E-Paper
Advertisement

ల్యాప్‌టాప్ చరిత్రలోనే మొదటిసారి.. 96GB గ్రాఫిక్స్ మెమరీతో Lenovo Yoga Pro 7!

ల్యాప్‌టాప్ చరిత్రలోనే మొదటిసారి.. 96GB గ్రాఫిక్స్ మెమరీతో Lenovo Yoga Pro 7!
Advertisement

Lenovo Yoga Pro 7: ప్రీమియం ల్యాప్‌టాప్ మార్కెట్లోకి లెనోవో ఒక పవర్‌ఫుల్ డివైజ్‌ను సైలెంట్‌గా తీసుకొచ్చింది. అదే ‘లెనోవో యోగా ప్రో 7’. సాధారణంగా భారీ వర్క్‌స్టేషన్లలో మాత్రమే కనిపించే అద్భుతమైన ఫీచర్లను ఈ సన్నని, తేలికపాటి ల్యాప్‌టాప్‌లో అమర్చడం విశేషం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డెవలపర్లు, హెవీ వీడియో ఎడిటర్లను దృష్టిలో ఉంచుకుని లెనోవో ఈ మోడల్‌ను డిజైన్ చేసింది.

ఒకే చిప్‌తో భారీ ప్రదర్శన:

ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో విడిగా ఎలాంటి గ్రాఫిక్స్ కార్డ్ ఉండదు. AMD సరికొత్త ‘స్ట్రిక్స్ హాలో’ ప్లాట్‌ఫామ్‌పై ఇది పనిచేస్తుంది. ఇందులో ఉండే రైజెన్ AI మ్యాక్స్+ 388 ప్రాసెసర్, రేడియాన్ 8060S ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఒకే చిప్‌పై కలిసి పనిచేస్తాయి. దీంతో ల్యాప్‌టాప్ ఎక్కువ వేడెక్కకుండా, బ్యాటరీని తక్కువగా వాడుకుంటూనే డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్‌కు సమానమైన పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది.

Advertisement

Also Read: కొంపముంచిన చిప్‌ల కొరత.. వివో ఫోన్ల రేట్లు పెరిగాయి.. కొత్త ధరలు ఇవే!

మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్ మెమరీ:

ఈ ల్యాప్‌టాప్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం దీని మెమరీ పూల్. ఇందులో గరిష్టంగా 128GB వరకు RAM లభిస్తుంది. అయితే ఇందులో నుంచే ఏకంగా 96GB వరకు మెమరీని కేవలం గ్రాఫిక్స్ (VRAM) కోసమే కేటాయించుకోవచ్చు. ఇది సాదాసీదా పనుల కోసం కాదు కానీ, భారీ AI మోడల్స్ రన్ చేయడానికి, క్లౌడ్ కంప్యూటింగ్‌తో పనిలేకుండా లోకల్‌గానే పెద్ద డేటాసెట్‌లను ప్రాసెస్ చేయడానికి అమితంగా ఉపయోగపడుతుంది.

అద్భుతమైన డిస్‌ప్లే, డిజైన్:

Advertisement

పెర్ఫార్మెన్స్‌కు తగ్గట్టుగానే దీని స్క్రీన్ క్వాలిటీ కూడా అదిరిపోయేలా ఉంది. దీనిలో 15 అంగుళాల OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 165Hz రీఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కాబట్టి.. కలర్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. ఇంతటి పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ అయినప్పటికీ, ఇది కేవలం 1.71 కేజీల బరువుతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

ధర ఎంతంటే?

ఎమ్‌డబ్ల్యూసీ (MWC) ఈవెంట్ ప్రకారం దీని ప్రారంభ ధర దాదాపు రూ.1.75 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టు కల్లా మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే భారత మార్కెట్లో దీని విడుదలపై లెనోవో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇండియాలోకి వస్తే గనుక దీని ధర రూ.2 లక్షల పైమాటే అని చెప్పాలి. క్లౌడ్ సర్వర్ల ఖర్చును తగ్గించుకోవాలనుకునే టెక్ ప్రియులకు ఇది బెస్ట్ ఆప్షన్.

Also Read: iOS 27 కోడ్‌లో కీలక ఆధారాలు.. ఫోల్డబుల్ iPhone పేరు ఇదేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×