E-Paper
Advertisement

మడతపెట్టే ఫోన్లలో మోటరోలా సరికొత్త ప్రయోగం.. Razr Fold భారత్‌లోకి వచ్చేస్తోంది, మీరు రెడీయా?

మడతపెట్టే ఫోన్లలో మోటరోలా సరికొత్త ప్రయోగం.. Razr Fold భారత్‌లోకి వచ్చేస్తోంది, మీరు రెడీయా?
Advertisement

Motorola Razr Fold: మోటరోలా మొబైల్ ప్రియుంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Razr Fold త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటివరకు ఫోల్డబుల్ ఫోన్ల రంగంలో శాంసంగ్ వంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తున్న మోటరోలా.. ఇప్పుడు తమ మొదటి బుక్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన అధికారిక పేజీ కూడా అందుబాటులోకి రావడంతో, ఈ ఫోన్ మే నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

స్క్రీన్ క్వాలిటీలో సరికొత్త బెంచ్‌మార్క్:

ఈ ఫోన్ ప్రత్యేకత దీని డిస్‌ప్లే అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌ను తెరిచినప్పుడు 8.1 అంగుళాల భారీ 2K రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ కనిపిస్తుంది. దీనివల్ల టాబ్లెట్ వాడుతున్న అనుభూతి కలుగుతుంది. బయటి వైపు కూడా 6.6 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉంది. ఈ రెండు స్క్రీన్‌లు కూడా అధిక రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తాయి. ముఖ్యంగా ఎండలో కూడా ఫోన్ క్లియర్‌గా కనిపించేలా దీనికి ప్రపంచంలోనే అత్యధిక బ్రైట్‌నెస్‌ను అందించడం విశేషం.

స్పీడ్‌కు కేరాఫ్ అడ్రస్:

Advertisement

మోటరోలా ఈ ఫోన్‌లో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను వాడింది. దీనివల్ల ఒకేసారి ఎన్ని యాప్స్ వాడినా, పెద్ద పెద్ద గేమ్స్ ఆడినా ఫోన్ ఏమాత్రం స్లో అవ్వదు. అలాగే ఈ ఫోన్‌లో ఉన్న 16GB RAM మల్టీ టాస్కింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా ఇందులో జోడించడంతో.. ఫోన్ వాడే విధానాన్ని బట్టి ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

Also Read: ఒక్కసారి ఈ ఫోన్ ఫీచర్లు చూశాక వేరేది కొనరు.. Galaxy A27తో శాంసంగ్ మాస్టర్ ప్లాన్, ఫుల్ డీటెయిల్స్ ఇవే!

వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం:

Advertisement

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ దీనిలో 6,000mAh పెద్ద బ్యాటరీని అమర్చారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా వస్తుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కేవలం కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం వల్ల వైర్ల గొడవ లేకుండా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.

ఆకర్షణీయమైన డిజైన్:

ఫోల్డబుల్ ఫోన్ అనగానే అది సున్నితంగా ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. దీనికి IP49 రేటింగ్ ఇచ్చారు. అంటే.. దుమ్ము, నీటి నుంచి ఇది మంచి రక్షణ కల్పిస్తుంది. పటిష్టమైన గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తున్న ఈ ఫోన్.. రోజువారీ వాడకంలో గీతలు పడకుండా ఉంటుంది. మే 19న చైనాలో లాంచ్ అయ్యాక.. భారత్‌లో దీని ధర ఎంత ఉంటుందో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

Also Read: భారత్‌లోకి వచ్చేసిన Vivo X300 FE .. ఐదేళ్ల అప్‌డేట్స్, 100x జూమ్ కెమెరా.. ఐఫోన్, శాంసంగ్‌లకు చుక్కలే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×