E-Paper
Advertisement

Netflix: ఆ స్మార్ట్ టీవీల్లో నెట్‌ ఫ్లిక్స్ సర్వీసులు బంద్, లిస్టులో మీ టీవీ ఉందేమో చెక్ చేసుకోండి!

Netflix: ఆ స్మార్ట్ టీవీల్లో నెట్‌ ఫ్లిక్స్ సర్వీసులు బంద్, లిస్టులో మీ టీవీ ఉందేమో చెక్ చేసుకోండి!
Advertisement

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వినియోగదారులకు షాకిచ్చింది. చాలా మంది వినియోగదారులు స్మార్ట్ ఫోన్లను టీవీకి కనెక్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైలెంట్ గా ఈ సౌకర్యాన్ని తొలిగించింది. నెట్ ఫ్లిక్స్ నిర్ణయంతో మిలియన్ల కొద్ది వినియోగదారులు నిరాశకు గురయ్యారు. ఈ విధానాన్ని గత కొద్ది రోజులుగా సైలెంట్ గా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది వినియోగదారులు గత నెలలో ఎటువంటి హెచ్చరిక లేకుండా ఈ ఫీచర్ ను రిమూవ్ చేసినట్లు వెల్లడించారు.

ఇక స్మార్ట్ ఫోన్ నుంచి టీవీకి నో స్ట్రీమింగ్!

ఆండ్రాయిడ్ అథారిటీ వెబ్‌ సైట్‌ లో ఈ విషయాన్ని టెక్ నిపుణులు గుర్తించారు. “నెట్‌ ఫ్లిక్స్ ఇకపై మొబైల్ నుంచి టీవీలు, టీవీ స్ట్రీమింగ్ పరికరాలకు సపోర్ట్ చేయదు. నెట్‌ ఫ్లిక్స్‌ ను నావిగేట్ చేయడానికి మీ టీవీ, టీవీ స్ట్రీమింగ్ డివైజ్ తో వచ్చిన రిమోట్‌ ను ఉపయోగించాల్సి ఉంటుంది” అని వెల్లడించింది. Netflix ఈ ఆప్షన్ ను తొలగించినట్లు తెలిపింది. Chromecast థర్డ్ జెనరేషన్, అంతకంటే పాత, Google Nest Hub స్మార్ట్ డిస్ ప్లే, ఎంపిక చేసిన కాస్ట్ ఎనేబుల్డ్ Vizio టీవీలు, Compal TVలకు మాత్రమే ప్రసారం చేయడానికి సపోర్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ కస్టమర్ కేర్ ప్రతినిధి కూడా ధృవీకరించాడు. ఓ రెడ్డిట్ వినియోగదారుడికి “నెట్ ఫ్లిక్స్ డివైజ్ కు స్వంత రిమోట్ ఉంటే, మీరు టీవీలకు టెలికాస్ట్ చేయలేరు” అని కామెంట్ చేశాడు. స్థానిక నెట్ ఫ్లిక్స్ యాప్ లేని టీవీలకు ఈ సౌకర్యం ఉంటుంది. కానీ, స్మార్ట్ టీవీలు, యాప్ సపోర్ట్ ఉన్న ఇతర పెద్ద స్క్రీన్ టీవీలకు రిమోట్‌ ను ఉపయోగించి నెట్ ఫ్లిక్స్  చూడాల్సి ఉంటుంది.

ఇప్పటికే వాటికి AirPlayకి సపోర్టు నిలిపివేత

Advertisement

నెట్‌ ఫ్లిక్స్ ఇప్పటికే IOS, Google TV యాప్‌ లో AirPlayకి సపోర్టును నిలిపివేసింది. వినియోగదారులు యాడ్ సపోర్టు ఉన్న ప్లాన్‌ లో ఉంటే లేదంటే వారు ప్రసారం చేస్తున్న డివైజ్ రిసీవర్ లా అదే Wi-Fi నెట్‌ వర్క్‌ లో లేకుంటే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేరు. మొబైల్ లో నెట్‌ ఫ్లిక్స్ కంటెంట్ ప్లే కావడానికి డిస్‌ ప్లే గా TVని ఉపయోగించలేరని కాస్టింగ్, మిర్రరింగ్ సపోర్టు పేజీ వెల్లడించింది.

Read Also: ఏఐకి ‘మాటల’ మాయ.. కంపెనీల డేటాకు ‘ప్రాంప్ట్’ గండం!

కాస్ట్ బటన్ ఎందుకు తీసివేసిందంటే?

Advertisement

కాస్ట్ బటన్‌ ను తీసివేయడానికి గల కారణాల గురించి నెట్ ఫ్లిక్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:  విమానాల్లోకి కొబ్బరి కాయలను అనుమతించరు.. ఎందుకంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×