E-Paper
Advertisement

Meta Oakley AI glasses: మెటా నుంచి నయా స్మార్ట్ గ్లాసెస్.. ధర ఏకంగా రూ.52,300.. ఎందుకంత స్పెషల్?

Meta Oakley AI glasses: మెటా నుంచి నయా స్మార్ట్ గ్లాసెస్.. ధర ఏకంగా రూ.52,300.. ఎందుకంత స్పెషల్?
Advertisement

Meta Oakley AI glasses: సాధారణంగా కళ్లద్దాలను స్టైల్ కోసమో, కంటి సంకరక్షణ కోసమో వినియోగిస్తుంటారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏఐ స్మార్ట్ గ్లాసెస్ సైతం మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఓక్లీ, మెటా సంస్థలు కలిసి ‘మెటా ఓక్లీ వాన్ గార్డ్ ఏఐ గ్లాసెస్’ పేరుతో అడ్వాన్స్డ్ కళ్లద్దాలను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. గతేడాది సెప్టెంబర్ లోనే ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి మెటా, ప్రకటించగా తాజాగా అవి అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే అత్యంత ప్రీమియం గ్లాసెస్ గా ఇవి నిలిచాయి. ఇంతకీ ఈ మెటా ఏఐ కళ్లద్దాల ప్రత్యేకత ఏంటీ? ఇందులో ఎలాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి? ఎవరిని ఉద్దేశించి వీటిని రూపొందించారు? వంటి అంశాలను పరిశీలిద్దాం.

వారి కోసమో ప్రత్యేకంగా..

అథ్లెట్లు, సాహసయాత్రలు చేసే వారి కోసం మెటా, ఓక్లీ సంయుక్తంగా ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ను విడుదల చేశాయి. ప్రిజం టెక్నాలజీతో కూడిన ప్రత్యేక లెన్స్ లతో దీనిని తయారు చేశారు. ఈ గ్లాసెస్ ను ధరించడం ద్వారా సూర్య కాంతి, గాలి, నీరు వంటి అవాంతరాలను సమర్థవంతంగా అధిగమించవచ్చు.

స్మార్ట్ ఫీచర్లు..

Advertisement

వాన్ గార్డ్ ఏఐ గ్లాసెస్.. 12MP పీవోవీ (పాయింట్ ఆఫ్ వ్యూ) కెమెరాను కలిగి ఉంది. మారథాన్ లేదా పారా గ్లైడింగ్ సమయంలో తమ అద్భుతమైన క్షణాలను ఇందులో రికార్డు చేయవచ్చు. ఏఐ గ్లాసెస్ లెన్స్.. 122 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉంది. కాబట్టి స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ ను 3K రిజల్యూషన్ తో రికార్డు చేయగలదు.

ఏఐ కాల్స్ సదుపాయం

ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ కు ఓపెన్ ఇయర్ స్పీకర్స్ ను సైతం అమర్చారు. ఇవి ఆడియోను సమర్థవంతంగా రికార్డు చేస్తుంది. అలాగే మెటా ఏఐ కాల్స్ , సందేశాలు పంపడం వంటివి ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా చేయవచ్చు. ఇందులో ఐదు మోక్రోఫోన్ సెటప్ కూడా ఉంది. అంతేకాకుండా యూజర్ హెల్త్ మానిటరింగ్ చేసే సెన్సార్లు సైతం ఈ గ్లాసెస్ లో ఉన్నాయి. ‘హే మెటా, నా హార్ట్ బీట్ ఎంత?’, ‘హే మేటా, నేను ఎలా ఉన్నాను?’ వంటి ప్రశ్నల ద్వారా లెన్స్ పై మీ బాడీకి సంబంధించిన స్థితిగతుల డేటాను పొందవచ్చు.

9 గంటల పాట నాన్ స్టాప్

Advertisement

ఏఐ గ్లాసెస్ కు స్మాల్ బ్యాటరీని సైతం ఫిక్స్ చేశారు. దీంతో తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా స్మార్ట్ గ్లాసెస్ పనిచేస్తాయి. 6 గంటల పాటు సాంగ్స్ సైతం వినవచ్చు. మరోవైపు 36 గంటలకు సరిపడ ఛార్జింగ్ అందించే పవర్ కేస్ ను సైతం ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ తో పాటు పొందవచ్చు. 20 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు.

Also Read: Bajaj 8 New Pulsars: ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 8 పల్సర్ బైక్స్ లాంచ్!

యూపీఐ చెల్లింపులు సైతం..

ఇతర మెటా గ్లాసెస్ తరహాలోనే.. వాన్ గార్డ్ కూడా హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ ఇంటరాక్షన్ ను అందిస్తుంది. భారతీయ వెర్షన్ లో హిందీ లాంగ్వేజ్ సపోర్టు కూడా ఉంది. హిందీ భాష సాయంతో యూపీఐ లైట్ చెల్లింపులు సైతం చేయవచ్చు. ఇక ఈ స్మార్ట్ గ్లాసెస్ కలర్స్ విషయానికి వస్తే 3 వేరియంట్లలో లభిస్తోంది. ఇది దూమ్ము, దూళి, నీటి నుంచి రక్షణ కల్పించే IP67- రేటింగ్ ను కలిగి ఉంది.

Also Read: Oppo Reno 14: ఓప్పో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ.6000 ధర తగ్గింపు.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×