E-Paper
Advertisement

రూ.8 వేలకే హోమ్ థియేటర్ సెటప్.. 20W స్పీకర్లు, మైక్స్‌తో ROAR ప్రొజెక్టర్ వచ్చేసింది!

రూ.8 వేలకే హోమ్ థియేటర్ సెటప్.. 20W స్పీకర్లు, మైక్స్‌తో ROAR ప్రొజెక్టర్ వచ్చేసింది!
Advertisement

Lifelong ROAR Projector: సినిమా అంటే జస్ట్ టైమ్ పాస్ మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఈ వారం సినిమా చూడలబ్బా అని తెగ ఆలోచిస్తుంటారు మూవీ లవర్స్. అలా అని ప్రతిసారీ థియేటర్‌కు వెళ్లాలంటే కుదరదు కదా. ఎందుకంటే థియేటర్ అంటే ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే చాలామంది ఇంట్లోనే హోమ్ థియేటర్ సెట్ చేసుకోవాలని అనుకుంటుంటారు. మీకూ అలాంటి ప్లాన్ ఉంటే.. ప్రముఖ లైఫ్ లాంగ్ కంపెనీ రోర్ ప్రొజెక్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. పేరుకు తగ్గట్టే దీని పర్ఫార్మెన్స్ కూడా పవర్‌‌ఫుల్‌గా ఉంటుంది. భారతదేశంలోనే తొలిసారిగా సరౌండ్ సౌండ్, పైగా కచేరీ సపోర్ట్‌తో వచ్చిన ప్రొజెక్టర్ ఇదేనట.

వినోదం డబుల్..

సాధారణంగా మంచి ప్రొజెక్టర్ కొనాలంటే బడ్జెట్ దాటిపోతుందేమో అని భయపడతాం. కానీ లైఫ్ లాంగ్ వారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ను దృష్టిలో పెట్టుకుని క్రేజీ ప్రైస్ ట్యాగ్‌తో దీన్ని తెచ్చారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ ప్రొజెక్టర్ జస్ట్ రూ.7,999కే అందుబాటులో ఉంది. ఒక స్మార్ట్‌ఫోన్ ధర కంటే తక్కువలోనే ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే హోమ్ థియేటర్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కు షాక్.. ఈసారి బ్లాక్ కలర్ లేనట్టే, iPhone 18 Proలో ఊహించని మార్పులు!

సౌండ్ అదిరిపోద్ది..

ప్రొజెక్టర్ అంటే కేవలం వీడియో బాగుంటే సరిపోదు.. సౌండ్ కూడా దద్దరిల్లాలి కదా. అందుకే ఇందులో 20 వాట్ల హైబాస్ స్పీకర్లను ఇచ్చారు. ఈ ప్రొజెక్టర్ ద్వారా సినిమా చూస్తున్నా లేదంటే లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా.. లైవ్‌లో ఉన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. దీనితో పాటు రెండు వైర్‌లెస్ మైక్‌లు కూడా ఫ్రీగా వస్తాయి. దీనిలో వాయిస్ మార్చే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి.. వీటితో పిల్లలు కూడా ఆడుకోవచ్చు.

థియేటర్ స్క్రీన్ మాదిరిగానే..

Advertisement

ఈ ప్రొజెక్టర్ ఏకంగా 150 అంగుళాల వరకు పెద్ద స్క్రీన్‌ను అందిస్తుంది. దీంతో మన ఇంటి గోడ మొత్తం ఒక సినిమా థియేటర్ స్క్రీన్‌లా మారిపోతుందన్నమాట. అలాగే దీనిలో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ ముందే ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. మీరు విడిగా ఏమీ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.

బడ్జెట్‌లో బెస్ట్ గ్యాడ్జెట్..

అంతేకాదు.. మీ ఫోన్ స్క్రీన్‌ను నేరుగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సినిమా చూసే మూడ్ లేకపోతే.. దీన్ని ఒక బ్లూటూత్ స్పీకర్‌లా కూడా వాడుకోవచ్చు. లెన్స్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ. తక్కువ బడ్జెట్‌లో ఇంతకంటే బెస్ట్ హోమ్ ఎంటర్‌టైనర్ దొరకడం కష్టమే అని చెప్పాలి.

Also Read: ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. 7,000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో Realme C100 5G లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×