E-Paper
Advertisement

Motorola Razr Fold: మోటరోలా నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. 8.1 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆకట్టుకునేలా డిజైన్!

Motorola Razr Fold: మోటరోలా నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. 8.1 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆకట్టుకునేలా డిజైన్!
Advertisement

Motorola Razr Fold: ఇప్పటికే మార్కెట్‌ను ఊపేస్తున్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా.. తాజాగా ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లోకి మోటరోలా సంస్థ అడుగు పెట్టింది. ఇటీవల లాస్‌ వెగాస్‌లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో ప్రముఖ మోటరోలా టెక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. మొన్నటి వరకు ఫ్లిప్ టైప్‌ ఫోల్డబుల్ ఫోన్‌లకే పరిమితమైన ఈ సంస్థ.. మొట్టమొదటి సారిగా బుక్ స్టైల్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌‌ను తయారు చేసింది. దీనిని Motorola Razr Fold పేరుతో లాంచ్ చేసింది.

ఖుషీ అవుతున్న టెక్ ప్రియులు:

ఊహించని అతిథిలా ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్‌లోకి మోటరోలా అడుగుపెట్టడంతో టెక్ అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయికి చేరాయి. ఇప్పటివరకు రేజర్ సిరీస్ అంటే.. క్లామ్‌షెల్ డిజైన్‌తో నాస్టాల్జిక్ ఫీల్ ఇచ్చే ఫోన్‌లే గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు వచ్చిన హ్యాండ్ సెట్ కొత్త డిజైన్‌తో రేజర్ ఫోల్డ్‌ను మోటరోలా తీసుకొస్తోంది. బిగ్ స్క్రీన్, మల్టీటాస్కింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రొడక్టివిటీ.. ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా ఈ ఫోన్‌ను కంపెనీ డిజైన్ చేసింది.

Advertisement

Also Read: అన్ని అంచనాలు దాటేసిన వివో X300 అల్ట్రా.. కెమెరా నుంచి పెర్ఫార్మెన్స్ వరకు అన్నీ సెన్సేషనే!

భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇతర ఆండ్రాయిడ్ ఫోల్డబుల్ ఫోన్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా ఫోల్డబుల్ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం పొందాలన్నదే మోటరోలా లక్ష్యం. CES 2026 ఈవెంట్‌లో అధికారికంగా రేజర్ ఫోల్డ్ ఫోన్‌ను ప్రకటించినప్పటికీ.. గ్లోబల్ లాంచ్ డేట్స్‌ను సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ ఏడాది వేసవికాలంలో మొదట నార్త్ అమెరికాలో విడుదలై.. ఆ తర్వాత ఇతర మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఇక భారత మార్కెట్‌లో ఈ ఫోన్ 2026 చివర్లో విడుదల అవుతుందని సమాచారం.

ధరలు ఇలా ఉండొచ్చు(అంచనా):

Advertisement

ఈ మోటరోలా రేజర్ ఫోల్డ్ హ్యాండ్ సెట్ ధరలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజా లీకుల ప్రకారం. ఇది ప్రీమియం ధరతో రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.1,25,000 పైగా ఉండొచ్చని టెక్ నిపుణుల అంచనా. ఫోల్డబుల్ డిజైన్, ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్ల కారణంగా ధర ఎక్కువగానే ఉండవచ్చు. దీనిలో స్టైలస్ సపోర్ట్‌, మెరుగైన హార్డ్‌వేర్, ఫీచర్లను అందించడానికి సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ ఫోన్ ప్రాసెసర్, బ్యాటరీ గురించి ఎలాంి సమాచారం వెల్లడించలేదు. అయితే తాజా స్నాప్‌డ్రాగన్/ మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను కలిగి ఉండొచ్చు. ఇది ఆండ్రాయిడ్ 16-ఆధారిత హలో UIతో రానుందని భావిస్తున్నారు.

ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌:

ఈ ఫోన్‌ యొక్క డ్యూయల్ స్క్రీన్ డిజైన్ వల్ల మడతపెట్టినప్పుడు సాధారణ ఫోన్‌లా, తెరిచినపుడు టాబ్లెట్‌లా ఉంటుంది. LTPO టెక్నాలజీ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్స్‌తో బ్యాటరీ ఎఫిషియెన్సీని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది రేజర్ ఫోల్డ్ బుక్‌స్టైల్ డిజైన్‌లో ఒక చిన్న టాబ్లెట్‌లా ఓపెన్ అవుతుంది. ఇక మల్టీటాస్కింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌, గేమింగ్‌కు మెరుగైన పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా ఈ రేజర్ ఫోల్డ్ ఫోన్‌లో కెమెరాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. దీనిలోని ట్రిపుల్ 50MP సెటప్‌తో వైడ్ షాట్స్‌, పెరిస్కోప్ జూమ్‌, డీటెయిల్డ్ మాక్రో ఫొటోగ్రఫీ వంటివి చేయొచ్చు. డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ వల్ల వీడియో క్రియేటర్స్‌, సోషల్ మీడియా యూజర్లకు ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

స్పెసిఫికేషన్లు(అంచనా):

Motorola Razr Fold స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫోల్డబుల్ ఫీచర్లతో రావచ్చని టెక్ వర్గాల అంచనా. దీనిలో 8.1 ఇంచుల 2K LTPO ఫోల్డబుల్ లోపలి డిస్‌ప్లే, రోజువారీ వినియోగానికి అనువైన 6.6 ఇంచుల బయటి స్క్రీన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇకపోతే కెమెరా సెక్షన్‌లో సోనీ LYTIA సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, మాక్రోతో పాటు 3x జూమ్ సపోర్ట్ చేసే 50MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అమర్చనున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరాలుగా ఔటర్ స్క్రీన్‌పై 32MP, ఇన్నర్ డిస్‌ప్లేలో 20MP కెమెరాలు ఉండే అవకాశం ఉంటుందిన అంచనా.

Also Read: పిల్లల కదలికపై ‘స్మార్ట్ బ్రిక్’ నిఘా.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

 

 

 

 

 

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×