E-Paper
Advertisement

Motorola Edge 70 Fusion: తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Motorola Edge 70 Fusion: తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement

Motorola Edge 70 Fusion: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా.. భారీ బ్యాటరీ లైఫ్, ప్రీమియం ఫీచర్లను కోరుకుంటున్న యూజర్ల కోసం త్వరలోనే భారత మార్కెట్లోకి ‘మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్’ను తీసుకురానుంది. ఇప్పటికే ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ విడదుల అవ్వడంతో మోటరోలా వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 23న గ్రాండ్‌గా లాంచ్ కానున్న ఈ ఫోన్.. ప్రత్యేకమైన డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

కలర్ ఆప్షన్స్ ఇవే:

మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీని వెనుక భాగంలో పనాటోన్ షేడ్స్‌తో కూడిన వీగన్ లెదర్ ఫినిషింగ్ ఉండటంతో చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ ఇస్తుంది. బ్లూ సర్ట్, కంట్రీ ఎయిర్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభ్యం కానుంది.

Advertisement

Also Read: నోకియా కీప్యాడ్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడొచ్చు!

మెరుగైన పనితీరు:

ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.78 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్‌తో అత్యంత వేగవంతమైన స్క్రీన్ అనుభూతిని అందిస్తుంది. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి IP68/69 రేటింగ్‌ను కూడా ఇచ్చారు.

ఆండ్రాయిడ్ 16 వెర్షన్:

Advertisement

మోటరోలా సంస్థ ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది రాబోయే ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో పనిచేస్తుందని అంచనా. ఇక కెమెరా విభాగంలో 50MP ప్రధాన సెన్సార్‌తో పాటు సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కూడా జత చేశారు.

నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్:

ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో హైలైట్ ఏంటంటే.. దాని 7000mAh భారీ బ్యాటరీ. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ చాలా స్లిమ్‌గా ఉండటం విశేషం. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల కొన్ని నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

ధర ఎంతంటే?

మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్స్, మార్కెట్ అంచనాల ప్రకారం.. బేస్ వేరియంట్ 8GB + 256GB సుమారు రూ.24,999 నుంచి రూ.26,999 మధ్య ఉండొచ్చు. అలాగే టాప్ వేరియంట్ 12GB + 256GB/512GB సుమారు రూ.29,999 వరకు ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణుల అంచనా.

Also Read: రూ.899 నుంచే ఫిలిప్స్ కొత్త హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్స్.. ఫీచర్స్, క్వాలిటీలో తిరుగులేదు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×