E-Paper
Advertisement

LPG ATM: దేశంలో తొలి గ్యాస్ ఏటీఎం.. ప్రత్యేకతలు ఏంటి? సిలిండర్ ఎలా పొందాలి!

LPG ATM: దేశంలో తొలి గ్యాస్ ఏటీఎం.. ప్రత్యేకతలు ఏంటి? సిలిండర్ ఎలా పొందాలి!
Advertisement

LPG ATM: దేశంలోనే మొట్టమొదటి LPG ATM అందుబాటులోకి వచ్చింది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కాకుండా ఈ వినూత్న సౌకర్యం హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram) నగరంలో ప్రారంభమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని.. భారత్ పెట్రోలియం (BPCL) ఈ ‘భారత్‌గ్యాస్ ఇన్‌స్టా ఎల్‌పీజీ’ (Bharatgas Insta LPG) మెషీన్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసింది.

సరిగ్గా ఎక్కడ ఉందంటే?

హర్యానా గురుగ్రామ్‌ నగరంలోని సెక్టార్ 33లో ఉన్న సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీ (Central Park Flower Valley)లో ఈ ఎల్‌పీజీ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం 24/7 అందుబాటులో ఉంటుందని భారత్ పెట్రోలియం ప్రతినిధులు తెలియజేశారు. గ్యాస్ బుకింగ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఏటీఎం వద్దకు సిలిండర్ తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. వినియోగదారుడు సరైన వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ మెషీన్ నుంచి 10 కిలోల గ్యాస్ ఉన్న ఫైబర్ కంపోజిట్ సిలిండర్లను పొందవచ్చని పేర్కొన్నారు.

LPG ATMను ఎలా ఉపయోగించాలి?

Advertisement

ఈ ఏటీఎం ద్వారా కేవలం 2 నుండి 3 నిమిషాల్లో మీరు నిండు సిలిండర్‌ను పొందవచ్చు. ఇందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా మెషీన్ స్క్రీన్‌పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం మీ ఫోన్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. తర్వాత మీ దగ్గర ఉన్న ఖాళీ కంపోజిట్ సిలిండర్‌పై ఉన్న బార్‌కోడ్ లేదా QR కోడ్‌ను మెషీన్ వద్ద స్కాన్ చేయాలి. చివరిగా డిజిటల్ పద్ధతిలో UPI లేదా డెబిట్ కార్డ్ ద్వారా డబ్బులు చెల్లించి.. మీ ఖాళీ సిలిండర్ ను మెషీన్ లో పెట్టాలి. అప్పుడు ఆ సిలిండర్ లోపలికి వెళ్లి గ్యాస్ తో నిండిన సిలిండర్ బయటకు వస్తుంది.

Also Read: BSNL Plans: రూ.1000లోపు బడ్జెట్లో.. అత్యుత్తమ BSNL ప్లాన్స్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఇక వదిలిపెట్టరు!

త్వరలో దేశవ్యాప్తంగా..!

Advertisement

అయితే ప్రస్తుతం ఇది కేవలం ‘భారత్‌గ్యాస్’ కంపోజిట్ సిలిండర్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా గురుగ్రామ్ పరిసర ప్రాంత వాసులు మాత్రమే ఈ LPG ATMను వినియోగించుకునేందుకు వీలుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి నగరాల్లో కూడా ఇలాంటి ఎల్‌పీజీ ఏటీఎంలు వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: LPG Weight: సిలిండర్ బరువు 14.2 కేజీలే ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×