// // Lumio Vision 9: వాట్సాప్‌తో టీవీని కంట్రోల్ చేయొచ్చు.. ఎలాగంటే? -->
E-Paper
Advertisement

ఏంటీ.. వాట్సాప్‌తో టీవీని ఆపరేట్ చేయొచ్చా? బడా బ్రాండ్లకి చుక్కలు చూపిస్తున్న Lumio TV ఫీచర్లు!

ఏంటీ.. వాట్సాప్‌తో టీవీని ఆపరేట్ చేయొచ్చా? బడా బ్రాండ్లకి చుక్కలు చూపిస్తున్న Lumio TV ఫీచర్లు!
Advertisement

Lumio Vision 9: కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకి మన దేశీయ బ్రాండ్ లుమియో గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఎడిషన్‌లో భాగంగా Lumio Vision 9, Lumio Vision 7 మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం టీవీ చూడటమే కాదు.. గేమింగ్ ఆడేవారికి, ఓటీటీ ప్రియులకు కూడా నచ్చేలా ఈ టీవీలను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇందులోని AI ఫీచర్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఏప్రిల్ 24 నుంచి ఇవి ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, ప్రముఖ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.

Vision 9తో థియేటర్ ఫీల్..

ఇంట్లోనే సినిమా థియేటర్ లాంటి ఫీలింగ్ కావాలంటే లుమియో విజన్ 9 బెస్ట్ ఆప్షన్. దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు, వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడా లాగ్ అవ్వదు. ఇక సౌండ్ విషయానికి వస్తే.. ఇందులో 50W హెక్సా డ్రైవర్ సిస్టమ్ ఉంది. దీంతో విడిగా స్పీకర్లు పెట్టుకోకపోయినా.. డాల్బీ అట్మోస్ పుణ్యమా అని మంచి ఆడియో వస్తుంది. దీనికి పెంటోనిక్ 700 ప్రాసెసర్ తోడవ్వడంతో టీవీ చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది.

Advertisement

Also Read: 20 రోజుల బ్యాటరీ లైఫ్, కళ్లు జిగేల్మనే డిస్‌ప్లే.. Amazfit Cheetah 2 Pro ఫీచర్లు చూశారా?

బడ్జెట్ ధరలో Vision 7..

తక్కువ ధరలో మంచి టీవీ కావాలనుకునే వారికి విజన్ 7 సరిపోతుంది. సాధారణంగా స్మార్ట్ టీవీల్లో స్టోరేజీ తక్కువగా ఉండటం వల్ల కొన్నాళ్లకు టీవీ స్లో అయిపోతుంది. కానీ ఈ టీవీలో ఏకంగా 64GB స్టోరేజీ ఇచ్చారు. దీనివల్ల మనకు నచ్చినన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరో మంచి విషయం ఏంటంటే.. దీనికి శాటిలైట్ పోర్ట్ కూడా ఉంది. తద్వారా ఫ్రీగానే డీడీ ఫ్రీ డిష్ ద్వారా సుమారు 540 ఛానళ్లను ఉచితంగా చూసేయొచ్చు.

వాట్సాప్ ద్వారా టీవీ కంట్రోల్..

Advertisement

ఈ టీవీల్లో అన్నిటికంటే వింతైన, కొత్త ఫీచర్ ‘ప్రాజెక్ట్ నియో’. దీనివల్ల మీరు వాట్సాప్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే టీవీని కంట్రోల్ చేయొచ్చు. మీకు నచ్చిన వీడియో లింక్‌ని మెసేజ్ చేస్తే చాలు.. టీవీలో ప్లే అయిపోతుంది. అలాగే ఇందులో TLDR 2.0 అనే ఫీచర్ ఉంది. ఇది మనకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో వాటిని ముందే కనిపెట్టి అలాంటి మూవీస్‌ను రికమెండ్ చేస్తుంది.

ధరలు ఇలా..

ఇకపోతే ఈ రెండు టీవీల ధరల విషయానికి వస్తే.. ప్రీమియం మోడల్ విజన్ 9 (65 ఇంచుల) ధర రూ.72,999 కాగా, బ్యాంక్ ఆఫర్లతో రూ.64,999కే వస్తుంది. ఇక విజన్ 7 విషయానికి వస్తే 43 ఇంచుల టీవీ రూ.29,999కి, 55 ఇంచుల టీవీ రూ.39,999కి లభిస్తాయి. ఏప్రిల్ 24 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు. రెండేళ్ల వారంటీ కూడా ఇస్తున్నారు కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా కొనుగోలు చేయొచ్చు.

Also Read: 4,500 నిట్స్ బ్రైట్‌నెస్.. వెనుక వైపు LED డిస్‌ప్లే, Infinix Note 60 Pro ఫీచర్లు అరాచకం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×