E-Paper
Advertisement

Lenovo Legion Y960 గేమింగ్ హెడ్‌సెట్ విడుదలైంది.. బడ్జెట్ ధరలో సూపర్ ఫీచర్లు!

Lenovo Legion Y960 గేమింగ్ హెడ్‌సెట్ విడుదలైంది.. బడ్జెట్ ధరలో సూపర్ ఫీచర్లు!
Advertisement

Lenovo Legion Y960: గేమర్లను ఆకట్టుకునేలా ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో సరికొత్త ‘లెజియన్ Y960’ గేమింగ్ హెడ్‌సెట్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఫిజికల్ 7.1 ఛానల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో వచ్చిన ఈ హెడ్‌సెట్.. గేమింగ్ ప్రియులకు సరికొత్త ఆడియో అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం ఇది బ్లాక్, సిల్వర్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ధర ఎంతంటే?

చైనాలో ఈ లెనోవో లెజియన్ Y960 హెడ్‌సెట్ ధరను 599 యువాన్లుగా నిర్ణయించారు. మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.7,100 వరకు ఉంటుంది. లెనోవో అధికారిక ఆన్‌లైన్ స్టోర్లతో పాటు ప్రముఖ రిటైల్ భాగస్వాముల ద్వారా వినియోగదారులు దీనిని కొనుగోలు చేయవచ్చు.

అద్భుతమైన ఆడియో క్వాలిటీ:

Advertisement

ఈ హెడ్‌సెట్‌లో ఆరు డ్రైవర్ల ప్రత్యేక ఆకృతిని అందించారు. ఇందులో రెండు 40mm మెయిన్ డ్రైవర్లు, నాలుగు 20mm సెకండరీ డ్రైవర్లు ఉన్నాయి. ఇవి హైరెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో వస్తాయి. ఈ హెడ్‌సెట్ డిజైన్ బయటి శబ్దాలు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల గేమ్ ఆడుతున్నప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా స్పష్టమైన సౌండ్ వినబడుతుంది.

Also Read: 6000mAh బ్యాటరీ, 7 ఏళ్ల అప్‌డేట్స్‌తో Motorola Razr Fold విడుదల.. ధర ఎంతంటే?

ప్రత్యేక సౌండ్ మోడ్స్:

Advertisement

యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఇందులో గేమ్, మ్యూజిక్, సినిమా అనే మూడు ఆడియో మోడ్స్‌ను ఇచ్చారు. వైర్‌కు ఉండే ఇన్‌లైన్ కంట్రోలర్ సాయంతో ఈ మోడ్స్‌ను మార్చుకోవచ్చు. అలాగే గేమ్‌లో శత్రువుల అడుగుజాడలను, శబ్దాలను సులభంగా గుర్తించేందుకు ‘సౌండ్‌ప్రింట్ పర్స్పెక్టివ్’ అనే ప్రత్యేక ఫీచర్ కూడా ఇందులో ఉంది.

ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ:

అలాగే మాట్లాడుకునేందుకు వీలుగా ఇందులో ఒక డిటాచబుల్ మైక్రోఫోన్ ఉంది. ఇది ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి.. చుట్టుపక్కల శబ్దాలను తగ్గించి వాయిస్‌ను క్లియర్‌గా పంపుతుంది. ఈ హెడ్‌సెట్ బరువు 346 గ్రాములు ఉంటుంది. దీనిని తలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చాలా సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ఇది యూఎస్‌బీ టైప్-సి, టైప్-ఎ కనెక్టివిటీతో పీసీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, గేమింగ్ కన్సోల్‌లకు సులభంగా కనెక్ట్ అవుతుంది.

Also Read: రూ.30 వేల బడ్జెట్‌లో.. ఐపీ69 రేటింగ్‌, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో కుమ్మేయడానికి వచ్చేస్తోన్న రెడ్‌మీ కొత్త ఫోన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×