E-Paper
Advertisement

Moto G57 Power: వర్త్ వర్మా వర్తు.. కళ్లు చెదిరేలా మోటొరొలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

Moto G57 Power: వర్త్ వర్మా వర్తు.. కళ్లు చెదిరేలా మోటొరొలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!
Advertisement

Moto G57 Power: ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా మోటొరొలా నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. బిగ్‌బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో మోటొ జీ57 పవర్‌ పేరిట 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది సంస్థ. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..

మోటరొలా నుంచి వచ్చిన ఈ మోటో జీ57 పవర్‌ ఫోన్‌ ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 16తో పనిచేస్తుంది. 6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఎల్‌సీడీ స్క్రీన్‌తో లభిస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటు, 120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేటుతో వస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా అమర్చారు. అలాగే ఈ ఫోన్‌కు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. ముందువైపు 8 ఎంపీ కెమెరా కూడా ఉంటుంది.

Advertisement

Read Also: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ ఫ్రైడే ఆఫర్ల జాతర.. ఐదు ఖతర్నాక్ ఫోన్లను ఒకేసారి కొల్లగొట్టొచ్చు!

7000 ఎంహెచ్‌ఏ బ్యాటరీ:

మోటో జీ57 పవర్ బడ్జెట్‌ ఫోన్‌ అయినప్పటికీ.. కెమెరా పరంగా చూసుకుంటే కొన్ని AI ఫీచర్లు ఇచ్చారు. షాట్‌ ఆప్టిమైజేషన్‌, ఆటో స్మైల్‌ కాప్చర్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌, ఫొటో అన్‌బ్లర్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే ఈ మెటొ జీ57 పవర్ ఫోన్ బ్లూటూత్‌ 5.1, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ కలిగి ఉంటుంది. 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్న ఈ హ్యాండ్ సెట్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌‌ను అందిస్తుంది.

ధర విషయానికొస్తే..

Advertisement

ఇక ఈ మోటో జీ57 పవర్ ఫోన్ ఒకేఒక్క వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా.. బ్యాంక్‌ ఆఫర్‌, లాంచ్‌ డిస్కౌంట్‌ కింద రూ.12,999 ధరకే ఈ మోటొ జీ57 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. డిసెంబరు 3 నుంచి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ విక్రయానికి రానుంది. మొత్తం మూడు రంగుల్లో మోటొ జీ57 పవర్ ఫోన్ లభించనుందని సంస్థ తెలిపింది.

Read Also: వచ్చేస్తోంది నథింగ్ ఫోన్ 3a లైట్.. దీని స్పెషాలిటీ తెలిస్తే మైండ్ బ్లాకే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×