E-Paper
Advertisement

Gen Z హాట్ ఫేవరెట్, స్టైలిష్ లుక్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్.. Motorola Razr Fold భారత్‌లో లాంచ్!

Gen Z హాట్ ఫేవరెట్, స్టైలిష్ లుక్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్.. Motorola Razr Fold భారత్‌లో లాంచ్!
Advertisement

Motorola Razr Fold: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పుడు అంతా ఫోల్డబుల్ ఫోన్ల హవానే నడుస్తోంది. తాజాగా మోటరోలా కంపెనీ భారత్‌లోRazr Fold పేరుతో ఒక క్రేజీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఫోల్డబుల్ ఫోన్లంటే కేవలం స్టైల్ కోసమే అనుకునేవాళ్లం. కానీ మోటరోలా మాత్రం దీనిలో ఏకంగా DSLR రేంజ్ కెమెరాలు, భారీ బ్యాటరీని పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐఫోన్, శాంసంగ్ లాంటి ప్రీమియం ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

వావ్ అనిపించే డిస్‌ప్లే:

ఈ ఫోన్ ఓపెన్ చేస్తే ఏకంగా 8.1 అంగుళాల భారీ స్క్రీన్ కనిపిస్తుంది. అంటే.. చేతిలో ఒక చిన్న టీవీ ఉన్నట్టే అన్నమాట. సినిమా చూసినా, గేమ్స్ ఆడినా ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇక ఫోన్ మడతపెట్టి ఉన్నప్పుడు వాడుకోవడానికి బయట కూడా ఒక చక్కని స్క్రీన్ ఇచ్చారు. దీనివల్ల ప్రతి చిన్న పనికి ఫోన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ బాడీని కూడా మెటల్‌తో చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు.

ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్:

Advertisement

చాలామందికి ఫోల్డబుల్ ఫోన్ల విషయంలో ఉన్న పెద్ద భయం బ్యాటరీ. కానీ దీనిలో ఏకంగా 6000mAh బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల వరకు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 అనే సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్‌ని వాడారు. దీనివల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. పైగా ఎంత సేపు వాడుకున్నా వేడెక్కకుండా కూలింగ్ సిస్టమ్ కూడా సెట్ చేశారు.

Also Read: వావ్.. షుగర్ టెస్ట్ నుంచి శాటిలైట్ కనెక్టివిటీ వరకు.. అన్నీ ఈ స్మార్ట్‌వాచ్‌లోనే!

కెమెరాల్లో ఏఐ మ్యాజిక్:

Advertisement

ఇక పొటోల విషయానికి వస్తే.. ఈ రేజర్ ఫోల్డ్‌లో AI టెక్నాలజీని వాడారు. మనం ఫొటో తీయగానే అది ఆటోమేటిక్‌గా రంగులను, వెలుతురును సెట్ చేసి ఒక ప్రొఫెషనల్ ఫొటోలా మార్చేస్తుంది. నైట్ మోడ్, 8K వీడియో రికార్డింగ్ లాంటి ఫీచర్లు దీనిలో స్పెషల్. ఇక సెల్ఫీల కోసం కూడా హైక్వాలిటీ కెమెరాలు ఉండటంతో వీడియో కాల్స్ చాలా క్లారిటీగా ఉంటాయి.

ధర వింటే దిమ్మతిరుగుద్ది:

ఇంత ప్రీమియం ఫోన్ కాబట్టి ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంది. బేస్ మోడల్ ధర రూ.1,49,999 నుంచి మొదలవుతుంది. అయితే అందరికీ అందుబాటులో ఉండేలా నెలకు కేవలం రూ.5,556 కట్టుకునేలా EMI ఆప్షన్లను కూడా ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఫోన్ కొంటే ఏడేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి. దీంతో ఒక్కసారి కొంటే చాలా ఏళ్ల వరకు ఫోన్ మార్చాల్సిన అవసరం ఉండదు.

Also Read: AC పేలుళ్లకు అసలు కారణం ఇదేనా? కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ 5 జాగ్రత్తలు పాటించకపోతే రిస్కే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×