E-Paper
Advertisement

ఫ్రిజ్‌లో పెట్టినా కూరగాయలు పాడవుతున్నాయా? మీరు చేసే ఆ చిన్న తప్పే కారణం!

ఫ్రిజ్‌లో పెట్టినా కూరగాయలు పాడవుతున్నాయా? మీరు చేసే ఆ చిన్న తప్పే కారణం!
Advertisement

Fridge Storage: కూరగాయలు, పండ్లు, వండుకున్న ఆహార పదార్థాలు తాజాగా ఉండాలంటే ఈ రోజుల్లో అందరికీ గుర్తొచ్చేది ఫ్రిజ్. అయితే చాలామంది మార్కెట్ నుండి తెచ్చిన ప్రతి వస్తువును నేరుగా తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. అయితే కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడమే కాకుండా పక్కన ఉన్న వాటిని కూడా పాడు చేస్తాయి. ఆ పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

టమోటాలు

టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన రుచి, ఆకృతి దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. చల్లటి గాలి వల్ల ఇవి లోపల మెత్తగా అయిపోయి, త్వరగా కుళ్ళిపోతాయని పేర్కొంటున్నారు.

బంగాళాదుంపలు

Advertisement

ఫ్రిజ్ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల బంగాళాదుంపల్లోని స్టార్చ్ కాస్తా చక్కరగా మారిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల అవి త్వరగా పాడవడమే కాకుండా వండినప్పుడు విచిత్రమైన రుచిని తీసుకొస్తాయని తెలియజేస్తున్నారు.

ఉల్లిపాయలు, వెల్లుల్లి

ఉల్లిపాయాలను ఫ్రిజ్ లో పెడితే.. వాటిలోని తేమ కారణంగా త్వరగా మెత్తబడి, బూజు పట్టే అవకాశం ఉంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా లోపల మొలకలు వచ్చి కుళ్ళిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అరటిపండ్లు

Advertisement

వీటిని ఫ్రిజ్‌లో పెడితే తొక్క నల్లగా మారిపోయి, లోపల గుజ్జులా అయిపోతాయని నిపుణులు అంటున్నారు. రుచిగా దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి పైన పేర్కొన్న పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో ఫ్రిజ్ లో పెట్టవద్దని హితవు పలుకుతున్నారు.

పాలు, గుడ్లతో జాగ్రత్త

చాలామంది పాలు, గుడ్లను ఫ్రిజ్ డోర్ లో ఉండే అరల్లో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ డోర్ తరచూ తీసి మూయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. దీనివల్ల పాలు, గుడ్లు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అలాగే వండిన ఆహారాన్ని ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: మద్దతు ఉంటే సరిపోదు.. అది ఓటుగా మారాలి.. క్యాడర్‌కు కోమటిరెడ్డి క్లాస్!

ఈ చిట్కాలపై లుక్కేయండి

కొందరు ఆకుకూరలు, కూరగాయలను కడిగిన వెంటనే తడితో ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇది కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు. వాటిని కాసేపు ఆరబెట్టి, కాటన్ బ్యాగుల్లో లేదా జిప్ లాక్ కవర్లలో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని సూచిస్తున్నారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×