E-Paper
Advertisement

Best Refrigerators: బెస్ట్ బడ్జెట్ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్.. స్మార్ట్ ఫీచర్లు ఎక్కువ.. కరెంట్ వాడకం తక్కువ!

Best Refrigerators: బెస్ట్ బడ్జెట్ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్.. స్మార్ట్ ఫీచర్లు ఎక్కువ.. కరెంట్ వాడకం తక్కువ!
Advertisement

Best Refrigerators: సమ్మర్‌లో కూలర్లు, ఏసీలకే కాదు.. ఫ్రిడ్జ్‌లకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంటారనే ఉద్దేశంతో కొన్ని కంపెనీలు ఫ్రిడ్జ్‌ల ధరలను అమాంతం పెంచేస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోLG 380 L Double Door Refrigerator, Whirlpool 300 L Triple Door Refrigerator బడ్జెట్ ధరకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండు రిఫ్రిజిరేటర్లో ఏది తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేస్తుందో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.

స్టోరేజ్ విషయానికొస్తే..

డిజైన్ గురించి మాట్లాడుకుంటే.. LG ఫ్రిడ్జ్ చూడటానికి ఓల్డ్ మోడల్లోనే డబుల్ డోర్‌తో సింపుల్‌గా ఉంటుంది. కానీ దీనిలో 380 లీటర్ల భారీ స్పేస్ ఉంది. ఇది బిగ్ ఫ్యామిలీస్‌కి లేదా ఫ్రిడ్జ్‌లో ఎక్కువ పదార్థాలు పెట్టుకోవాలి అనుకుంటే బాగా సెట్ అవుతుంది. ఇక వర్ల్‌పూల్ విషయానికి వస్తే.. ఇది మూడు డోర్లతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని కెపాసిటీ 300 లీటర్లే అయినప్పటికీ, ఇందులో కూరగాయల కోసం కింద విడిగా ఒక డోర్ ఇచ్చారు. దీనివల్ల వేరే వస్తువుల వాసన కూరగాయలకు అంటుకోదు, పైగా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Advertisement

Also Read: వావ్.. సోలార్‌ పవర్‌తో పనిచేసే ఈ స్టవ్ గురించి మీకు తెలుసా?

కరెంట్ బిల్లు ఎక్కువ రావొద్దంటే?

టెక్నాలజీ పరంగా చూస్తే.. LG మోడల్‌లో ‘స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్’ ఉంటుంది. దీనివల్ల సౌండ్ అస్సలు రాదు. కరెంట్ కూడా తక్కువ ఖర్చవుతుంది. దీనిలో ఉన్న ‘డోర్ కూలింగ్+’ అనే ఫీచర్ ఫ్రిడ్జ్ లోపల ప్రతి మూలకు చల్లదనాన్ని సమానంగా అందిస్తుంది. అటు వర్ల్‌పూల్‌లో ‘సిక్త్స్ సెన్స్ యాక్టివ్ ఫ్రెష్’ అనే టెక్నాలజీ ఉంది. ఇది ఆహార పదార్థాల్లో తేమ ఆరిపోకుండా చూస్తుంది. అలాగే దీనిలో 5 రకాల విభిన్న జోన్లు ఉండటం వల్ల, ఏ వస్తువుకు ఎంత చల్లదనం కావాలో అంత మాత్రమే సెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

రెండూ 3 స్టార్ రేటింగే:

Advertisement

ఈ రెండు ఫ్రిడ్జ్‌లు కూడా 3 స్టార్ రేటింగ్ ఉన్నవే. దీంతో కరెంట్ బిల్లు గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. LGలో ఉన్న మంచి విషయం ఏంటంటే, వోల్టేజ్ అప్పుడప్పుడు అటు ఇటు అయినా సరే స్టెబిలైజర్ అవసరం లేకుండానే చాలా సేఫ్‌గా పనిచేస్తుంది. పదార్థాలు పెట్టుకునే ప్లేస్ విషయంలో మాత్రం LG కొంచెం బెటర్ అనే చెప్పాలి.

ఏది కొంటే బెటర్?

ఇంట్లో మనుషులు ఎక్కువ ఉండి.. ఫ్రిడ్జ్‌లో ఎక్కువ పదార్థాలు పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి అనుకుంటే కళ్లు మూసుకుని LG 380 లీటర్ల మోడల్ తీసేసుకోండి. లేదు, మాకు కూరగాయలు విడిగా ఉండాలి, చూడటానికి ఫ్రిడ్జ్ లుక్ క్లాసీగా ఉండాలి అనుకుంటే మాత్రం వర్ల్‌పూల్ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేయొచ్చు.

Also Read: ఏసీ నుంచి వచ్చే ఈ 5 శబ్దాలను నిర్లక్ష్యం చేస్తే.. కంప్రెషర్ పేలిపోతుంది జాగ్రత్త!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ప్రయోజనాలు.. ఆయా కంపెనీలపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×