E-Paper
Advertisement

Vehicle Motion Cues App : ప్రయాణాల్లో వాంతులు ఆపటానికో యాప్ ఉందని తెలుసా.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే!

Vehicle Motion Cues App : ప్రయాణాల్లో వాంతులు ఆపటానికో యాప్ ఉందని తెలుసా.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే!
Advertisement

Vehicle Motion Cues App : చాలాసార్లు కారు, బస్సు లేదా ఇతర వాహనాలపై ప్రయాణం చేయడం కొంతమందికి సమస్యగా మారుతుంటుంది. ఎక్కువ సేపు ప్రయాణించే క్రమంలో వారు అసౌకర్యానికి గురవ్వడం, వాంతులు చేసుకోవడం చేస్తుంటారు. ముఖ్యంగా తేలికపాటి ఆహారాన్ని తినే బదులు ఎక్కువ ఆహారం తిన్న తర్వాత ప్రయాణించేటప్పుడే చాలా మందికి వాంతులు అవుతుంటాయి. అందుకే కారు లేదా ఇతర వాహనాల్లో లాంగ్ జర్నీకి వెళ్లాడానికి భయపడుతుంటారు. ఎందుకంటే తమ వళ్ల ఇతరులు కూడా అసౌకర్యానికి గురవ్వాల్సివస్తుందని. అందుకే కారులో ప్రయాణించేటప్పుడు మోషన్ సిక్‌నెస్​కు గురవ్వకుండా ఉండేందుకు, లేదంటే వాంతులు అయ్యే అవకాశాలను తగ్గించేందుకు ఓ నయా ఫీచర్​ను ఐఫోన్​ ఆ మధ్య తీసుకొచ్చింది.

ప్రయాణంలో వాంతులు అవ్వడాన్ని వైద్య పరిభాషలో మోషన్ సిక్ నెస్ అంటారు. అయితే ఇంతకీ ఆ ఫీచర్ పేరు ఏంటంటే వెహికల్ మోషన్ క్యూస్​ (Vehicle Motion Cues). ఇది ఐఫోన్​ iOS 18లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్​లో లేదు. కానీ వాస్తవానికి ఐఫోన్ కన్నా ఎక్కువ మంది ఆండ్రాయిడ్​ యూజర్సే ఉంటారు. కాబట్టి ఆండ్రాయిడ్​లో ఈ ఫీచర్​ అందుబాటులో లేనప్పటికీ, దాని ఉపయోగించుకునేందుకు ఓ అవకాశం ఉంది. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

ఆండ్రాయిండ్​లో ఎలా ఈ వెహికల్​ మోషన్ క్యూస్​ ఫీచర్​ ఉపయోగించొచ్చంటే?

ప్రయాణించేటప్పుడు మోషన్​ సిక్​నెస్​ను తగ్గించేందుకు, ఆండ్రాయిడ్​ స్మార్ట్ ఫోన్​లో వెహికల్ మోషన్​ క్యూస్ ఫీచర్​ను ఉపయోగించుకునేందుకు​ వీలుగా ఓ యాప్​ అందుబాటులో ఉంది. దాని పేరు కైన్​స్టాప్​ ( KineStop).

Advertisement

మీ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ KineStop యాప్‌ను Google Play Store నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో మంచి రేటింగ్​ ను కలిగి ఉంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయితే తర్వాత, మీరు మొబైల్ డిస్‌ప్లేలో కొన్ని చుక్కలు కనిపిస్తాయి. వాహనాల మోషన్ డిటెక్షన్‌తో అవి వస్తాయి. అంటే కారు లేదా ఇతర వాహనం కదులుతున్నప్పుడు అవి కూడా అవే దిశలో పయనిస్తుంటాయి. తద్వారా మీ దృష్టి ఎక్కువగా ఈ చుక్కలపైనే పడుతుంది! ఈ చుక్కలు మోషన్ సిక్​నెస్​, వాంతులు వస్తాయేమో అనే ఆలోచన దృష్టిని దారీ మళ్లీస్తుంది. అలా మీకు మోషన్ సిక్‌నెస్, వాంతులు వచ్చే అవకాశాన్ని ఈ యాప్ తగ్గిస్తుంది.

Google Play Store నుంచి KineStopని ఇన్‌స్టాల్ చేయాలి.
యాప్‌లోకి వెళ్లి అలో డిస్​ప్లే ఓవర్​ అదర్ యాప్స్​పై క్లిక్ చేసి ఓకే అనాలి.
ఇది టర్న్ ఆన్ అవ్వగానే, యాప్​లో నుంచి వెనక్కి వెళ్లి, ప్లే బటన్​పై ట్యాప్ చేయాలి.
అప్పుడు యాప్​, మీ డిస్​ప్లే పై బబుల్స్​(చుక్కలు)ను చూపించడం ప్రారంభిస్తుంది. అక్కడే మీకు నచ్చిన థిమ్​ను, కలర్స్​ను ఎంచుకోవచ్చు.
ఈ యాప్​ మీ ఫిజికల్ యాక్టివిటీని కూడా ట్రాక్ చేస్తుంటుంది.
అలానే యాప్​లోని కాగ్​వీల్​ ఐకాన్​పై క్లిక్​ చేస్తే మీరు వెహికల్​లో ఉన్నప్పుడు ఆటోమెటిక్​గా యాప్ ఆటోస్టార్ట్ అయిపోతుంది.
ఇంకా మరెన్నో ఆప్షన్స్​, ఫీచర్స్ ఈ యాప్​లో ఉన్నాయి.

ఐఫోన్​లో ఎలా అంటే?

ఐఫోన్ యూజర్స్​కు ఈ KineStop యాప్‌ను యాపిల్​ ప్లేస్టోర్​ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు. లేదంటే పైన పేర్కొన్న Vehicle Motion Cues ఫీచర్​ iOS 18లో ఆటోటెటిక్​గా ఉంటుంది. ఐఫోన్ సెట్టింగ్స్​, యాక్సెసిబిలిటీకి వెళ్లి మోషన్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత షో వెహికల్ మోషన్ క్యూస్​ను ఎంపిక చేయాలి. సో మీరు మోషన్ సిక్​నెస్​ బాధితులైతే ఎంచక్కా ఈ యాప్​ను ఉపయోగించుకుని మీ ప్రాబ్లమ్​ను సాల్వ్​ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×