E-Paper
Advertisement

రూ. 5వేలలోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రూ. 5వేలలోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Levoit Core Mini Air Purifier: ఈ రోజుల్లో కాలుష్యం కారణంగా స్వచ్ఛమైన గాలి పీల్చడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా మన బెడ్‌రూమ్‌లు, ఆఫీస్ రూమ్స్‌లో ..ఉండే కంటికి కనిపించని దుమ్ము, అలర్జీలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీనికి బెస్ట్ అండ్ బడ్జెట్ సొల్యూషన్‌గా మార్కెట్లోకి వచ్చింది Levoit Core Mini Air Purifier. కేవలం రూ. 4,998 ఆఫర్ ధరలోనే లభించే.. ఈ సూపర్ కూల్ గ్యాడ్జెట్ మీ రూమ్ గాలిని స్వచ్ఛంగా మార్చడమే కాదు, మంచి సువాసనలను కూడా అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

త్రీ-లేయర్ అడ్వాన్స్‌డ్ ఫిల్ట్రేషన్ టెక్నాలజీ:

ఈ ప్యూరిఫైయర్‌లో చాలా పవర్‌ఫుల్ త్రీ-స్టేజ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ను అందించారు. దీని లోని ప్రీ-ఫిల్టర్ గాలిలో ఉండే పెద్ద దుమ్ము రేణువులను, జంతువుల జుట్టును లాగేసుకుంటుంది. ఆ తర్వాత ఉండే H13 గ్రేడ్ ట్రూ HEPA ఫిల్టర్ గాలిలో.. ఉండే 99.97% అతి సూక్ష్మ కణాలను, అలర్జీ కారకాలను పూర్తిగా తొలగిస్తుంది. చివరగా.. ఉండే యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ గదిలోని వంట వాసనలను, పొగను, ఇతర చెడు వాసనలను పీల్చేసుకుని స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతుంది.

ఆరోమాథెరపీ ఫీచర్‌:

Advertisement

చాలా ఎయిర్ ప్యూరిఫైయర్లలో కేవలం గాలి మాత్రమే శుభ్రం అవుతుంది. కానీ Levoit Core Mini లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది. అదే ఆరోమాథెరపీ. దీనిలోని చిన్న ట్రేలో మీకు నచ్చిన కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ చుక్కలను వేస్తే చాలు.. గాలి క్లీన్ అవ్వడంతో పాటు రూమ్ మొత్తం అద్భుతమైన సువాసనలతో నిండిపోతుంది. ఇది రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

అతి తక్కువ శబ్దం:

చిన్నగా, స్టైలిష్‌గా ఉండే ఈ డివైజ్ VortexAir 3.0 టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. అంటే గది నలుమూలల నుంచి చెడు గాలిని లాక్కుని, 360 డిగ్రీల కోణంలో స్వచ్ఛమైన గాలిని వేగంగా పంపిణీ చేస్తుంది. ఇది నడుస్తున్నప్పుడు కేవలం 25 డెసిబెల్స్ శబ్దాన్ని మాత్రమే చేస్తుంది. అంటే మన ఇంట్లో ఉండే ఏసీ లేదా చిన్న ఫ్యాన్ కంటే కూడా చాలా తక్కువ సౌండ్ వస్తుంది. రాత్రి వేళల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది తన పని తాను చేసుకుపోతుంది.

కరెంట్ బిల్లు:

Advertisement

ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడితే కరెంట్ బిల్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది అని చాలా మంది భయపడతారు. కానీ.. Levoit Core Mini కేవలం 7W పవర్ రేటింగ్‌తో పని చేస్తుంది. అంటే మనం వాడే ఒక చిన్న ఎల్‌ఈడీ బల్బ్ అంత కరెంట్ మాత్రమే ఇది తీసుకుంటుంది. రోజంతా ఆన్‌లో.. ఉంచినా కూడా ఖర్చు పెరగదు. దీని బరువు కూడా కేవలం 1 కేజీ మాత్రమే ఉండటం వల్ల, ఒక రూమ్ నుంచి మరొక రూమ్‌కి చాలా ఈజీగా మార్చుకోవచ్చు.

మీరు చిన్న బెడ్‌రూమ్‌లు, స్టడీ రూమ్స్ లేదా ఆఫీస్ డెస్క్‌ల కోసం ఒక తక్కువ ధరలో ప్రీమియం బ్రాండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలని చూస్తుంటే రూ. 4,998 బడ్జెట్‌లో లభించే.. Levoit Core Mini కి మించిన మరో బెస్ట్ ఆప్షన్ లేదు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×