E-Paper
Advertisement

Leather Products : జంతుచర్మం లేకుండా లెథర్ వస్తువుల తయారీ..

Leather Products : జంతుచర్మం లేకుండా లెథర్ వస్తువుల తయారీ..
Advertisement
Leather Products

Leather Products : ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్న ప్రతీ వస్తువుకు క్రేజ్ పెరిగిపోయింది. కానీ వాటితో పాటు నేచురల్‌గా తయారు చేసిన వస్తువులకు కూడా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏ కెమికల్స్ లేకుండా పండే ఆహార పదార్థాలను తినడానికి కొంతమంది ఇష్టపడతారు. అలాగే కొన్ని వస్తువులను లెథర్‌తో చేస్తేనే కొంతమంది ఇష్టపడతారు. అయితే లెథర్‌కు ప్రత్యామ్నాయంగా అచ్చం అలాగే ఉండే వస్తువులను తయారు చేసే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.

మామూలుగా లెథర్ వస్తువులను జంతు చర్మాలతో తయారు చేస్తారు. ఇందులో చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకే ఈ వస్తువులకు రేటు కూడా భారీగానే ఉంటుంది. అలా కాకుండా అచ్చం లెథర్‌లాగా అనిపించేలా, తక్కువ ఖర్చుతో కూడా వస్తువులను తయారు చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అంతే కాకుండా ఈ వస్తువులు చూడడానికి స్టైలిష్‌గా కూడా ఉంటాయని అంటున్నారు. అయితే ఈ లెథర్ తయారీలో జంతు చర్మం కాకుండా కేవలం మొక్కలను, ఆకులను మాత్రమే ఉపయోగిస్తామని చెప్తున్నారు.

Advertisement

ఆగ్రో వేస్ట్‌తో వేగన్ లెథర్‌ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఈ పరిశోధనలు మొదటి స్టేజ్‌లోనే ఉన్నా.. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచాలని వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మామూలుగా అందరూ వేస్ట్‌గా భావించే అరటిపండు తొక్కలు, మామిడి పీచులు.. వంటి వాటితో లెథర్‌ను తయారు చేయవచ్చని, ఆ లెథర్‌తో హ్యండ్ బ్యాగ్స్, చెప్పులు, బెల్ట్స్, వాలెట్స్ లాంటివి తయారు చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు.

ఒక ప్రైవేట్ సంస్థ.. ఈ టెక్నాలజీని మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలకు సాయంగా నిలిచింది. వారం రోజుల్లో ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌తో ఉపయోగపడే వస్తువులను తయారు చేసి ఈ శాస్త్రవేత్తల బృందం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మానవాళికి ఉపయోగపడే వేగన్ లెథర్‌తో మరో అద్భుతం సృష్టించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ వేగన్ లెథర్‌ను తయారు చేసే ప్రక్రియ కూడా పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించేలా ఉండదని వారు హామీ ఇస్తున్నారు.

Advertisement

ఆగ్రో వేస్ట్‌తో తయారు చేసే లెథర్.. సాఫ్ట్‌గా, ఎక్కువకాలం ఉపయోగించే విధంగా, ధృడంగా, ఏ వాతావరణాన్ని అయినా తట్టుకునే విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సింథటిక్ లెథర్, జంతు చర్మంతో తయారు చేసిన లెథర్‌కు ప్రత్యామ్నాయం ఉండాలనే లక్ష్యంతోనే వారు ఈ పరిశోధనలు మొదలుపెట్టినట్టు తెలిపారు. ముఖ్యంగా ఇండియాలో ఆగ్రో వేస్ట్ దొరకడం చాలా సులభమని, అందుకే దానినే తమ పరిశోధనకు ముఖ్య పదార్థంగా ఎంచుకున్నట్టు బయటపెట్టారు. ఈ పరిశోధన సక్సెస్ అయ్యి మార్కెట్లోకి వస్తే లెథర్ వస్తువులు కూడా తక్కువ రేటుకు లభించే అవకాశం ఉంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×