E-Paper
Advertisement

బాబోయ్.. ఇంత పెద్ద టీవీనా? LG 115 అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్.. గేమర్లకు ఇక పండగే!

బాబోయ్.. ఇంత పెద్ద టీవీనా? LG 115 అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్.. గేమర్లకు ఇక పండగే!
Advertisement

LG 115 Inch QNED TV: సినిమా అంటే మన తెలుగు వాళ్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే చాలామంది ఇంట్లోనే సినిమా థియేటర్‌ను తలపించేలా పెద్ద పెద్ద టీవీలను కొని తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ ఏకంగా 115 అంగుళాల భారీ స్క్రీన్‌తో కూడిన ‘QNED Evo Mini LED’ టీవీని మార్కెట్లోకి తెస్తోంది. దీనిని టీవీ అనడం కంటే.. గోడకు తగిలించే మినీ థియేటర్ స్క్రీన్ అనడం కరెక్ట్ ఏమో. ఇప్పడీ టీవీ ధర, ఫీచర్లు, పూర్తి వివరాలేంటో చూసేద్దాం..

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ..

ఈ టీవీలో ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్‌ను వాడారు. దీంతో మనం ఏం చూస్తున్నామో ఈ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు గమనిస్తూ పిక్చర్ క్వాలిటీని, సౌండ్‌ని ఆటోమేటిక్‌గా పెంచేస్తుంది. అలాగే దీనిలో కలర్స్ ఎంత నేచురల్‌గా ఉంటాయంటే.. మనం టీవీ చూస్తున్నామా లేక కళ్లముందు లైవ్‌లో జరుగుతుందా అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా డార్క్ సీన్లలో కూడా చిన్న చిన్న విషయాలు మిస్ అవ్వకుండా చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

Advertisement

Also Read: రూ.20,000 బడ్జెట్‌లో రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్.. Note 15కి Note15 SEకి ఉన్న తేడా ఇదే!

గేమింగ్ ప్రియులకు పండగే..

చాలామందికి పెద్ద టీవీల్లో గేమ్స్ ఆడితే స్లోగా ఉంటాయనే అపోహ ఉంటుంది. కానీ ఎల్‌జీ దానిని పూర్తిగా అబద్ధమని నిరూపించింది. ఈ టీవీలో రిఫ్రెష్ రేట్‌ని ఏకంగా 330 హెర్ట్జ్ వరకు పెంచుకోవచ్చు. దీనివల్ల కార్ రేసింగ్ లేదంటే స్పీడ్‌గా యాక్షన్ గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా ఉంటుంది. గేమర్స్ కోసం స్పెషల్‌గా ఒక గేమింగ్ పోర్టల్ కూడా దీని ద్వారా అందించారు.

మీ మాటే ఇక్కడ శాసనం..

Advertisement

ఈ టీవీ మనకు కావాల్సిన సమాచారాన్ని చిటికెలో అందిస్తుంది. అలాగే ఇందులో గూగుల్ జెమిని, కోపైలట్ వంటి ఏఐ అసిస్టెంట్లు ఉండటం వల్ల మనకు ఏదైనా సమాచారం కావాలన్నా నేరుగా టీవీని అడిగేయొచ్చు. ఇక స్పోర్ట్స్ లవర్స్ కోసం స్పోర్ట్స్ అలర్ట్స్ ఫీచర్ ఇచ్చారు. ఒకవేళ వేరే ఏదైనా ప్రోగ్రాం చూస్తున్నా.. మీఫేవరెట్ టీమ్ స్కోర్ ఎంత అయిందో స్క్రీన్‌పైనే తెలిసిపోతుంది.

థియేటర్‌ను తలపించే సౌండ్ సిస్టమ్..

ఇక సౌండ్ విషయానికి వస్తే.. దీని స్పీకర్లు ఇచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. ఏఐ సౌండ్ ప్రో టెక్నాలజీ వల్ల మన చుట్టూ స్పీకర్లు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీంతో థియేటర్‌లో లాగా సౌండ్ చుట్టూ వినిపిస్తూ మనల్ని ఆ సీన్‌లోకి తీసుకెళ్తుంది. 115 అంగుళాలతో పాటు 100 అంగుళాల వరకు వివిధ సైజుల్లో ఇవి రానున్నాయి. అయితే ఈ టీవీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Also Read: ఈ ట్రిక్ తెలిస్తే.. ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌నైనా వైర్‌లెస్ ఛార్జింగ్ ఫోన్‌గా మార్చేయొచ్చు, ఎలాగంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×