E-Paper
Advertisement

ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవ్వడం మీ డ్రీమా? తక్కువ ధరలో లభించే ఈ Nikon D7500 మీ కోసమే!

ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవ్వడం మీ డ్రీమా? తక్కువ ధరలో లభించే ఈ Nikon D7500 మీ కోసమే!
Advertisement

Best DSLR Camera: ఫోటోగ్రఫీ అంటే ఇష్టమున్న వాళ్లు తమ స్కిల్స్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలినుకునే వారికి నికాన్ కెమెరాలు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా నిలుస్తాయి. ముఖ్యంగా నికాన్ D7500 మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 20.9 మెగాపిక్సెల్ సెన్సార్‌తో అద్భుతమైన క్లారిటీ ఇచ్చే ఈ కెమెరా.. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో చాలా ఆకర్షణీయమైన ధరకే అందుబాటులో ఉంది. అంతేకాదు.. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు మెచ్చే ఎన్నో ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం.

అద్భుతమైన ఫోటో క్వాలిటీ..

ఈ కెమెరా పనితీరు విషయానికి వస్తే.. దీనిలో నికాన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ D500లో వాడే సెన్సార్‌నే ఉపయోగించారు. దీనివల్ల ఫోటోలు చాలా షార్ప్‌గా, సహజమైన రంగులతో వస్తాయి. తక్కువ వెలుతురులో కూడా నాయిస్ లేకుండా క్లియర్ ఫోటోలు తీయడానికి దీని హై-ISO రేంజ్ (51,200 వరకు) ఎంతో తోడ్పడుతుంది. అలాగే కదులుతున్న వస్తువులను షూట్ చేయాలనుకుంటే.. ఇది సెకనుకు 8 ఫ్రేమ్‌ల వేగంతో ఫోటోలను తీయగలదు. వైల్డ్ లైఫ్, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ చేసేవారికి ఈ మోడల్ కెమెరా పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది.

Advertisement

Also Read: ఇక కేబుల్స్ అవసరం లేదు.. Nothing Warp యాప్‌తో నిమిషాల్లో ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

వీడియో గ్రాఫర్లకు 4K స్పెషల్..

ఇప్పుడంతా జస్ట్ ఫోటోలు మాత్రమే తీస్తే సరిపోదు. హై క్వాలిటీ వీడియోలు కూడా అవసరమే. అందుకే నికాన్ D7500లో 4K అల్ట్రా HD వీడియో రికార్డింగ్ సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల వ్లాగర్లు, షార్ట్ ఫిలిం మేకర్లు సినిమాటిక్ క్వాలిటీ అవుట్‌పుట్‌ను పొందొచ్చు. దీని వెనుక వైపు ఉండే 3.2 ఇంచుల టిల్టింగ్ టచ్ స్క్రీన్ ద్వారా మనకు నచ్చిన యాంగిల్స్‌లో కెమెరాను పెట్టి షూట్ చేయడం చాలా సులభం అవుతుంది.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Advertisement

ఈ కెమెరాను చేత్తో పట్టుకున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది వెదర్ సీలింగ్ ఫీచర్‌తో వస్తుంది. కాబట్టి బయట షూటింగ్స్ చేసేటప్పుడు దుమ్ము లేదా తేమ గురించి పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. ఒక్కసారి పూర్తిస్థాయిలో బ్యాటరీని ఛార్జ్ చేస్తే సుమారు 950 షాట్ల వరకు తీసుకోవచ్చు. ఇది సాధారణ కెమెరాల కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి. అంతేకాకుండా.. స్నాప్‌బ్రిడ్జ్ యాప్ ద్వారా మీరు తీసిన ఫోటోలను వెంటనే మీ ఫోన్‌కు బదిలీ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.

ధర, ఆఫర్ల వివరాలు..

ప్రస్తుతం భారతదేశంలో నికాన్ D7500 ధర వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. కేవలం బాడీ మాత్రమే అయితే రూ.64,000 నుండి రూ.66,000 మధ్య లభిస్తోంది. అదే 18-140mm లెన్స్ కిట్‌తో కలిపి అయితే రూ.77,999 వరకు అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా రిలయన్స్ డిజిటల్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 5 నుండి 10 శాతం వరకు డిస్కౌంట్ లేదంటే క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందే అవకాశం ఉంది.

Also Read: నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకున్నా.. ఈ స్కోడా ‘డ్యూయోబెల్’ సౌండ్ వినిపించాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×