// // Meta AI Glasses: ఇక స్మార్ట్‌ఫోన్ అక్కర్లేదు.. ఈ మెటా గ్లాసెస్ ఏమేం చేయగలదో తెలిస్తే.. -->
E-Paper
Advertisement

హిందీతో పాటు 20 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్.. ఈ Meta AI Glasses మాయాజాలం చూశారా?

హిందీతో పాటు 20 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్.. ఈ Meta AI Glasses మాయాజాలం చూశారా?
Advertisement

Meta AI Glasses: ప్రముఖ టెక్ దిగ్గజం మెటా.. ప్రముఖ ఐవేర్ బ్రాండ్ ఎస్సిలోర్ లక్సోటికాతో కలిసి సరికొత్త ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘మెటా గ్లాసెస్’ పేరుతో వచ్చిన ఈ గ్యాడ్జెట్.. స్టెలిష్ డిజైన్లతో పాటు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. కైలీ జెన్నర్ ఎడిషన్‌తో పాటు మూడు విభిన్న ఫ్రేమ్ స్టైల్స్‌లో ఇవి లభిస్తాయి.

ధర ఎంతంటే?

ఈ సరికొత్త మెటా గ్లాసెస్ ప్రారంభ ధర రూ.28,000గా ఉంది. ఇవి అమెజాన్, బెస్ట్ బై, మెటా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి. క్లాసిక్ బ్లాక్, రేసింగ్ గ్రీన్, మెర్లోట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇందులో క్లియర్, సన్, పోలరైజ్డ్ లెన్స్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ వాడేవారి కోసం ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి పలు దేశాల్లో ప్రస్తుతానికి ఇవి అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయనేది మెటా ఇంకా ప్రకటించలేదు.

Advertisement

Also Read: భారత్‌లో boAt Airdopes ProClip లాంచ్.. తక్కువ ధరలో ప్రైవసీకి పక్కా గ్యారెంటీ!

మ్యూజ్ స్పార్క్ ఏఐ ప్రత్యేకత:

ఈ గ్లాసెస్‌లో మెటా సూపర్ఇంటెలిజెన్స్ లాబ్స్ రూపొందించిన సరికొత్త ‘మ్యూజ్ స్పార్క్’ ఏఐ మోడల్‌ను ఉపయోగించారు. ఇది కేవలం వాయిస్ అసిస్టెంట్‌లా కాకుండా.. మనం చూసే వాటిని అర్థం చేసుకుని సమాధానాలు చెప్పగలదు. దీని ద్వారా చేతులు ఉపయోగించకుండానే ఫొటోలు తీయడం, లైవ్ ట్రాన్స్‌లేషన్, షెడ్యూల్ మేనేజ్మెంట్, నావిగేషన్ వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు.

అద్భుతమైన ఆడియో క్వాలిటీ:

Advertisement

ఇందులో 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 12MP కెమెరాను అమర్చారు. దీని ద్వారా 3K రెజల్యూషన్‌తో అద్భుతమైన వీడియోలను, స్పష్టమైన ఫొటోలను రికార్డ్ చేయొచ్చు. అలాగే డైనమిక్ ఫొటో ఫీచర్ ద్వారా బెస్ట్ షాట్‌ను ఇది సెలెక్ట్ చేస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే.. ఈ గ్లాసెస్‌లో ఓపెన్-ఇయర్ స్పీకర్లతో పాటు ఏకంగా 6 మైక్రోఫోన్ల సిస్టమ్ ఉంది. ఇది బయటి గాలి శబ్దాలను తగ్గించి, కాల్స్ మాట్లాడుతున్నప్పుడు స్పష్టమైన వాయిస్‌ను అందిస్తుంది.

40 గంటల బ్యాటరీ బ్యాకప్:

ఈ మెటా గ్లాసెస్ సింగిల్ ఛార్జ్‌పై 8 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే మరో 40 గంటల అదనపు బ్యాటరీ లభిస్తుంది. ఇందులో 32GB స్టోరేజ్ ఉండటంతో దాదాపు 1000 ఫొటోలు లేదా వందకు పైగా చిన్న చిన్న వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే వైఫై 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో పాటు హిందీ సహా 20 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.

Also Read: ఇంతకంటే తక్కువకు రాదు.. Google Pixel 10పై రూ.29,000 వరకు లాభం పొందే సూపర్ ఛాన్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×