E-Paper
Advertisement

Motorola Edge 60 Fusion: షాకిచ్చిన మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ప్రైస్ డ్రాప్‌.. ఇప్పుడు కొనకపోతే తర్వాత మీరే ఫీలవుతారు!

Motorola Edge 60 Fusion: షాకిచ్చిన మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ప్రైస్ డ్రాప్‌.. ఇప్పుడు కొనకపోతే తర్వాత మీరే ఫీలవుతారు!
Advertisement

Motorola Edge 60 Fusion: మోటరోలా ఈ ఏడాది విడుదల చేసిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘Motorola Edge 60 Fusion’ ధర మరోసారి తగ్గింది. లాంచ్ సమయంలో రూ.25,999గా ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్:

ప్రస్తుతం Motorola Edge 60 Fusion రూ.20,999 నుంచి ప్రారంభ ధరకు లభిస్తుండగా.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. అన్ని ఆఫర్లు కలిపితే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను రూ.22,999కే మీ సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: స్మార్ట్‌ఫోన్ ఏ టైమ్‌లో కొనుగోలు చేస్తే డబ్బులు మిగులుతాయి?.. ఈ టిప్‌తో వేలకు వేలు ఆదా!

నాలుగు రంగుల్లో:

ఈ స్మార్ట్‌ఫోన్ 8GB + 256GB, 12GB + 256GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

ప్రీమియం లుక్:

Advertisement

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లో 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K 3D కర్డ్వ్ స్క్రీన్‌తో వీడియోలు, గేమింగ్‌కు మంచి అనుభూతిని ఇస్తుంది. డిస్‌ప్లేలోనే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, వెనుక భాగంలో వేగన్ లెదర్ ఫినిష్ ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

గూగుల్ ఆధారిక ఏఐ ఫీచర్లు:

ఇక పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డెమిన్సిటీ 7400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే 5500mAh బ్యాటరీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UIతో పనిచేస్తుంది. గూగుల్ జెమిని ఆధారిత ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా సెల్ఫీ కెమెరా:

కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ సెన్సార్, 13MP సెకండరీ కెమెరాతో డ్యూయల్ రియర్ సెటప్ ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అందించారు. అదనంగా, ఈ ఫోన్ IP68, IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌లతో వస్తుంది.

Also Read: భారత్‌లో boAt వాలర్ రింగ్ 1 లాంచ్.. 15 రోజుల బ్యాటరీతో ప్రీమియం స్మార్ట్ రింగ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×