E-Paper
Advertisement

మన బాడీకి ఏం కావాలో ముందే చెప్పేసే Luna AI Band.. భారత్‌లో రిజిస్ట్రేషన్లు షురూ!

మన బాడీకి ఏం కావాలో ముందే చెప్పేసే Luna AI Band.. భారత్‌లో రిజిస్ట్రేషన్లు షురూ!
Advertisement

AI Health Tracker: ప్రముఖ టెక్ సంస్థ లూనా సరికొత్త హెల్త్ ట్రాకర్‌ను భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. లూనా బ్యాండ్ పేరుతో వస్తున్న ఈ పరికరం కేవలం డేటాను చూపించడమే కాకుండా.. వాయిస్ కమాండ్స్ ఆధారంగా రోజూవారీ ఆరోగ్య ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం దీని కోసం వెయిట్‌లిస్ట్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి.

డిజిటల్ హెల్త్ ప్లానర్:

సాధారణ ఫిట్‌నెస్ బ్యాండ్‌లు కేవలం మన శరీరానికి సంబంధించిన డేటాను మాత్రమే చూపిస్తాయి. కానీ ఈ లూనా బ్యాండ్ మాత్రం మన దినచర్యను ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది మన శరీర సంకేతాలను నిరంతరం గమనిస్తూ.. రక్త పరీక్షల వివరాలు, మెడికల్ హిస్టరీ, ఆహారపు అలవాట్లను విశ్లేషిస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించి ప్రతిరోజూ మనం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేలా ఒక ప్రణాళికను అందిస్తుంది.

ప్రత్యేకమైన అలర్ట్స్:

Advertisement

ఈ బ్యాండ్‌లో ఉండే హాప్టిక్ అలర్ట్స్ సిస్టమ్ యూజర్ల పరిస్థితిని బట్టి తగిన సూచనలు చేస్తుంది. ఉదాహరణకు: ఉదయాన్నే లేవగానే కాఫీ ఎప్పుడు తాగాలో, అలాగే ఆఫీసు పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో కూడా ఇది గుర్తు చేస్తుంది. దీనివల్ల వినియోగదారులు తమ పనులను మరింత సమర్థవంతంగా చేసుకోగలుగుతారు.

Also Read: ఎండలు మండిపోతున్నా నో వర్రీ.. మెడలో వేసుకుని స్మార్ట్ ACని తెచ్చిన సోనీ.. రేట్ ఎంతంటే?

వాయిస్ కమాండ్స్:

Advertisement

ఇందులో డేటాను మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారానే మనం తినే ఆహారం, చేసే వ్యాయామాలు, ఇతర అలవాట్లను రికార్డ్ చేయొచ్చు. అలాగే మన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సందేహాలనైనా నేరుగా లూనాను అడిగి తెలుసుకోవచ్చు. నిద్ర, పోషకాహారం, ఒత్తిడి వంటి అంశాలపై ఇది ఎప్పటికప్పుడు స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది.

త్వరలోనే డెలివరీ:

మొదటి విడత కింద లూనా బ్యాండ్‌ను కేవలం ఆహ్వానం (ఇన్వైట్) ఉన్నవారికి మాత్రమే విక్రయించనున్నారు. జూలై 2026 చివరి వారం నుండి దీని షిప్పింగ్ ప్రారంభం కానుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనుకునే వారు లూనా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇప్పుడే వెయిట్‌లిస్ట్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.

Also Read: జియో గేమ్ ఛేంజర్ ఆఫర్.. అన్ని బ్రాండ్ల కీప్యాడ్ ఫోన్లకూ రోజుకు రూ.4కే ప్లాన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×