E-Paper
Advertisement

Air Coolers: ప్లాస్టిక్ vs ఐరన్ కూలర్లు.. మెరుగైన కూలింగ్‌కు.. రెండింటిలో ఏది బెస్ట్?

Air Coolers: ప్లాస్టిక్ vs ఐరన్ కూలర్లు.. మెరుగైన కూలింగ్‌కు.. రెండింటిలో ఏది బెస్ట్?
Advertisement

Air Coolers: ప్రస్తుత వేసవి నేపథ్యంలో మార్కెట్ లో కూలర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఏసీని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని వారు.. పెద్ద ఎత్తున కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్ లో రెండు రకాల ఇన్ బిల్ట్ క్వాలిటీతో కూలర్లు లభిస్తున్నాయి. ఒకటి ఇనుము (Metal Body Coolers)తో చేసింది కాగా, మరొకటి ప్లాస్టిక్ (Plastic Body Coolers) తో ఉత్పత్తి చేసింది. అయితే కూలింగ్ పరంగా చూస్తే రెండింటిలో ఏది బెస్ట్ అన్నది ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఐరన్ కూలర్లు

సాధారణంగా ప్లాస్టిక్ బాడీతో వచ్చిన కూలర్ల కంటే ఐరన్ కూలర్లు మెరుగైన కూలింగ్ ను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి గల కారణాలను సైతం విశ్లేషిస్తున్నారు. ఐరన్ కూలర్లలో పెద్ద సైజు ఫ్యాన్లు, శక్తివంతమైన మోటార్లు వాడతారు. ఇవి ప్లాస్టిక్ కూలర్ల కంటే ఎక్కువ ఫోర్స్‌తో గాలిని బయటకు నెట్టి అధిక చల్లదాన్ని ఇస్తాయి. అంతేకాకుండా మెటల్ బాడీ డిజైన్ వల్ల ఎక్కువ వైశాల్యంలో నీరు ప్రవహించే అవకాశం ఉంటుంది. ఫలితంగా గాలి త్వరగా చల్లబడుతుంది.

మరి ప్లాస్టిక్ కూలర్ల సంగతేంటి?

Advertisement

ప్రస్తుతం లభిస్తున్న అత్యాధునిక కూలర్లు.. ప్లాస్టిక్ లేదా ఫైబర్ బాడీని కలిగి ఉన్నాయి. వీటిలో వాడే హనీకోంబ్ ప్యాడ్లు చల్లదనాన్ని బాగానే ఇస్తాయి కానీ ఇవి ఎక్కువగా ఇండోర్ వాడకానికి సరిపోతాయి. ఐరన్ కూలర్లతో పోలిస్తే ప్లాస్టిక్ కూలర్లు సైలెంట్ గా తమ పని చేసుకుపోతాయి. ఐరన్ కూలర్ల తరహాలో ప్లాస్టిక్ కూలర్లకు తుప్పు పట్టే సమస్య ఉండదు. ఐరన్ కూలర్లకు ప్రతి ఏటా పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది. లేదంటే లీకేజీలు వస్తాయి. కానీ ప్లాస్టిక్ కూలర్లకు ఇవేమి అక్కర్లేదు.

Also Read: ‘చాలా క్యూట్‌ ఉన్నారు.. మీ వయసెంత’.. మహిళతో ర్యాపిడో డ్రైవర్ పిచ్చివేషాలు!

ఫైనల్‌గా ఏది బెటర్ అంటే?

Advertisement

అత్యధిక కూలింగ్ తో పాటు గాలి ఫోర్స్ ఎక్కువగా ఉండాలని కోరుకునేవారికి ఐరన్ కూలర్లు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. అయితే దాని నుంచి వచ్చే శబ్దాన్ని కూడా భరించేందుకు రెడీగా ఉంటేనే దానిని ట్రై చేయండి. అలా కాకుండా స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు, తక్కువ శబ్దం, తుప్పు భయం లేకుండా ఉండాలని భావిస్తే నేరుగా ప్లాస్టిక్ బాడీతో రూపొందిన కూలర్లు కొనుగోలు చేయవచ్చు. కాబట్టి మీ అభిరుచి, అవసరానికి తగ్గట్లు ఉన్నదానిని మీరే ఎంచుకోండి.

Also Read: వాషింగ్ మిషన్‌లో.. అల్యూమినియం ఫాయిల్ బాల్స్.. ఆ తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×