E-Paper
Advertisement

ఇండియాలో మోటరోలా మొదటి ఫోల్డబుల్ ఫోన్ విడుదల.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

ఇండియాలో మోటరోలా మొదటి ఫోల్డబుల్ ఫోన్ విడుదల.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Advertisement

Motorola Razr Fold: టెలికాం రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మోటరోలా, స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. ఇప్పటివరకు ఫ్లిప్ ఫోన్లతో అలరించిన మోటో, ఇప్పుడు మొట్టమొదటిసారిగా నోట్‌బుక్ తరహాలో మడతపెట్టే ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ (Motorola Razr Fold)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. విమానాల్లో వాడే అత్యున్నత శ్రేణి మెటీరియల్స్, భారీ బ్యాటరీ , మునుపెన్నడూ చూడని 6200 నిట్స్ స్క్రీన్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ధర, ఫీచర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

మోటరోలా రేజర్ ఫోల్డ్ స్పెషల్ ఫీచర్లు:

డిస్‌ప్లే , బిల్డ్ క్వాలిటీ:
మోటరోలా రేజర్ ఫోల్డ్ డిజైన్ విషయంలో రాజీ పడలేదు. ఇందులో డ్యూయల్ అమోలెడ్ డిస్‌ప్లే సెటప్ ఉంది.

Advertisement

కవర్ డిస్‌ప్లే: ఫోన్ మడతపెట్టి ఉన్నప్పుడు 6.6-అంగుళాల LTPO ఎక్స్ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది.

మెయిన్ డిస్‌ప్లే: ఫోన్ తెరిచినప్పుడు 8.1-అంగుళాల 2K ఎక్స్ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లే మనకు స్వాగతం పలుకుతుంది. దీని బ్రైట్ నెస్ 6200 నిట్స్. అంటే మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

విమానాల తయారీలో వాడే ‘ఏరోస్పేస్ గ్రేడ్’ స్టీల్ , టైటానియం కీళ్ళను ఇందులో వాడారు. దీనివల్ల ఫోన్ చాలా బలంగా ఉండటమే కాకుండా వేల సార్లు మడతపెట్టినా ఎలాంటి ఇబ్బంది కలగదు.

పర్ఫార్మెన్స్:
ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ విషయంలో బెస్ట్ అని చెప్పవచ్చు. క్వాల్‌కామ్ లేటెస్ట్ చిప్‌సెట్ Snapdragon 8 Gen 5తో ఇది పనిచేస్తుంది.

ర్యామ్ & స్టోరేజ్: 16GB వరకు LPDDR5X ర్యామ్ , 512GB వరకు సూపర్ ఫాస్ట్ UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో UI పై నడుస్తుంది. విశేషమేమిటంటే,..ఈ ఫోన్‌కు ఏకంగా 7 ఏళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని మోటరోలా ప్రకటించింది.

బ్యాటరీ , కెమెరా:
సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ మోటో ఆ అపోహను చెరిపివేస్తూ 6000mAh భారీ బ్యాటరీని అందించింది. 80W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ , 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ దీనికి మరింత బలం అని చెప్పొచ్చు.

కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ లవర్స్ కోసం మూడు 50MP కెమెరాలను వెనక భాగంలో అమర్చారు.

50MP సోనీ లైటియా మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో).

50MP అల్ట్రావైడ్ & మాక్రో లెన్స్.

50MP సోనీ లైటియా 600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్).

సెల్ఫీల కోసం కవర్ స్క్రీన్‌పై 20MP, లోపలి స్క్రీన్‌పై 32MP కెమెరాలు ఉన్నాయి.

Also Read: మోడరన్ ఉమెన్స్ కోసం టైటాన్ నుంచి సూపర్ స్టైలిష్ వాచ్.. చూస్తే చూపు తిప్పుకోలేరు

ధర:
మోటరోలా రేజర్ ఫోల్డ్ ఒక ప్రీమియం లగ్జరీ స్మార్ట్‌ఫోన్. ఇండియాలో దీని ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

12GB + 256GB వేరియంట్: రూ. 1,49,999

16GB + 512GB వేరియంట్: రూ. 1,59,999

ఈ ఫోన్‌తో పాటు బోస్ (ట్యూన్ చేసిన ‘మోటో బడ్స్ 2 ప్లస్’ ఇయర్‌బడ్స్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×