E-Paper
Advertisement

Paper plane:- ఆకాశంలో ఎగిరిన పేపర్ ప్లేన్.. కొత్త రికార్డ్..

Paper plane:- ఆకాశంలో ఎగిరిన పేపర్ ప్లేన్.. కొత్త రికార్డ్..
Advertisement

Paper plane:- చిన్నప్పుడు కాగితాలతో పడవలు చేసుకోవడం, ఏరోప్లేన్స్ చేయడం చాలామందికి ఇష్టం కదా..! కాగితాలతో రాకెట్లు చేసి గాలిలోకి ఎగరేసేవాళ్లు. అయితే ఏదో ఒకరోజు అలాంటి ఒక పేపర్ ప్లేన్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకున్నామా..? పేపర్ ప్లేన్ రికార్డ్ బ్రేక్ చేయడమేంటి అనుకుంటున్నారా? చేసింది మరి..! ఒక ముగ్గురు యంగ్ సైంటిస్టులు కలిసి తయారు చేసిన పేపర్ ప్లేన్ ఆకాశంలోకి సక్సెస్‌ఫుల్‌గా ఎగిరి రికార్డ్ సాధించింది.

ముగ్గురు ఏరోస్పేస్ ఇంజనీర్లు కలిసి తయారు చేసి ఒక పేపర్ ప్లేన్.. చాలా దూరం ఎగిరిన పేపర్ ప్లేన్‌గా రికార్డ్ సాధించింది. ఇది భూమికి 289 అడుగులు 9 అంగుళాల ఎత్తులో ఎగిరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందు వరకు పేపర్ ప్లేన్ ఎత్తు రికార్డ్ 252 అడుగులు 7 అంగుళాలుగా ఉంది. 2022లో ఈ రికార్డును సౌత్ కొరియా ఏరో ఇంజనీర్లు సాధించారు. అంతకు ముందు ఉన్న రికార్డ్‌ను దాదాపు పది సంవత్సరాల తర్వాత వారు బ్రేక్ చేశారు. ఇప్పుడు సంవత్సరంలోపే వారి రికార్డ్ బ్రేక్ అయ్యింది.

Advertisement

ఏరోస్పేస్ రంగంలోకి అడుగుపెట్టడం, ఇలాంటి ఘనత సాధించడం చాలా సంతోషంగా ఉంది అని ఈ రికార్డ్ సాధించిన ఇంజనీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు మస్సూరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. ఎన్నో ఏళ్ల నుండి వారు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. దాదాపు 500 గంటల పాటు వారు ఒరిగామి, ఏరోడైనమిక్స్ గురించి స్టడీ చేశారు. దీనికంటే ముందు వారు ఎన్నో పేపర్ ప్లేన్ ప్రోటోటైప్స్‌ను సిద్ధం చేశారు. 2022 డిసెంబర్ 2న వారు మొదటిసారిగా ఈ పేపర్ ప్లేన్‌ను టెస్ట్ చేసి చూశారు.

ఈ రికార్డ్ ఎక్కువరోజులు చెరిగిపోకుండా ఉంటే బాగుంటుందని ఇంజనీర్లు కోరుకుంటున్నారు. దాదాపు 290 అడుగుల ఎత్తుకు ఎగరడం అనేది వారికి చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ముందు రికార్డును దాటడం కోసం వారు ఎంతో కష్టపడ్డామని అన్నారు. అయితే పేపర్ ప్లేన్ వెనుక పెద్ద సైన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో తయారైన పేపర్ ప్లేన్ డిజైన్‌లలో నాసా తయారు చేసిన మాస్ 5 అనే పేపర్ ప్లేన్ మెరుగైనదని గుర్తుచేసుకున్నారు.

Advertisement

Blood cancer:- బ్లడ్ క్యాన్సర్‌ను ముందే గుర్తించవచ్చు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×