E-Paper
Advertisement

వారెవ్వా మెటా క్రేజీ అప్డేట్.. గాల్లో వేళ్లు కదిలిస్తే చాలు మెసేజ్ టైప్ అయిపోద్ది, వాట్సప్, ఇన్‌స్టా యూజర్లు ఫుల్ ఖుషీ!

వారెవ్వా మెటా క్రేజీ అప్డేట్.. గాల్లో వేళ్లు కదిలిస్తే చాలు మెసేజ్ టైప్ అయిపోద్ది, వాట్సప్, ఇన్‌స్టా యూజర్లు ఫుల్ ఖుషీ!
Advertisement

Meta Smart Glasses: స్మార్ట్ ఫోన్ల దునియాలో ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ సరికొత్త సంచలనానికి తెరలేపింది. మనం వాడుకునే కళ్లద్దాలనే స్మార్ట్ గ్లాసెస్‌గా మార్చేసి, వాటిల్లో అదిరిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను తీసుకొచ్చింది. ఇకపై చాటింగ్ చేయాలంటే ఫోన్ ముట్టుకోవాల్సిన పని లేదు. కీబోర్డ్ అస్సలు అక్కర్లేదు. కేవలం గాల్లో చేతి వేళ్లను అలా కదిలిస్తే చాలు.. మనం ఏం అనుకుంటున్నామో అది టైప్ అయిపోతుంది. దీనికోసం చేతికి పెట్టుకునే ఒక స్పెషల్ రిస్ట్‌బ్యాండ్‌ను మెటా రెడీ చేసింది. ఇది మన వేళ్ల కదలికలను ఇట్టే పసిగట్టేసి మెసేజ్‌లుగా మార్చేస్తుంది.

ఫోన్ తీసే పనిలేదిక..

ఈ క్రేజీ అప్‌డేట్ వల్ల మనకు రోజూ ఉపయోగపడే వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లతో పాటు ఫోన్లలో ఉండే నార్మల్ మెసేజ్ సర్వీసులను కూడా వాడుకోవచ్చు. బండి నడుపుతున్నప్పుడో, లేదా చేతుల్లో ఏదైనా సామాన్లు ఉండి ఫోన్ తీసే వీలు లేనప్పుడో.. జేబులోంచి ఫోన్ బయటకు తీయకుండానే ఈ కళ్లద్దాల సాయంతో ఈజీగా చాటింగ్ కానిచ్చేయొచ్చు.

Advertisement

Also Read: ఏసీ వాడకంలో ఈ 5 మార్పులు చేసుకుంటే.. 30 శాతం వరకు విద్యుత్ ఆదా!

మరెన్నో ఫీచర్లు..

ఈ గ్లాసెస్ కేవలం టైపింగ్‌కే కాదు.. మనం చూసే పరిసరాలను, చుట్టుపక్కల వచ్చే సౌండ్స్‌తో కలిపి లైవ్‌గా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. రీల్స్ చేసే సోషల్ మీడియా క్రియేటర్లకు ఇక పండగ అనే చెప్పాలి. అంతేకాదు.. పెద్ద పెద్ద సౌండ్లు వచ్చే చోట వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, అవతలి వారు ఏం మాట్లాడుతున్నారో కళ్లద్దాల స్క్రీన్ మీద టెక్స్ట్ రూపంలో (లైవ్ క్యాప్షన్స్) కనిపిస్తుంది. దీంతో పాటు లండన్, ప్యారిస్, రోమ్ లాంటి పెద్ద నగరాల్లో నడిచి వెళ్లేవారికి దారి చూపే నావిగేషన్ సిస్టమ్‌ను కూడా మెటా అప్‌గ్రేడ్ చేసింది.

యాప్స్ క్రియేటర్లకు పండగే..

Advertisement

కేవలం మనలాంటి యూజర్లకే కాకుండా.. కొత్త యాప్స్ తయారు చేసే డెవలపర్ల కోసం కూడా మెటా ఒక సూపర్ టూల్ కిట్‌ను తెచ్చింది. దీని సాయంతో స్మార్ట్ గ్లాసెస్ కోసం చిన్న చిన్న వెబ్ యాప్స్‌ను ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. మన ఫోన్లలో ఉండే పాత యాప్స్‌ను కూడా ఈ గ్లాసెస్ స్క్రీన్‌కు సెట్ అయ్యేలా మార్చుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే.. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కేవలం స్టైల్ కోసం కాకుండా, రాబోయే రోజుల్లో ఫోన్లకు, కంప్యూటర్లకు ప్రత్యామ్నాయంగా మార్చాలని మెటా గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

Also Read: షాపింగ్‌లో హెల్ప్ చేయడానికి Amazon Alexa AI వచ్చేసింది.. ఇక డీల్స్ వెతకడం మరింత ఈజీ!

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×