E-Paper
Advertisement

Mi 40 Inch Full HD TV: సినిమా హాల్ ఎక్స్ పీరియెన్స్ ఇంట్లోనే! రూ.20 వేలలోపే Mi 40 ఇంచుల స్మార్ట్ టీవీ

Mi 40 Inch Full HD TV: సినిమా హాల్ ఎక్స్ పీరియెన్స్ ఇంట్లోనే! రూ.20 వేలలోపే Mi 40 ఇంచుల స్మార్ట్ టీవీ
Advertisement

Mi 40 Inch Full HD TV: ప్రస్తుతం స్మార్ట్ టీవీ అనేది ప్రతి ఇంట్లో ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కేవలం టీవీ ఛానల్స్ మాత్రమే కాకుండా OTT ప్లాట్‌ఫారమ్స్, గేమ్స్, యాప్స్‌ని ఎంజాయ్ చేయాలనుకునే.. వారికి Mi 40 Inch Full HD TV (4A Horizon Edition) బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అద్భుతమైన బెజెల్-లెస్ డిజైన్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ , బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్న ఈ టీవీ, మధ్యతరగతి కుటుంబాలకు సరి పోతుంది. దీని ధర ,ఫీచర్ల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్లు:
Xiaomi సంస్థ ఇండియాలో స్మార్ట్ టీవీ మార్కెట్‌ను ఏలుతోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా వారి 4A Horizon Edition సిరీస్ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటోంది. 32 ఇంచుల టీవీ చిన్నగా, 43 ఇంచుల టీవీ ధర ఎక్కువగా అనిపించే వారికి 40 ఇంచుల Mi టీవీ సరిగ్గా సరిపోతుంది.

Advertisement

డిజైన్, డిస్‌ప్లే:
ఈ టీవీ యొక్క ప్రధాన ఆకర్షణ దీని డిస్ ప్లే . సాధారణ టీవీల లాగా చుట్టూ లావుపాటి నలుపు రంగు అంచులు లేకుండా, దాదాపు 93% స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఇది వస్తుంది. దీని వల్ల మీరు సినిమా చూస్తున్నప్పుడు టీవీ చూస్తున్న ఫీల్ కంటే.. ఒక విండో ద్వారా సన్నివేశం ప్రత్యేకంగా చూస్తున్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఫుల్ హెచ్డీ (1920×1080) రిజల్యూషన్, Mi సొంత టెక్నాలజీ అయిన Vivid Picture Engine రంగులను మరింత సహజంగా, స్పష్టంగా చూపిస్తాయి.

హార్డ్‌వేర్ , సాఫ్ట్‌వేర్ :
ఈ స్మార్ట్ టీవీలో క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంటుంది. దీనికి తోడు 1GB RAM , 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. యాప్స్ మారేటప్పుడు లేదా సెట్టింగ్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే.. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకు నచ్చిన వేలకొద్దీ యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

సౌండ్ క్వాలిటీ:
కేవలం పిక్చర్ క్వాలిటీ బాగుంటే సరిపోదు. సౌండ్ కూడా అద్భుతంగా ఉండాలి. ఇందులో 20W శక్తివంతమైన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇవి DTS-HD సౌండ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. దీని వల్ల డైలాగులు చాలా స్పష్టంగా వినబడతాయి. రూం నిండా సౌండ్ రావడంతో మీరు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు నిజమైన థియేటర్ అనుభవం కలుగుతుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్:
3 HDMI Ports: గేమింగ్ కన్సోల్స్ లేదా సెట్-టాప్ బాక్సుల కోసం.

2 USB Ports: పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌ల కోసం.

Wi-Fi & Bluetooth 4.2: ఇంటర్నెట్ , వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి.

Ethernet Port: స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం.

Also Read: తక్కువ బడ్జెట్‌లో టాప్ సెక్యూరిటీ.. రూ. 1500 లోపే బుల్లి కెమెరా, వెంటనే కొనేయండి

ధర:
ప్రస్తుతం మార్కెట్లో Mi 40 Inch Horizon Edition ధర సుమారు రూ.21,000 నుంచి రూ.23,000 మధ్యలో ఉంది. పండగ సీజన్లలో లేదా సేల్ సమయంలో ఇది మరింత తక్కువకు లభించే అవకాశం ఉంది. మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా Mi అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీనిని కొనొచ్చు.

25 వేల రూపాయల లోపు ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే.. Mi 4A Horizon Edition కచ్చితంగా మీ లిస్టులో ఉండాలి. పాత టీవీలను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీనిలోని ప్యాచ్‌వాల్ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన కంటెంట్‌ను ఈజీగా వెతుక్కోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×