E-Paper
Advertisement

6000mAh బ్యాటరీ, 7 ఏళ్ల అప్‌డేట్స్‌తో Motorola Razr Fold విడుదల.. ధర ఎంతంటే?

6000mAh బ్యాటరీ, 7 ఏళ్ల అప్‌డేట్స్‌తో Motorola Razr Fold విడుదల.. ధర ఎంతంటే?
Advertisement

Motorola Razr Fold: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం మోటోరోలా సంస్థ తమ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ Motorola Razr Foldను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టెలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ అమ్మకాలు దేశవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా కొనుగోలుదారులకు భారీ డిస్కౌంట్లతో పాటు పలు బ్యాంకింగ్, టెలికాం బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

ధర వివరాలు ఇలా..

ఈ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ పాంటోన్ బ్లాకెన్డ్ బ్లూ, పాంటోన్ లిల్లీ వైట్ రంగుల్లో లభిస్తోంది. దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 12GB RAM, 256GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.1,49,999 కాగా.. 16GB RAM, 512GB స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.1,59,999గా ఉంది. వీటితో పాటు ప్రత్యేకంగా ‘ఫిఫా వరల్డ్ కప్ 26 కలెక్షన్’ ఎడిషన్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. మొదటి సేల్‌లో భాగంగా ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే జియో వినియోగదారులకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్, క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్లు ఉన్నాయి.

Advertisement

Also Read: రంగులు మార్చే బ్యాక్ ప్యానెల్‌తో Infinix Hot 70.. లుక్స్ మాత్రం అదిరిపోయాయ్ బాసూ!

అద్భుతమైన ప్రొసెసర్:

ఈ ఫోన్ లోపలి భాగంలో 8.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను అందించారు. ఇది 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇక ఫోన్ పైభాగంలో 165Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 ఇంచుల కవర్ డిస్‌ప్లేను ఇచ్చారు. స్క్రీన్ రక్షణ కోసం అల్ట్రా థిన్ గ్లాస్ వాడారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రొసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌కు ఏకంగా 7 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

3x ఆప్టికల్ జూమ్ లెన్స్:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ కోసం దీనిలో వెనుక వైపు మూడు 50MP కెమెరాలను ఇచ్చారు. వీటిలో ప్రైమరీ కెమెరాతో పాటు.. 3x ఆప్టికల్ జూమ్ లెన్స్, అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. దీని ద్వారా 8K క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేయొచ్చు. సెల్ఫీల కోసం రెండు స్క్రీన్లపై విడివిడిగా కెమెరాలు ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 6000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 5G, Wi-Fi  కనెక్టివిటీ తో పాటు దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP49 రేటింగ్‌ను కూడా ఇచ్చారు.

Also Read: రూ.9 వేలకే మిలిటరీ గ్రేడ్ డిజైన్.. ఐటెల్ నుంచి కింద పడినా చెక్కుచెదరని కొత్త మొబైల్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×