E-Paper
Advertisement

ఐఫోన్, శాంసంగ్ క్రేజ్ ఖతమ్.. అతి తక్కువ ధరకే మోటో కొత్త ఫోల్డబుల్ ఫోన్, రేజర్ 70 ఫీచర్లు ఇవే..

ఐఫోన్, శాంసంగ్ క్రేజ్ ఖతమ్.. అతి తక్కువ ధరకే మోటో కొత్త ఫోల్డబుల్ ఫోన్, రేజర్ 70 ఫీచర్లు ఇవే..
Advertisement

Motorola Razr 70: ఇప్పుడంతా ఎక్కడ చూసినా ఫోల్డబుల్ ఫోన్లదే హవా నడుస్తోంది. ముఖ్యంగా స్టైలిష్‌గా, మడతపెట్టే ఫోన్లంటే యూత్ బాగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మోటోరోలా తన రేజర్ సిరీస్‌తో ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లతో రేజర్ 70, రేజర్ 70 అల్ట్రా మోడళ్లను తీసుకొస్తోంది. వీటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటకొచ్చాయి. మునుపటి డిజైన్‌నే కొనసాగిస్తూనే.. లోపల మాత్రం సాఫ్ట్‌వేర్, పెర్ఫార్మెన్స్‌ను ఒక రేంజ్‌లో అప్‌గ్రేడ్ చేసినట్లు సమాచారం.

బడ్జెట్ లోనే ఫోల్డబుల్ ఫోన్..

ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఫోల్డబుల్ ఫోన్ వాడాలనుకునే వారి కోసం రేజర్ 70 మోడల్ బెస్ట్ ఆప్షన్. ఇది చూడటానికి రేజర్ 60 లాగే ఉన్నా.. పనులన్నీ చకచకా అయిపోవడానికి దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7450X చిప్‌ను వాడుతున్నారు. ఇక స్క్రీన్ విషయానికొస్తే.. 6.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో పాటు స్మూత్‌గా పనిచేసేలా 120Hz రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. ఫొటోల కోసం వెనుక రెండు 50MP కెమెరాలు, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ కూడా 4,800mAh సామర్థ్యంతో వస్తోంది కాబట్టి.. రోజంతా ఛార్జింగ్ టెన్షన్ ఉండదు.

Advertisement

Also Read: ఈ పెద్దాయన 72 ఫోన్లతో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు, ఎందుకో తెలిస్తే వావ్ అంటారు!

స్పీడ్ లో దీని తర్వాతే ఏదైనా..

బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్ల కోసమే ఈ అల్ట్రా మోడల్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌ను పెట్టారు. దీని స్క్రీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. దీనిలో ఏకంగా 165Hz రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. దీంతో గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. బ్యాటరీ 4,500mAh ఉన్నా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఫోన్ చాలా త్వరగా నిండిపోతుంది. డేటా ట్రాన్స్‌ఫర్ కూడా మెరుపు వేగంతో జరగడానికి లేటెస్ట్ స్టోరేజ్ టెక్నాలజీని వాడారు.

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

ఇండియాలో మోటోరోలాకు ప్రధాన పోటీ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్‌తోనే. అయితే మోటోరోలా ఫోన్లలో బయట ఉండే కవర్ డిస్‌ప్లే పెద్దగా ఉండటం, వాడటానికి ఈజీగా ఉండటం ప్లస్ పాయింట్. ఇక ధర విషయానికొస్తే.. సాధారణ రేజర్ 70 దాదాపు రూ.70 వేల నుంచి రూ.80 వేల మధ్యలో ఉండొచ్చు. అల్ట్రా మోడల్ మాత్రం రూ.లక్షకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: సెన్హైజర్ నుంచి ఇంత తక్కువ ధరకే హెడ్‌ఫోన్సా? క్వాలిటీ చూస్తే ఇప్పుడే బుక్ చేసుకుంటావ్ మావా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×