E-Paper
Advertisement

కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల ప్లేబ్యాక్.. Lenovo Yoga Earbuds ప్రత్యేకతలు ఇవే!

కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల ప్లేబ్యాక్.. Lenovo Yoga Earbuds ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Lenovo Yoga Earbuds: ప్రముఖ టెక్ సంస్థ లెనోవో తమ యోగా ప్రొడక్ట్ లైనప్‌లో భాగంగా సరికొత్త ట్రూ వైర్‌లెస్ నోయిస్ క్యాన్సిలింగ్ ఇయర్‌బడ్స్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త సాంకేతికత, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ధర ఎంతంటే?

చైనాలో ఈ లెనోవో యోగా ఇయర్‌బడ్స్ అసలు ధర దాదాపు రూ.8,300గా ఉంది. అయితే కంపెనీ ఇచ్చిన ఇంట్రడక్టరీ ఆఫర్ కింద పరిమిత కాలం పాటు దీనిని రూ.7,200కే సొంతం చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన పేల్ ఆఫ్‌వైట్ కలర్‌లో లభించే ఈ బడ్స్‌ను ప్రస్తుతానికి జేడీ డాట్ కామ్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

నోయిస్ క్యాన్సిలేషన్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్‌లో 12.2 మిమీ పవర్‌ఫుల్ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇవి 40 డెసిబెల్స్ వరకు బయటి శబ్దాలను అడ్డుకునే యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో వస్తాయి. ప్రతి బడ్‌లో మూడు మైక్రోఫోన్లు ఉంటాయి. ఇవి వాయిస్‌ప్రింట్ రికగ్నిషన్, ఎన్విరాన్‌మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీల సహాయంతో ఆన్‌లైన్ మీటింగ్‌లు లేదా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను పూర్తిగా తగ్గించి అవతలి వారికి స్పష్టమైన వాయిస్‌ను అందిస్తాయి.

Also Read: షాకింగ్ ఫీచర్లు.. అమేజ్‌ఫిట్ నుంచి ఒకేసారి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధరలు ఇవే!

స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు:

Advertisement

లెనోవో యోగా పీసీలతో ఇవి క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. కేస్ ఓపెన్ చేయగానే కంప్యూటర్ స్క్రీన్‌పై కనెక్షన్ పాప్‌అప్ కనిపిస్తుంది. అంతేకాదు.. వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న రెండు డివైజ్‌లకు దీనిని ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్‌బడ్స్‌పై కేవలం మూడు సార్లు ట్యాప్ చేయడం ద్వారా సులువుగా ఒక డివైజ్ నుండి మరో డివైజ్‌కు మారిపోవచ్చు.

36 గంటల ప్లేబ్యాక్:

నోయిస్ క్యాన్సిలేషన్ లేకుండా ఇవి ఒకే ఛార్జ్‌పై 7 గంటల ప్లేబ్యాక్ ఇస్తాయి. కేస్‌తో కలిపి మొత్తం 36 గంటల పాటు వాడుకోవచ్చు. ఒకవేళ ఏఎన్‌సీ ఆన్ చేస్తే కేస్‌తో కలిపి 24 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటల ప్లేబ్యాక్ వచ్చేలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. కేవలం 4.7 గ్రాముల బరువుండే ఈ బడ్స్, చెమట, నీటి చినుకుల నుండి రక్షణ కోసం ఐపీఎక్స్4 రేటింగ్‌తో వస్తాయి.

Also Read: గూగుల్‌లో పొరపాటున కూడా ఈ 5 విషయాలను వెతకకండి.. ఎందుకో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×