// // Lenovo IdeaPad Slim 3 Gen 11: 15 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల బ్యాకప్! -->
E-Paper
Advertisement

Lenovo నుంచి భారత్‌లోనే తయారైన సరికొత్త AI Laptop లాంచ్.. ప్రైస్ ఎంతంటే?

Lenovo నుంచి భారత్‌లోనే తయారైన సరికొత్త AI Laptop లాంచ్.. ప్రైస్ ఎంతంటే?
Advertisement

Lenovo IdeaPad Slim 3 Gen 11:ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లోకి సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ‘ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11’ పేరుతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు, క్రియేటర్ల రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించింది. పూర్తి ఏఐ ఫీచర్లతో ఇన్-ఇండియా మేకింగ్‌గా వస్తున్న ఈ ల్యాప్‌టాప్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

అత్యాధునిక డిస్‌ప్లే:

ఈ కొత్త ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది విండోస్ 11 సాయంతో మెరుగైన ఏఐ అనుభూతిని అందిస్తుంది. దీనిలో వేగవంతమైన గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ ఆర్క్ కార్డ్స్ అమర్చారు. అలాగే 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ 14 ఇంచులు, 15 ఇంచుల స్క్రీన్ సైజుల్లో లభిస్తోంది. కళ్లకు అలసట కలగకుండా ఉండేందుకు ఇందులో ట్యూవ్ సర్టిఫైడ్ బ్లూ లైట్ టెక్నాలజీని ఉపయోగించారు.

Advertisement

Also Read: సింగిల్ ఛార్జ్‌తో మూడ్రోజులు నాన్‌స్టాఫ్‌గా వాడొచ్చు.. moto g37 POWER ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్:

ఈ ల్యాప్‌టాప్ లుక్ పరంగా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. లూనా గ్రే కలర్‌లో లభించే ఈ డివైజ్‌లో టైపింగ్ సులభంగా ఉండేలా మంచి కీబోర్డ్ ఇచ్చారు. అవసరాన్ని బట్టి బ్యాక్‌లిట్ కీబోర్డ్, ప్రైవసీ షట్టర్‌తో కూడిన ఎఫ్‌హెచ్‌డీ కెమెరాను ఎంచుకోవచ్చు. వైఫై 6, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ, హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. ఇక ఇందులో 60 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఇది రాపిడ్ ఛార్జ్ బూస్ట్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటల పాటు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ధర, ఆఫర్ల వివరాలు:

Advertisement

భారతదేశంలో లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 ప్రారంభ ధర రూ.1,09,990గా ఉంది. దీనిని లెనోవో అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. వినియోగదారులు తమకు నచ్చిన కాన్ఫిగరేషన్‌ను ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. లాంచ్ ఆఫర్ కింద 12 నెలల నో-కాస్ట్ ఈఎమ్‌ఐ, రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. అలాగే కేవలం రూ.999లకే ఏడాది పాటు పెర్‌ప్లెక్సిటీ ప్రో మెంబర్‌షిప్‌ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: ధర తక్కువే కానీ, సౌండ్ మాత్రం ఊరమాస్.. ఈ రేంజ్ బేస్ ఇచ్చే సౌండ్ బార్‌ను ఎప్పుడైనా చూశారా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×