫ్ అండ్ వాటర్ రెసిస్టెన్స్:

సింగిల్ ఛార్జ్‌పై ఈ వాచ్ దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పని చేస్తుంది (కాలింగ్ వాడితే 2 రోజులు వస్తుంది).అలాగే.. ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.అంటే.. వంట చేస్తున్నప్పుడు నీళ్లు పడినా, లేదా వర్షంలో తడిసినా వాచ్ పాడైపోతుందనే టెన్షన్ లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×