E-Paper
Advertisement

LG OLED AI Smart TV: ప్రపంచంలోనే అతిపెద్ద OLED Smart TVని లాంచ్ చేసిన LG.. తొలిసారిగా AI ఫీచర్‌!

LG OLED AI Smart TV: ప్రపంచంలోనే అతిపెద్ద OLED Smart TVని లాంచ్ చేసిన LG.. తొలిసారిగా AI ఫీచర్‌!
Advertisement

LG OLED AI Smart TV: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ LGకి మార్కెట్‌‌లో మంచి డిమాండ్ ఉంది. స్మార్ట్‌ఫోన్స్, ఫ్రిడ్జ్, ఏసీ, స్మార్ట్‌టీవీల రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ కంపెనీ మరొక ముందడుగు వేసింది. భారతదేశంలో మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన స్మార్ట్ టీవీల సిరీస్‌ని విడుదల చేసింది.

ఈ సిరీస్‌లలో ప్రపంచంలోనే అతిపెద్ద OLED Smart TV కూడా ఉంది. ఇది భారీ అంగుళాల స్మార్ట్‌టీవీ. దాదాపు 97 అంగుళాల 4K తో వస్తుంది. ఈ TV LG స్వంత α11 AI ప్రాసెసర్, webOSలో నడుస్తుంది. ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే..

Advertisement

LG OLED AI Smart TV Features

ఈ LG కొత్త సిరీస్ 42 అంగుళాల నుండి 97 అంగుళాల వరకు స్మార్ట్ టీవీలను కలిగి ఉంది. ఈ టీవీలు 4K రిజల్యూషన్, HDMI 2.1 పోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లతో వస్తాయి. NVIDIA G-SYNC, AMD FreeSync సర్టిఫికేట్ కూడా పొందాయి. ఈ స్మార్ట్ టీవీలను గేమింగ్ మానిటర్‌లుగా కూడా ఉపయోగించవచ్చు.

Advertisement

Also Read: బ్రాండెడ్ స్మార్ట్‌టీవీపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే కోనేయండిలా!

LG ప్రకారం.. ఈ టీవీలు AI అప్‌స్కేలింగ్, AI పిక్చర్ ప్రో వంటి టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి. దీనితో పాటు కలర్‌ను మెరుగుపరచడానికి LG AIని కూడా ఉపయోగిస్తోంది. OLED మోడల్స్ కాకుండా.. LG QNED టెక్నాలజీతో కొన్ని స్మార్ట్ టీవీలను కూడా విడుదల చేసింది. ఈ టెక్నాలజీ క్వాంటం డాట్, నానోసెల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

ఇది 20-బిట్ ఖచ్చితత్వాన్ని అందిస్తుందని LG పేర్కొంది. ఈ టీవీ వర్చువల్ 9.1.2 సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఈ కొత్త సిరీస్ LGలో అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యేక ఫీచర్లు.. 5 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ (webOS), Dolby Atmos, Dolby Visionను కలిగి ఉంది. అదనంగా ఈ టీవీలు Apple AirPlay, Google Chromecast వంటి వైర్‌లెస్ స్క్రీన్/కంటెంట్ షేరింగ్ టెక్నాలజీలతో కూడా అమర్చబడి ఉంటాయి.

Also Read: Realme GT 6T Launch: అతిపెద్ద కూలింగ్ సిస్టమ్‌తో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్.. రేపే లాంచ్!

LG OLED AI Smart TV Price

LG కొత్త AI TV సిరీస్ 43-అంగుళాల QNED82T మోడల్‌తో ప్రారంభమవుతుంది. దీని ధర రూ.62,990గా కంపెనీ నిర్ణయించింది. 65 అంగుళాల LG QNED90T (మినీ LED) ధర రూ.1,89,990గా ఉంది. అదేవిధంగా అత్యంత సరసమైన 42-అంగుళాల OLED మోడల్ ధర రూ.1,19,990 కాగా.. 55-అంగుళాల LG OLED evo G4 AI ధర రూ.2,39,990గా ఉంది. అయితే ఇది కాకుండా 97 అంగుళాల 4K LG ఫ్లాగ్‌షిప్ LG OLED97G4 స్మార్ట్‌టీవీ రూ.20,49,990 ధరతో రిలీజ్ అయింది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×