E-Paper
Advertisement

LPG షార్టేజ్ టెన్షన్, సిలిండర్ త్వరగా అయిపోకూడదంటే.. ఈ బ్లూ ఫ్లేమ్ ట్రిక్ తెలుసుకోవాల్సిందే!

LPG షార్టేజ్ టెన్షన్, సిలిండర్ త్వరగా అయిపోకూడదంటే.. ఈ బ్లూ ఫ్లేమ్ ట్రిక్ తెలుసుకోవాల్సిందే!
Advertisement

LPG gas cylinder shortage: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఎల్‌పీజీ కొరత చాలా పెరిగింది. సిలిండర్ బుక్ చేసినా సమయానికి రాకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో మనం వాడే గ్యాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా.. మనం స్టవ్ వెలిగించినప్పుడు మంట ఎప్పుడూ ‘నీలం’ రంగులోనే ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం రంగు మాత్రమే కాదు.. మీ సిలిండర్ ఎంత కాలం వస్తుందో చెప్పే సంకేతం కూడా.. ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ మంట నీలం రంగులో ఉండటానికి కారణం ఏంటి ?
మనం ఇంట్లో వాడే ఎల్‌పీజీ గ్యాస్‌లో ప్రధానంగా ప్రొపేన్ , బ్యూటేన్ ఉంటాయి. సైన్స్ పరంగా చూస్తే.. గ్యాస్ వెలిగినప్పుడు అది గాలిలోని ఆక్సిజన్‌తో సంపూర్ణంగా కలిస్తే.. అక్కడ ‘కంప్లీట్ కంబషన్’ జరుగుతుంది. ఆక్సిజన్ తగినంతగా అందినప్పుడు గ్యాస్ పూర్తిగా మండుతుంది. ఈ ప్రక్రియలో విడుదలయ్యే శక్తి మంటను నీలం రంగులోకి మారుస్తుంది. నీలం రంగు మంట అంటే అది చాలా వేడిని కలిగి ఉందని అర్థం.

Advertisement

ఒకవేళ మంట పసుపు రంగులో ఉంటే?
చాలా మంది గమనించే ఉంటారు. అప్పుడప్పుడు స్టవ్ మంట పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది మీ సిలిండర్ త్వరగా ఖాళీ అయిపోవడానికి ప్రధాన కారణం.

1. బర్నర్ రంధ్రాలలో దుమ్ము చేరడం వల్ల ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. అప్పుడు గ్యాస్ పూర్తిగా మండదు.

Advertisement

2. పసుపు రంగు మంట వల్ల గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా.. అది ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ , మసిని విడుదల చేస్తుంది. మీ వంట పాత్రలు నల్లగా మారుతున్నాయంటే.. మీ స్టవ్ గ్యాస్‌ను వృథా చేస్తోందని అర్థం.

సిలిండర్ కొరత ఉన్న టైంలో గ్యాస్‌ను ఆదా చేయడం ఎలా?
ప్రస్తుతం నెలకొన్న సిలిండర్ల కొరత దృష్ట్యా.. గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవడం ముఖ్యం.

1.నీలం మంటను మెయింటెన్ చేయండి: మీ స్టవ్ మంట పసుపు రంగులోకి మారితే వెంటనే.. బర్నర్‌ను క్లీన్ చేయండి. నీలం రంగు మంట వల్ల వంట త్వరగా అవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది.

2.పాత్రలపై మూతలు పెట్టండి: వంట చేసేటప్పుడు పాత్రలపై మూత పెట్టడం వల్ల ఆవిరి బయటకు పోకుండా వేడి లోపలే ఉండి 15% వరకు గ్యాస్‌ను ఆదా చేస్తుంది.

Also Read: ట్రిప్పు ఏదైనా.. కిక్కు ఇచ్చే వంట గ్యారెంటీ! గ్యాస్ లేకపోయినా దావత్!

3.ప్రెజర్ కుక్కర్ వాడకం: వీలైనంత వరకు ప్రెజర్ కుక్కర్ ఉపయోగించడం వల్ల గ్యాస్ వాడకం తగ్గుతుంది.

4. పాత్రల పరిమాణం: బర్నర్‌కు తగ్గట్టుగా పాత్రలను వాడండి. చిన్న గిన్నెను పెద్ద బర్నర్‌పై పెడితే మంట సైడ్ నుంచి వృథా అవుతుంది.

ఎల్‌పీజీ సిలిండర్ కోసం మరికొన్ని ట్కాలు:
కొరత సమయంలో పాత లేదా లీక్ అయ్యే సిలిండర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెలివరీ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

సీల్ చెక్ చేయండి: సిలిండర్ సీల్ పక్కాగా ఉందో లేదో చెక్ చేసుకోండి.

లీకేజ్ టెస్ట్: రెగ్యులేటర్ దగ్గర నీటిని పోసి బబుల్స్ వస్తున్నాయేమో గమనించండి.

ఎక్స్‌పైరీ డేట్: సిలిండర్ పైన ఉండే రింగుల దగ్గర A-26 లేదా B-27 వంటి కోడ్స్ ఉంటాయి. అవి సిలిండర్ గడువును సూచిస్తాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×