// // Induction Cooktop Utensils: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా ? -->
E-Paper
Advertisement

Induction Cooktop Utensils: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా? ఈ ‘మ్యాగ్నెటిక్’ చిట్కాలు తెలియకపోతే కష్టమే !

Induction Cooktop Utensils: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా? ఈ ‘మ్యాగ్నెటిక్’ చిట్కాలు తెలియకపోతే కష్టమే !
Advertisement

Induction Cooktop Utensils:  ప్రస్తుతం LPG గ్యాస్ కొరత కారణంగా చాలా మంది ఇళ్లలో వంట సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇండక్షన్ స్టవ్‌లు మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. కానీ అన్ని పాత్రలు ఇండక్షన్‌పై పనిచేయవు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇండక్షన్‌పై ఏ పాత్రలు వాడాలి? ఏవి వాడకూడదు? పనిచేయని వాటిని ఎలా గుర్తించాలి? వంటి ముఖ్యమైన విషయాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

LPG గ్యాస్ కొరత ప్రస్తుతం చాలా కుటుంబాలకు సమస్యగా మారింది. గ్యాస్ సిలిండర్ దొరకకపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల చాలా మంది ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లుతున్నారు. ఇవి ఉపయోగించడం చాలా సులభం, అంతే కాకుండా సురక్షితం కూడా.. వేగంగా వంట చేసేందుకు కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. అన్ని పాత్రలు ఇండక్షన్ స్టవ్‌పై పనిచేయవు. ఇండక్షన్ స్టవ్‌లు మాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా పని చేస్తాయి. అంటే.. మాగ్నెట్ ఆకర్షించే మెటల్‌తో చేసిన పాత్రలు మాత్రమే వీటిపై పనిచేస్తాయి. కాబట్టి సరైన పాత్రలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Advertisement

ఇండక్షన్‌పై పనిచేసే పాత్రలు:
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు చాలా వరకు ఇండక్షన్‌కు సరిపోతాయి. కానీ అన్ని స్టీల్ పాత్రలు కాదు. కింద భాగం మాగ్నెటిక్‌గా ఉండాలి. మీరు ఒక చిన్న మాగ్నెట్ తీసుకుని పాత్ర అడుగున పెట్టి చూస్తే అంటుకుంటే.. అది ఇండక్షన్‌కు ఉపయోగపడుతుంది.

కాస్ట్ ఐరన్ పాత్రలు కూడా ఇండక్షన్‌పై పనిచేస్తాయి. ఇవి వేడి నిల్వ చేసుకునే శక్తి ఎక్కువగా ఉండటంతో వంటకు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు దోసె తవ్వా, కడాయి వంటి వాటి కోసం ఇవి బెస్ట్.

Advertisement

ఇండక్షన్ కంపాటిబుల్ నాన్-స్టిక్ పాత్రలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా ఇండక్షన్ కోసం డిజైన్ చేసారు. వీటి కింద భాగం మాగ్నెటిక్ మెటల్‌తో ఉంటుంది.

ఇండక్షన్‌పై పని చేయని పాత్రలు:

1.అల్యూమినియం పాత్రలు సాధారణంగా ఇండక్షన్‌పై పనిచేయవు. ఎందుకంటే.. అవి మాగ్నెటిక్ కాదు. చాలా ఇళ్లలో ఎక్కువగా వాడే పాత్రలు ఇవే కావడం వల్ల సమస్యలు వస్తాయి.

2. కాపర్ (రాగి) పాత్రలు కూడా ఇండక్షన్ స్టవ్‌పై పని చేయవు. ఇవి వేడి బాగా పంచుతాయి కానీ మాగ్నెటిక్ ఫీల్డ్‌కు స్పందించవు.

3. గాజు లేదా సిరామిక్ పాత్రలు కూడా ఇండక్షన్‌కు పనికి రావు.

ఇండక్షన్‌‌కు ఉపయోగపడుతుందా లేదా ఎలా గుర్తించాలి?

1. పాత్రలు కొనే ముందు “Induction Compatible” అనే స్టికర్ ఉందా చూడాలి. ఇది ఉంటే.. ఆ పాత్ర ఇండక్షన్‌కు సరిపోతుంది.

2. ఇంకో సింపుల్ టెస్ట్ ఏంటంటే.. మాగ్నెట్ టెస్ట్. మాగ్నెట్ పాత్ర అడుగున అంటుకుంటే అది ఇండక్షన్‌పై పని చేస్తుంది.

3. పాత్ర అడుగు భాగం ఫ్లాట్‌గా ఉండాలి. కింద భాగం సరిగా లేకపోతే.. హీట్ సరైన విధంగా అందదు.

Also Read: ఇక స్టవ్‌తో పనిలేదు! ఈ మల్టీ-కుక్కర్ ఉంటే చాలు.. బిర్యానీ నుంచి సూప్ వరకు అన్నీ వండొచ్చు!

ఇండక్షన్ వాడకం వల్ల ప్రయోజనాలు:

ఇండక్షన్ స్టవ్ వాడటం వల్ల గ్యాస్‌పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది కాబట్టి త్వరగా వేడి అవుతుంది. అదనంగా సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటాయి. గ్యాస్ లీకేజ్ లాంటి ప్రమాదం ఉండదు.

LPG గ్యాస్ కొరత ఉన్న సమయంలో ఇండక్షన్ స్టవ్ ఒక మంచి ప్రత్యామ్నాయం. కానీ సరైన పాత్రలు వాడితేనే ఇది సరిగ్గా పని చేస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్ వంటి పాత్రలు వాడటం మంచిది. అల్యూమినియం, గాజు పాత్రలు కూడా ఇందుకు ఉపయోగపడవు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×