E-Paper
Advertisement

Motorola Edge 70 launched: ఆధునిక ఏఐ ఫీచర్లు, టాప్ ప్రొటెక్షన్‌తో మోటోరొలా ఎడ్జ్ 70 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

Motorola Edge 70 launched: ఆధునిక ఏఐ ఫీచర్లు, టాప్ ప్రొటెక్షన్‌తో మోటోరొలా ఎడ్జ్ 70 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
Advertisement

Motorola Edge 70 launched: మోటోరొలా తన ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా కొత్త ‘Motorola Edge 70’ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. పాంటోన్ బ్రాండింగ్‌తో మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఈ హ్యాండ్ సెట్ లభించనుంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, AI ఆధారిత ఫీచర్లు, మెరుగైన కెమెరాలతో Edge 70 మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీదారుగా నిలవనుంది.

టాప్ ప్రొటెక్షన్‌:

ఈ హ్యాండ్ సెట్ 6.7 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే‌‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ అందిస్తుంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఇచ్చారు. IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ. అలాగే దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 చిప్‌సెట్‌ను అమర్చగా.. 8GB LPDDR5x RAM, 256GB UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది.

Advertisement

Also Read: పోకో అభిమానులకు గుడ్ న్యూస్.. 6.9 అంగుళాల డిస్‌ప్లేతో C85 5G ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది!

ఏఐ ఫీచర్లు నెక్ట్స్ లెవెల్:

మోటోరొలా ఎడ్జ్ 70.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హెల్లో UIపై రన్ అవుతుంది. మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇస్తోంది. మోటో AIలో భాగంగా నెక్ట్స్ మూవ్, క్యాట్చ్ మి అప్ 2.0, పే అటెన్షన్ 2.0, రిమెంబర్ దిస్+ రీకాల్, కో-పైలట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. దీంతోపాటు 4K @60fps వీడియో రికార్డింగ్‌తో పాటు AI వీడియో, ఫొటో ఎన్హన్స్మెంట్స్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

31 గంటల వీడియ ప్లేబ్యాక్:

Advertisement

ఇందులో 5,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 31 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందిన ఈ ఫోన్ కేవలం 5.99mm మందం, సుమారు 159 గ్రాముల బరువుతో ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

ధర ఎంతంటే?

భారత్‌లో మోటోరొలా ఎడ్జ్ 70 ధర రూ.29,999. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లపై రూ. 1,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, గాడ్జెట్ గ్రే, లిల్లీ ప్యాడ్ రంగుల్లో లభిస్తుంది.

Also Read: ఫోల్డబుల్ మార్కెట్లో హువావే సంచలనం.. అత్యాధునిక Kirin 9030 Pro చిప్‌సెట్‌తో Mate X7 విడుదల!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×