E-Paper
Advertisement

NASA : నాసా ప్రయోగం ఫెయిల్.. ప్రాణాలకే ప్రమాదమంటూ..

NASA : నాసా ప్రయోగం ఫెయిల్.. ప్రాణాలకే ప్రమాదమంటూ..
Advertisement

NASA : శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. వారు చేసే ఎన్నో ప్రయోగాలు ఎన్నో రంగాల్లో ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. అయినా ఇప్పటికీ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ బిజీగా ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు వైవిధ్యభరితమైన విషయాలు కనుక్కునే క్రమంలో శాస్త్రవేత్తలకు కూడా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. తాజాగా నాసాకు అలాంటి ఒక ఎదురుదెబ్బే తగిలింది. దానివల్ల చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలివేయాల్సి వచ్చింది.

నాసా ఒక సరికొత్త ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసింది. దాని పేరు ఎక్స్ 57. ఈ ఎక్స్ 57 తయారీ అంతా పూర్తి చేసుకొని టేక్ ఆఫ్‌కు సిద్ధంగా ఉంది అనే సమయానికి ప్రొపల్షన్ సిస్టమ్‌లో ఏదో సమస్య ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకవేళ అలాగే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఎగిరితే మాత్రం మనుషుల ప్రాణాలకు ప్రమాదం అని ఈ ప్రయోగాన్ని చివరి నిమిషంలో విరమించారు. ఈ ఫ్లైట్‌ను నిలిపివేయడానికి ముఖ్య కారణాలు సేఫ్టీ, టైమ్ అని వారు చెప్తున్నారు. ఈ ప్రయోగం గురించి నాసా శాస్త్రవేత్తలు స్వయంగా బయటపెట్టారు.

Advertisement

ఎక్స్ 57 ప్రొపల్షన్ సిస్టమ్‌లో ఉన్న సమస్య వల్ల పైలెట్ ప్రాణాలకు మాత్రమే కాకుండా భూమిపై ఉన్నవారి ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించామని, అందుకే ప్రయోగాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లలేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఏడాది చివరిలోపు మళ్లీ ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. మరింత బడ్జెట్ ఉండి ఉంటే ఎక్స్ 57 ఫెయిల్యూర్ అయ్యేది కాదని కొందరు నాసా శాస్త్రవేత్తలు నోరువిప్పారు. బడ్జెట్ లోపం కూడా దీనికి కారణమంటున్నారు.

ఒక ఇటాలియన్ టెక్నామ్ పీ2006టీ విమానాన్ని తీసుకొని, దాని ప్రొపల్షన్ సిస్టమ్‌ను మార్చి, ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్స్ 57గా మార్చామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వల్ల ఎయిర్‌క్రాఫ్ట్స్ రంగంలోనే కొత్తదనాన్ని తీసుకురావాలని నాసా ప్రయత్నించింది. అంతే కాకుండా దీని వల్ల వాతావరణ మార్పులకు సహాపడవచ్చని, గ్రీన్‌హౌస్ గ్యాసులను తగ్గించవచ్చని నాసా శాస్త్రవేత్తలు అనుకున్నారు. ఇప్పుడు ఫెయిల్ అయినా కూడా తప్పకుండా త్వరలోనే ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయోగాన్ని వారు సక్సెస్ చేస్తామనే ధీమాతో ఉన్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×