// // Robot Vacuum Cleaners: మీ ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందా? జాగ్రత్త! -->
E-Paper
Advertisement

Robot Vacuum Cleaners: వీడెవడండి బాబు.. ఇంట్లో కూర్చొని 7వేల రోబోట్ వాక్యూమ్ క్లీనర్లను హ్యాక్ చేసేశాడు, ఎలాగంటే?

Robot Vacuum Cleaners: వీడెవడండి బాబు.. ఇంట్లో కూర్చొని 7వేల రోబోట్ వాక్యూమ్ క్లీనర్లను హ్యాక్ చేసేశాడు, ఎలాగంటే?
Advertisement

Robot Vacuum Cleaners: సాధారణంగా మన ఇంట్లో ఉండే రోబో వాక్యూమ్ క్లీనర్లు మనకు మాత్రమే సాయం చేస్తాయనుకుంటాం కానీ, అవే మన కొంప ముంచుతాయని ఎవరూ ఊహించి ఉండరు. సామీ అజ్దూఫల్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఎదురైన అనుభవం వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. తను కొన్న కొత్త DJI రోబో వ్యాక్యూమ్ క్లీనర్‌ను, తన దగ్గరున్న PS5 గేమ్‌ప్యాడ్‌తో కంట్రోల్ చేయాలని ఆతడు చిన్న ప్రయోగం చేశాడు. దీనికోసం ఏఐ సాయంతో ఒక యాప్‌ను కూడా రూపొందించాడు. కానీ ఆ యాప్‌ను రన్ చేయగానే ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే, ఆ ఒక్క యాప్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది వాక్యూమ్ క్లీనర్లను అజ్దూఫల్ కంట్రోల్ చేయగలిగాడు.

అతిపెద్ద సాంకేతిక లోపం:

అజ్దూఫల్ తన కొత్త డివైజ్‌ను కంట్రోల్ చేయాలనుకుంటే.. అది ఏకంగా 24 దేశాల్లో ఉన్న సుమారు 7 వేల పరికరాలకు యాక్సెస్ ఇచ్చేసింది. ఇది ఎంత ప్రమాదకరమంటే.. ఎక్కడో వేరే దేశంలో ఎవరో తమ ఇంట్లో వాడుకుంటున్న వ్యాక్యూమ్ క్లీనర్ కెమెరాను ఆన్ చేసి చూడొచ్చు. దానిలోని మైక్రోఫోన్ ద్వారా వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వినేయొచ్చు. అంటే.. మన పర్సనల్ లైఫ్ మొత్తం వేరొకరి చేతుల్లోకి వెళ్లేంత పెద్ద సెక్యూరిటీ లోపం అన్నమాట.

Advertisement

Also Read: టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ వచ్చేస్తోంది.. యాపిల్ యూజర్ల కల నెరవేరబోతున్నట్టేనా?

తప్పు ఎక్కడ జరిగింది?

ఇంత పెద్ద పొరపాటుకు కారణం ఆ కంపెనీకి చెందిన క్లౌడ్ సర్వర్లేనట. సాధారణంగా ఒక డివైజ్ క్లౌడ్ సర్వర్‌తో కనెక్ట్ అయినప్పుడు దానికొక సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. కానీ ఇక్కడ సర్వర్ దగ్గర స్ట్రాంగ్ సెక్యూరిటీ చెకింగ్ లేకపోవడంతో.. ఒక్కసారి ఒక టోకెన్‌తో లోపలికి వెళ్తే చాలు, సర్వర్‌లో ఉన్న మిగతా అందరి డేటాను కూడా చూసే అవకాశం దొరికింది. ఇది ఒకరి ఇంటి తాళంతో ఊర్లో ఉన్న ఇళ్లన్నీ తెరిచినట్టు అయ్యింది.

లైవ్ టెస్టింగ్‌లో షాకింగ్ నిజాలు:

Advertisement

ఈ లోపాలను నిరూపించడానికి అజ్దూఫల్ ఒక జర్నలిస్ట్ దగ్గరున్న వ్యాక్యూమ్ క్లీనర్ సీరియల్ నంబర్‌ను వాడి చెక్ చేశాడు. ఇక్కడే అతడికి మరింత గెట్టిగా షాక్ తగిలింది. ఆ క్లీనర్ ఎక్కడ ఉందో, దాని బ్యాటరీ ఎంతో, అది ప్రస్తుతం ఏ రూంని క్లీన్ చేస్తోంది అనే విషయాలతో పాటు ఆ ఇంటి పూర్తి మ్యాప్‌ను కూడా అతడు తన స్క్రీన్ మీద చూడగలిగాడు.

ఇంట్లోనే భద్రత కరువు:

మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. పిన్ నంబర్ లేకుండానే ఇతరుల వాక్యూమ్ క్లీనర్ వీడియో చూసే అవకాశం కూడా ఉందట. ఈ క్రమంలో మనం టెక్నాలజీ పెరుగుతోందని సంతోషపడుతున్నాం కానీ, ఇలాంటి స్మార్ట్ హోమ్ పరికరాల వల్ల మన ప్రైవసీ గాలిలో దీపంలా మారుతోంది. కంపెనీలు ఇప్పటికైనా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోకపోతే, రేపు పొద్దున మన ఇంట్లోనే మనకు భద్రత ఉండదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో ఒప్పో కొత్త బడ్స్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×