E-Paper
Advertisement

ఏఐ రేసులో దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. గూగుల్, ఓపెన్ ఏఐలకు చెక్ పెట్టేలా MAI మోడల్స్ లాంచ్!

ఏఐ రేసులో దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. గూగుల్, ఓపెన్ ఏఐలకు చెక్ పెట్టేలా MAI మోడల్స్ లాంచ్!
Advertisement

Microsoft AI Models: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవానే నడుస్తోంది. నిన్నటి వరకు గూగుల్, ఓపెన్ ఏఐ లాంటి కంపెనీలే ఈ రంగంలో టాప్ అనుకుంటుంటే.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అంతకు మించి అనేలా 3 సరికొత్త ఏఐ మోడల్స్‌ను మార్కెట్లోకి వదిలింది. ఫొటోలు క్రియేట్ చేయడం, మనలాగే మాట్లాడటం, వాయిస్‌ను టెక్స్ట్‌గా మార్చడం.. ఇలా మూడు వేర్వేరు పనుల కోసం వీటిని తీసుకొచ్చారు. ఈ ఏఐ కొత్త మోడల్స్ అత్యంత వేగంగా పని చేయడమే కాకుండా.. ఇతర కంపెనీల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

మాటలను అక్షరాల్లోకి మార్చేస్తుంది..

మనం మాట్లాడే మాటలను తప్పులు లేకుండా అక్షరాల్లోకి మార్చడం అంత సులభం కాదు. కానీ మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘ఏఐ-ట్రాన్స్‌క్రైబ్-1’ ఈ విషయంలో తోపు అనిపించుకుంటోంది. మన తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే 25 భాషల్లో ఇది చాలా స్పష్టంగా పని చేస్తుందట. గూగుల్ జెమిని లాంటి మోడల్స్‌తో పోలిస్తే దీని తప్పులు చాలా తక్కువగా వస్తున్నాయని మైక్రోసాఫ్ట్ గర్వంగా చెబుతోంది. ముఖ్యంగా ఆఫీస్ పనులు చేసేవారికి.. కంటెంట్ క్రియేటర్లకు ఈ ఏఐ మోడల్స్ ఎంతో ఉపయోగకరం.

Advertisement

Also Read: ఫోన్ రీసెట్ చేసే ముందు ఈ ఒక్క పని చేయకపోతే.. మీ గూగుల్ అకౌంట్ డేంజర్లో పడ్డట్టే!

అచ్చం మనిషి లాంటి వాయిస్..

ఇక ‘ఎంఏఐ-వాయిస్-1’ విషయానికి వస్తే.. ఇది అసలు ఏఐ వాయిస్ అంటే నమ్మలేనంత సహజంగా ఉంటుంది. మన గొంతులో ఉండే ఎమోషన్స్, హెచ్చుతగ్గులను ఇది చక్కగా పట్టుకుంటుంది. కేవలం కొన్ని సెకన్ల ఆడియో ఇస్తే చాలు.. అచ్చం మనలాగే మాట్లాడే వాయిస్‌ను ఇది సృష్టించగలదు. భవిష్యత్తులో మనం వినే పాడ్‌కాస్ట్‌లు, కోపైలట్ వాయిస్ మెసేజ్‌లలో ఈ టెక్నాలజీ సంచలనం సృష్టించబోతోంది. పైగా ఈ మోడల్స్ ఎంతో సురక్షితమైనవని కంపెనీ హామీ ఇస్తోంది.

రియలిస్టిక్ ఫొటోలు సృష్టించగలదు..

Advertisement

ముఖ్యంగా బొమ్మలు గీసే ‘ఎంఏఐ-మేజ్-2’ గురించి చెప్పుకోవాల్సిందే. ఇది పాత మోడల్స్ కంటే చాలా వేగంగా, హై క్వాలిటీ ఫొటోలను క్రియేట్ చేస్తుంది. ఫొటోగ్రాఫర్లు, డిజైనర్ల సలహాలతో దీనిని తయారు చేయడం వల్ల ఫొటోల్లో లైటింగ్, షేప్ చాలా నేచురల్‌గా ఉంటాయి. సాధారణంగా ఏఐ చిత్రాల్లో అక్షరాలు సరిగ్గా రావు, కానీ దీనిలో టెక్స్ట్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు ఈ మోడల్‌ను వాడటం మొదలుపెట్టాయి. మొత్తానికి మైక్రోసాఫ్ట్ ఈ కొత్త అస్త్రాలతో టెక్ ప్రపంచంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Also Read: బడ్జెట్ ధరలో 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ.. హానర్ నుంచి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×