E-Paper
Advertisement

mXmoto M16 e-bike: ‘ఎంఎక్స్ మోటో ఎం 16’ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. లుక్ అదిరింది.. ధర చాలా తక్కువ గురూ!

mXmoto M16 e-bike: ‘ఎంఎక్స్ మోటో ఎం 16’ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. లుక్ అదిరింది.. ధర చాలా తక్కువ గురూ!
Advertisement

mXmoto M16 e-bike: మార్కెట్‌లోకి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ తన లుక్, డిజైన్, ఫీచర్లతో వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ బైక్‌కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 160 కిలోమీటర్లు నుంచి 220 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. మరి ఆ బైక్ పేరేంటో.. దానికి సంబంధించిన ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంఎక్స్ మోటో కంపెనీ తాజాగా తన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ మోడల్‌ను లాంచ్ చేసింది. దీనికి ‘mXmoto M16’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఇ-స్కూటర్ టీఎఫ్టీ స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, రివర్స్ అసిస్ట్, ఎల్ఈడీ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు సెల్ఫ్-డయాగ్రోసిస్‌తో వస్తుంది.

Advertisement

ఈ ఎలక్రిక్ బైక్ 80 ఏఎంపీ హై ఎఫిషియెన్సీ కంట్రోలర్స్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కాగా మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ట్రిపుల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే స్టార్ట్ యాప్, ఎల్ఈడీ డైరెక్షన్ ఇండికేటర్స్, యాంటీ స్కిడ్ అసిస్ట్, బ్లూటూత్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇందులో అమర్చారు.

READ MORE: హీరో మోటోకార్ప్ నుంచి మరో స్లైలిష్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..?

Advertisement

ఇది భారతీయ రహదారి పరిస్థితులకు కఠినమైనదిగా చేస్తుంది. క్రూయిజర్ శైలితో కలిపి ఈ డిజైన్ నిర్మాణం దాని విభాగంలో ప్రత్యేకంగా ఉంటుంది. డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, KED హెడ్‌ల్యాంప్‌లు, LED టర్న్ ఇండికేటర్‌లతో ఆధునిక టచ్ జోడించబడింది

కాగా ఈ ఎలక్ట్రిక్ బైక్‌కి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 160 కిలోమీటర్ల నుంచి 220 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తోంది. ఇది 0 నుండి 90 శాతం ఛార్జింగ్ ఎక్కడానికి మూడు గంటల సమయం తీసుకుంటుంది.

ఇకపోతే ఈ బైక్ బ్యాటరీపై దాదాపు 8 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా మోటార్ అండ్ కంట్రోలర్‌పై మూడు ఏళ్లు లేదా 80వేల కి.మీ వారంటీ లభిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర దాదాపు రూ.1.98 లక్షల (ఎక్స్ షోరూమ్)కు సెలెక్ట్ చేసిన ఓట్‌లెట్స్‌లో కొనుక్కోవచ్చు.

READ MORE: ఇండియాలో లాంచ్ అయిన ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్.. ధర రూ.11.83 లక్షలు!

కాగా ఈ ఎలక్ట్రిక్ బైక్స్‌లో ‘ఎం16’ బైక్‌ను వరల్డ్‌లోనే అగ్రస్థానంలో నిలపాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర మల్హోత్ర పేర్కొన్నారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×