E-Paper
Advertisement

రోజూ ఛార్జింగ్ పెట్టే పనిలేదు.. సూర్యరశ్మితో నడిచే సరికొత్త ఓపెన్-సోర్స్ స్మార్ట్‌వాచ్ ఇదే!

రోజూ ఛార్జింగ్ పెట్టే పనిలేదు.. సూర్యరశ్మితో నడిచే సరికొత్త ఓపెన్-సోర్స్ స్మార్ట్‌వాచ్ ఇదే!
Advertisement

LightInk solar smartwatch: స్మార్ట్‌వాచ్‌లు వాడటం బాగానే ఉంటుంది కానీ.. వాటికి రోజూ ఛార్జింగ్ పెట్టడమే పెద్ద తలనొప్పి. ఫోన్‌కి పెట్టినట్లు వాచ్‌కి కూడా పవర్ బ్యాంక్‌లు వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే.. ఈ ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెడుతూ ‘సోలార్ పవర్’, బ్యాటరీని ఆదా చేసే ‘ఇ-ఇంక్’ (E-Ink) డిస్‌ప్లేతో ఒక సరికొత్త స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్ ముందుకొచ్చింది. దాని పేరే ‘లైట్ ఇంక్’. ఓపెన్-సోర్స్ టెక్నాలజీతో డానియెల్ అన్సోరెగుయ్ రూపొందించిన ఈ ట్రెండీ అండ్ సస్టైనబుల్ స్మార్ట్‌వాచ్ గురించిన క్రేజీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

స్మార్ట్‌వాచ్‌లలో సరికొత్త విప్లవం ఈ ‘లైట్ ఇంక్’:

రోజుకో కొత్త స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి వస్తున్నా.. బ్యాటరీ లైఫ్ విషయంలో యూజర్లకు ఎప్పుడూ అసంతృప్తే. ఈ సమస్యను రూపుమాపడానికే టెక్ నిపుణులు ‘సోలార్ ఛార్జింగ్’ , ‘ఇ-ఇంక్ డిస్‌ప్లేల’ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లైట్ ఇంక్’ స్మార్ట్‌వాచ్.

Advertisement

అసలు ఏంటి ఈ లైట్ ఇంక్ వాచ్?
డేనియల్ అన్సోరెగుయ్ అనే ఎక్స్‌పర్ట్ 2019 లో మొదలుపెట్టిన డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఈ ‘లైట్ ఇంక్’. ఇది రెగ్యులర్ వాచ్ కాదు, ఒక ఓపెన్-సోర్స్ స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్. దీన్ని ESP32 మైక్రోకంట్రోలర్, కస్టమ్ డిజైన్ చేసిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ , 1.54-అంగుళాల ఎలక్ట్రోఫోరేటిక్ లేదా ఇ-ఇంక్ డిస్‌ప్లేతో తయారు చేశారు.

ఎండతో ఛార్జింగ్.. నెలల తరబడి బ్యాటరీ!
దీనిలో ప్రధాన ఆకర్షణ సోలార్ ప్యానెల్. వాచ్ ఫేస్ లోనే సూర్యరశ్మిని గ్రహించే ఒక చిన్న సోలార్ ప్యానెల్‌ను ఇంటిగ్రేట్ చేశారు. దీనికి తోడు 100mAh సామర్థ్యం ఉన్న చిన్న బ్యాటరీ ఉంటుంది. ఈ కాంబినేషన్ వల్ల వాచ్‌ను పదే పదే ఛార్జింగ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. సూర్యరశ్మితో ఆటోమేటిక్‌గా పవర్ తీసుకుని చాలా కాలం పాటు నిర్విరామంగా పనిచేస్తుంది.

Advertisement

అడ్వాన్స్‌డ్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:
సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లలో బ్లూటూత్, వైఫై ఆన్ చేస్తే బ్యాటరీ ఇట్టే కరిగిపోతుంది. కానీ ఇందులో కస్టమ్ పవర్-మేనేజ్‌మెంట్ సిస్టమ్ వాడారు. ESP32 ప్రాసెసర్ రెగ్యులర్ బూట్ ప్రాసెస్‌ను బైపాస్ చేసి.. ప్రత్యేకంగా RTC మెమరీ ద్వారా ప్రోగ్రామ్స్ రన్ చేస్తారు. దీనివల్ల ఈ వాచ్ కేవలం 1 మిల్లీసెకండ్ కంటే తక్కువ సమయంలోనే డీప్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయి పవర్‌ను విపరీతంగా సేవ్ చేస్తుంది.

డిజైన్ ,కనెక్టివిటీ ఫీచర్లు:
ఇలాంటి సోలార్ వాచ్‌లో ఫీచర్లు తక్కువ ఉంటాయనుకుంటే పొరపాటే. ఇందులో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వైఫై , బ్లూటూత్ , LoRa ఆప్షన్స్ ఉన్నాయి. 3D-ప్రింటెడ్ టెక్నాలజీతో తయారు చేసిన టూ-పీస్ కేస్‌లో దీన్ని అత్యద్భుతంగా అమర్చారు. దీనికి మనం బయట దొరికే ఏ స్టాండర్డ్ 22mm వాచ్ స్ట్రాప్స్‌ (బెల్ట్స్) అయినా ఈజీగా సెట్ చేసుకోవచ్చు.

Also Read: రూ.15 వేల బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్లు ఇవే.. ఇంట్లోనే సినిమా హాల్!

స్మార్ట్ వాచ్‌లలో అమోలెడ్ స్క్రీన్స్‌కు బదులుగా E-ink డిస్‌ప్లేలు వాడటం వల్ల అతిపెద్ద ప్రయోజనం “Outdoor Readability”. అంటే బయట ఎంతటి ఎండలో ఉన్నా అక్షరాలు పేపర్‌పై ప్రింట్ చేసినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. పైగా, ఇవి పర్యావరణానికి మేలు చేసే ప్రొడక్ట్స్ కావడంతో రాబోయే రోజుల్లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను ఇవే శాసించనున్నాయి.

భవిష్యత్తులో ఈ ట్రెండ్ ఎందుకు పెరగనుంది?

రాబోయే కాలంలో పదే పదే ఛార్జింగ్ పెట్టుకునే యాప్-హెవీ గ్యాడ్జెట్స్ కంటే.. సింపుల్ గా ఉండి ఎక్కువ కాలం పాడవకుండా ఉండే డివైజ్‌లకే డిమాండ్ ఉండబోతోంది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ వర్కర్స్, ట్రెక్కింగ్ చేసే ట్రావెలర్స్, ఔట్‌డోర్ యూజర్లకు ఈ సోలార్ పవర్డ్ ఓపెన్-సోర్స్ వాచెస్ చాలా ఉపయోగపడతాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×