E-Paper
Advertisement

LG Essential Series ACs: ఎల్జీ కొత్త ఏసీలు వచ్చేశాయ్.. తక్కువ బడ్జెట్‌లో సూపర్ ఫీచర్లు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

LG Essential Series ACs: ఎల్జీ కొత్త ఏసీలు వచ్చేశాయ్.. తక్కువ బడ్జెట్‌లో సూపర్ ఫీచర్లు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!
Advertisement

LG Essential Series ACs: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ (LG).. భారత మార్కెట్ లో సరికొత్త ఏసీలను లాంచ్ చేసింది. ‘ఎసెన్షియల్ సిరీస్’ (Essential Series) ఎయిర్ కండిషనర్ల పేరిట వీటిని తీసుకొచ్చింది. 2026 వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇంతకీ ఈ కొత్త ఏసీల ప్రత్యేకతలు ఏంటీ? వాటిలోని అడ్వాన్స్డ్ ఫీచర్లు ఏవి? ఇప్పుడు పరిశీలిద్దాం.

2026 బీఈఈ రేటింగ్

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) 2026కు గాను నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఈ ఏసీలను ఎల్జీ తయారు చేసింది. ఫలితంగా ఇవి పాత మోడల్స్ కంటే తక్కువ విద్యుత్ ను వినియోగించి.. ఎక్కువ కూలింగ్ ను అందిస్తాయి. తద్వారా పవర్ బిల్లు సైతం ఆదా చేసుకోవచ్చు.

స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ

Advertisement

ఎసెన్షియల్ సిరీస్ ఏసీల్లో స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ ను అమర్చారు. ఇది గదిలోని వేడిని బట్టి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. ఇతర ఏసీలతో పోలిస్తే తక్కువ శబ్దంతో పనిచేస్తుంది. విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించడంలోనూ ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ సాయపడుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

6-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్

ఈ కొత్త సిరీస్ ఏసీల్లో 6-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ మోడ్స్ ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి ఏసీ కెపాసిటీని 6 రకాలుగా మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. విపరీతమైన ఎండ ఉన్నప్పుడు దీనిలోని విరాట్ మోడ్ ను ఆన్ చేస్తే 109 శాతం కెపాసిటీతో అత్యంత వేగంగా గదిని చల్లబరుస్తుంది. అలాగే డైట్ మోడ్యయ గదిలో తక్కువ మంది ఉన్నప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు 78 శాతం వరకు కరెంటును ఆదా చేస్తుంది.

మరికొన్ని కీలక ఫీచర్లు

Advertisement

ఎసెన్షియల్ సిరీస్ ఏసీల్లో మరికొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు సైతం ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏసీ కాయిల్స్ తుప్పు పట్టకుండా ప్రత్యేకమైన కోటింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్టెబిలైజర్ అవసరం లేకుండానే 140V నుంచి 295V వరకు వోల్టేజ్ హెచ్చుతగ్గులను ఇది తట్టుకోగలదు. కొత్త ఏసీల కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారంటీని LG అందిస్తోంది.

Also Read: Dishwasher Tips: డిష్ వాషర్‌ను గుడ్డిగా వాడేస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. మిషన్ పని గోవిందా!

ధర ఎంతంటే?

ఈ ఎసెన్షియల్ సిరీస్ ఏసీల ప్రారంభ ధరను రూ.28,901గా ఎల్జీ నిర్ణయించింది. కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఏసీ కోరుకునే మిడిల్ క్లాస్ వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఈ సిరీస్ లో 1 టన్ నుంచి 1.5 టన్ వేరియంట్లలో 3 స్టార్, 5 స్టార్ రేటింగ్స్‌తో ఏసీలు లభిస్తాయని కంపెనీ వర్గాలు తెలియజేశాయి. ఎల్జీ అధికారిక వెబ్ సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎల్జీ స్టోర్స్, రిటైల్ షాపుల్లోనూ ఈ ఏసీలు అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: AC Cleaning Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. దెబ్బకు సెట్ అవుతుంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×