E-Paper
Advertisement

మోటరోలా నుంచి మరో పవర్‌ఫుల్ మొబైల్.. Edge 70 Max లాంచ్ కన్ఫర్మ్.. హైలైట్స్ ఇవే!

మోటరోలా నుంచి మరో పవర్‌ఫుల్ మొబైల్.. Edge 70 Max లాంచ్ కన్ఫర్మ్.. హైలైట్స్ ఇవే!
Advertisement

Motorola Edge 70 Max: మోటరోలా లవర్స్‌కు గుడ్ న్యూస్. భారత మార్కెట్లోకి త్వరలోనే ‘మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్’ స్మార్ట్‌ఫోన్ అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ప్రో, ఎడ్జ్ 70 ఫ్యూజన్, ఎడ్జ్ 70 ప్రో+ మోడల్స్ ఉండగా.. ఇప్పుడు ఐదో ఫోన్‌గా ‘ఎడ్జ్ 70 మాక్స్’ రానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ లైవ్ లోకి రావడంతో ఈ విషయం ఖరారైంది.

కొత్త లుక్ అండ్ డిజైన్:

ఈ ఫోన్ డిజైన్ గత మోడల్స్ కంటే భిన్నంగా ఉండబోతోంది. సాధారణంగా ప్రో మోడల్స్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే కనిపిస్తుంది. కానీ, ఈ కొత్త మోడల్‌లో ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు వెనుక వైపు కూడా ఫ్లాట్ ప్యానెల్‌ను అందించారు. వెనుక భాగంలో స్క్వేర్ షేప్‌లో ఉండే కెమెరా మాడ్యూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫోన్ కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్లు ఉండగా, ఎడమవైపున ప్రత్యేకంగా ‘మోటో ఏఐ కీ’ బటన్‌ను ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: క్రేజీ అప్‌డేట్.. ఫోల్డబుల్ ఫోన్లలోనే రికార్డ్.. ఏకంగా 7000mAh బ్యాటరీతో హానర్ సరికొత్త సంచలనం!

మెరుగైన ఏఐ పనితీరు:

ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మునుపటి కంటే దీని ఎన్‌పీయూ (NPU) పనితీరు 46 శాతం మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీంతో ఏఐ ఫీచర్లు చాలా వేగంగా, స్మార్ట్‌గా పనిచేస్తాయి. అంతేకాదు.. ఈ సిరీస్‌లో కేవలం ప్రో+ మోడల్‌కు మాత్రమే ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇప్పుడు ఈ కొత్త మాక్స్ వేరియంట్‌లో కూడా అందిస్తున్నారు.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, కెమెరా:

Advertisement

లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. వెనుక వైపు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరాతో పాటు టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్‌లు ఉండే ఛాన్స్ ఉంది.

కలర్ ఆప్షన్లు ఇవే:

మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ ఫోన్.. గ్లేసియర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్, సేజ్ గ్రీన్ అనే మూడు అదిరిపోయే రంగుల్లో లభించనుంది. త్వరలోనే దీని ధర, లాంచ్ డేట్ వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. అప్పటి వరకు మోటరోలా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.

Also Read: 6000mAh బ్యాటరీ, క్రేజీ లుక్స్.. RCB ఫ్యాన్స్ కోసం భారత్‌లో స్పెషల్ ఎడిషన్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×