E-Paper
Advertisement

Motorola Signature: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5తో వచ్చిన తొలి ఫోన్.. మోటొరోలా సిగ్నేచర్ ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది భయ్యా!

Motorola Signature: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5తో వచ్చిన తొలి ఫోన్.. మోటొరోలా సిగ్నేచర్ ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది భయ్యా!
Advertisement

Motorola Signature: ఒకప్పుడు కేవలం బడ్జెట్ ఫోన్లకే పరిమితమైన మోటొరోలా బ్రాండ్.. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఐఫోన్, శాంసంగ్‌ వంటి దిగ్గజ బ్రాండ్లకు సవాల్ విసురుతోంది. కొంత కాలంగా మార్కెట్‌లోకి వస్తున్న మోటొరోలా ఫోన్ల జోరు చూస్తుంటే.. భవిష్యత్తులో యూజర్లను ఆకట్టుకునే మరింత మెరుగైన టెక్నాలీజీని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. Motorola Signature పేరుతో మార్కెట్లోకి అదిరిపోయే ఫోన్ విడుదలైంది. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో వచ్చిన ఈ హ్యాండ్ సెట్ పర్ఫార్మెన్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గేదేలే అంటూ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. మోటొరోలా సిగ్నేచర్ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి.

Motorola Signatureలో 6.8 అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. దీని 165Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. ఫోన్ చూడటానికి చాలా స్లిమ్‌గా, చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ ఫినిషింగ్‌తో ఈ ఫోన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

Advertisement

Also Read: 1930ల నాటి క్లాసిక్ లుక్.. 2026 క్రేజీ ఫీచర్స్.. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఫుజిఫిల్మ్ నయా సెన్సేషన్!

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చిప్‌సెట్లలో ఒకటైన Snapdragon 8 Gen 5తో పని చేసే తొలి ఫోన్లలో ఇది కూడా ఒకటి. దీనివల్ల భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ అస్సలు స్లో అవ్వదు. దీనిలో 16GB వరకు RAM, 1TB వరకు భారీ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌పై నడుస్తుంది. దీంతోపాటు రాబోయే ఏడేళ్ల పాటు అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

Advertisement

ఈ మోటొరోలా సిగ్నేచర్‌ ఫోన్‌లో ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌ను అమర్చారు. వెనుక వైపు ఉన్న మూడు లెన్సులు కూడా 50MP సామర్థ్యం కలిగి ఉండటం విశేషం. మెయిన్ కెమెరా తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫొటోలు తీస్తుంది. ఇక రెండో కెమెరా అల్ట్రావైడ్, మాక్రో షాట్స్ కోసం, మూడోది పెరిస్కోప్ లెన్స్ కావడంతో దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా జూమ్ చేసి ఫొటోలు తీయొచ్చు. సెల్ఫీల కోసం కూడా ముందు భాగంలో 50MP కెమెరానే ఇచ్చారు. దీంతో వీడియో కాల్స్, సెల్ఫీలు చాలా క్వాలిటీగా వస్తాయి.

5200mAh భారీ బ్యాటరీతో వచ్చిన మోటొరోలా సిగ్నేచర్ ఫోన్‌ను రోజంతా కంటిన్యూగా వాడినా ఛార్జింగ్ త్వరగా అయిపోదు. అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా దీనిలో ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. 12GB ర్యామ్ వేరియంట్ సుమారు రూ.59,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫీచర్లు, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ ధరకు ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ త్వరలోనే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌పామ్స్, రీటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.

Also Read: వామ్మో.. పిక్సెల్ ఫోన్లలో ఇంతపెద్ద సెక్యూరిటీ లోపమా? ఈ సెట్టింగ్ మార్చకపోతే మీ డేటా ప్రమాదంలో పడ్డట్టే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×