E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో..బ్రాండెడ్ టీవీ! సూపర్ సౌండ్, క్రిస్టల్ క్లియర్ పిక్చర్

తక్కువ బడ్జెట్‌లో..బ్రాండెడ్ టీవీ! సూపర్ సౌండ్, క్రిస్టల్ క్లియర్ పిక్చర్
Advertisement

LG 32 Inch HD Ready LED TV: చిన్న గదులకు, బెడ్‌రూమ్‌లకు లేదా మీడియం సైజ్ ఇళ్లకు సరిపోయే ఒక మంచి బ్రాండెడ్ టీవీని తక్కువ ధరలో.. ఎంచుకోవడం చాలా కీలకం. టీవీల్లో అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా పేరుగాంచిన ఎల్జీ (LG), బడ్జెట్ ధరలో అందించే అద్భుతమైన మోడల్ LG 32 Inch LED HD Ready TV. కేవలం రూ. 16,699 లభిస్తున్న ఈ టీవీ అద్భుతమైన కలర్స్, డైనమిక్ సౌండ్, లాంగ్ లైఫ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

LG 32 Inch LED HD Ready TV పూర్తి వివరాలు:

డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ:

ఈ టీవీ చాలా స్లిమ్‌గా, స్టైలిష్ బెజెల్స్‌తో వస్తుంది. ఇది మీ బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్ స్థలాన్ని చాలా ఆకర్షణీయంగా మారుస్తుంది. ఎల్జీ బ్రాండ్ నాణ్యతతో కూడిన గట్టి మెటీరియల్‌తో దీనిని తయారు చేయడం వల్ల చాలా కాలం పాటు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తుంది. టేబుల్ టాప్‌పై పెట్టడానికి లేదా గోడకు హాంగ్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది.

పిక్చర్ క్వాలిటీ అండ్ డిస్ప్లే:

Advertisement

ఈ టీవీలో 32 ఇంచీల HD Ready (1366 x 768 Pixels)డిస్ప్లే ఇచ్చారు. ఇందులో ఎల్జీకి చెందిన ప్రత్యేక ‘Dynamic Color Enhancer’ టెక్నాలజీ ఉంది. దీని వల్ల ప్రతీ పిక్చర్ లో రంగులు చాలా ప్రకాశవంతంగా, ప్రకృతిసిద్ధంగా కనిపిస్తాయి. ఇందులో ఉన్న అడ్వాన్స్‌డ్ పిక్చర్ ప్రాసెసర్ రంగులు, కాంట్రాస్ట్ , ఇమేజ్ షార్ప్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసి మనకు స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది.

ఆడియో క్వాలిటీ అండ్ DTS వర్చువల్ FX:

సాధారణ బడ్జెట్ టీవీలలో సౌండ్ క్వాలిటీ అంతగా ఉండదు, కానీ ఎల్జీ ఇందులో చాలా శ్రద్ధ తీసుకుంది. ఇందులో.. ఇచ్చే పవర్‌ఫుల్ స్పీకర్లు ‘DTS Virtual:X’ ఆడియో టెక్నాలజీతో పనిచేస్తాయి. దీని వల్ల ఎలాంటి అదనపు స్పీకర్లు లేకుండానే టీవీ నుంచి చుట్టూ వ్యాపించేలా థియేటర్ తరహా సరౌండ్ సౌండ్ ఫీల్ లభిస్తుంది. క్లియర్ వాయిస్ సపోర్ట్ ఉండటం వల్ల డైలాగ్‌లు చాలా స్పష్టంగా వినిపిస్తాయి.

ఇన్-బిల్ట్ గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్:

Advertisement

ఈ టీవీ కేవలం సీరియల్స్, సినిమాలు చూడటానికే కాకుండా కాలక్షేపం కోసం ఇందులో ఇన్-బిల్ట్ గేమింగ్ ఫీచర్‌ను కూడా అందించారు. ఎలాంటి ఇంటర్నెట్ లేదా ప్రత్యేక గేమింగ్ కన్సోల్ అవసరం లేకుండానే టీవీ రిమోట్‌తో కొన్ని సరదా గేమ్‌లను ఆడుకోవచ్చు. ఇది ఇంట్లో ఉన్న పిల్లలకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తుంది.

కనెక్టివిటీ :

కనెక్టివిటీ విషయంలో ఇందులో సెట్‌టాప్ బాక్స్ లేదా గేమింగ్ కాన్సోల్ కనెక్ట్ చేయడానికి HDMI పోర్ట్‌లు, పెన్‌డ్రైవ్‌లో ఉన్న సినిమాలు, పాటలు, ఫోటోలను టీవీ స్క్రీన్‌పై చూడటానికి USB పోర్ట్‌లను ఇచ్చారు.

మొత్తానికి రూ. 16,699 బడ్జెట్‌లో ఒక టాప్ బ్రాండ్ నుంచి నమ్మకమైన క్వాలిటీ, క్లియర్ డిస్ప్లే, అదిరిపోయే సౌండ్ కోరుకునే వారికి ఈ టీవీ ఒక బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×