E-Paper
Advertisement

Moto G67, Moto G77: డిస్‌ప్లే అద్భుతం.. ఫీచర్లు అమోఘం.. మోటో G67, మోటోG77 త్వరలో విడుదల!

Moto G67, Moto G77: డిస్‌ప్లే అద్భుతం.. ఫీచర్లు అమోఘం.. మోటో G67, మోటోG77 త్వరలో విడుదల!
Advertisement

Moto G67, Moto G77: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మోటరోలా.. మరోసారి మార్కెట్‌ను షేక్ చేసేందుకు సిద్ధమైంది. ఆధునిక ఫీచర్లను అందుబాటు ధరలో సామాన్యులకు చేరువ చేయడంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా గ్రీక్ ఆన్‌లైన్ స్టోర్ ‘ఇన్సోమ్నియా’లో లీకైన వివరాల ప్రకారం.. Moto G67, Moto G77 అనే రెండు పవర్‌ఫుల్ ఫోన్లు త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. మిడ్‌రేంజ్ విభాగంలో ఇతర కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా ఈ ఫోన్లను మోటరోలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

ఫోన్ కిందపడినా పగలదు:

ఈ రెండు ఫోన్లలో 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే Extreme AMOLED స్క్రీన్‌తో రానుంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఎండలో ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ సరిగ్గా కనిపించదనే సమస్య ఇక ఉండదు. ఎందుకంటే ఈ మోడల్స్ ఏకంగా 5000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటాయి. ఇక గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఫోన్ ఒకవేళ కింద పడినా స్క్రీన్ దెబ్బతినకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

Advertisement

Also Read: కెమెరా కింగ్ ఒప్పో ఫైండ్ X8 ప్రోపై ఏకంగా రూ.18వేల తగ్గింపు.. అమెజాన్ సేల్ ఆఫర్ ఫుల్ డీటెయిల్స్!

అత్యాధునిక చిప్‌సెట్స్:

నేటి తరం యూజర్ల అంచనాలకు అనుగుణంగా మోటరోలా ఈ మోడల్స్‌లో శక్తివంతమైన ప్రాసెసర్లను అమర్చింది. Moto G67 మోడల్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రానుండగా.. మరింత స్పీడ్ కోరుకునే వాళ్ల కోసం Moto G77లో డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మల్టీ టాస్కింగ్ కోసం G67లో 4GB RAM, G77లో 8GB LPDDR4x RAMను అందించారు. 128GB స్టోరేజ్ సామర్థ్యం ఉండటంతో ఫొటోలు, వీడియోలు, యాప్స్‌ను స్టోర్ చేసుకోవడంలో ఇక ఎలాంటి సమస్య ఉండదు.

అద్భుతమైన కెమెరా సెటప్:

Advertisement

ఇక కెమెరా విభాగంలో మోటరోలా ఎక్కడా రాజీ పడలేదు. Moto G67లో 50MP మెయిన్ కెమెరా ఉండగా.. Moto G77లో ఏకంగా 108MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇది అతి తక్కువ లైటింగ్‌లో కూడా స్పష్టమైన, క్వాలిటీ ఫొటోలను క్లిక్ చేసేందుకు హెల్స్ అవుతుంది. ఇక సెల్ఫీ లవర్స్ కోసం అయితే.. 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. దీంతో వీడియో కాల్స్, సోషల్ మీడియా రీల్స్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్:

ఈ Moto G67, Moto G77 ఫోన్లు అప్డేటెడ్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఎక్కువ కాలంపాటు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేలా 5200mAh బ్యాటరీని, దానికి తోడు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇక భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, IP64 డస్ట్‌ వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఈ ఫోన్లు మెరుగైన పనితీరులు అందిస్తాయి.

Also Read: భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వివో కొత్త మొబైల్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలివే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×